దేశమా.. విదేశమా.. వేదిక ఏదైనా సరే.. మా బలమైన ఆయుధం ఇదే అంటున్న టాటా మోటార్స్

టాటా మోటార్స్ (tata motors) భారతదేశంలో ఎప్పుడూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ఆటోమొబైల్ దిగ్గజం. అయితే, తాజాగా విడుదలైన ఆగస్టు 2025 అమ్మకాల గణాంకాలు కొంత ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టాయి. ప్యాసింజర్ కార్ల విభాగంలో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. అయితే, కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగం మాత్రం తన వేగాన్ని నిలబెట్టుకుంది. దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతులను కలుపుకుని చూస్తే, టాటా మోటార్స్ ఆగస్టు నెలలో మొత్తం 43,315 ప్యాసింజర్ కార్లను రవాణా చేసింది. ఇది గత సంవత్సరం ఇదే నెలలో నమోదైన 44,486 యూనిట్లతో పోలిస్తే సుమారు 1,171 వాహనాలు తక్కువ.

ఈ తగ్గుదల కారణంగా సంవత్సరానికి సంవత్సరంగా 3 శాతం నష్టాన్ని కంపెనీ ఎదుర్కొన్నట్లయింది. అయితే ఇది పెద్ద తగ్గుదల కాదని చెప్పొచ్చు, ఎందుకంటే ఆటోమొబైల్ రంగం మొత్తం మీద ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. టాటా మోటార్స్ ఆగస్టు 2025 అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, రెండు వైపులా విభిన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో కొంత వెనకడుగు వేసినప్పటికీ, ఎగుమతుల పరంగా మాత్రం కంపెనీ గణనీయమైన పురోగతిని నమోదు చేసింది.

Tata Motors Passenger Vehicle August 2025 Sales Reported 43315 Units

దేశీయంగా చూస్తే, టాటా మోటార్స్ ఆగస్టు నెలలో 41,001 యూనిట్ల విక్రయాలు నమోదు చేసింది. ఇది 2024 ఆగస్టులో విక్రయించిన 44,142 యూనిట్లతో పోలిస్తే 7.12 శాతం తగ్గుదల. ఈ తగ్గుదలకు ప్రధాన కారణం సాధారణ ప్యాసింజర్ కార్ల డిమాండ్ తగ్గిపోవడమే. వినియోగదారుల కొనుగోలు శక్తిలో వచ్చిన మార్పులు, అలాగే పోటీదారుల నుండి వచ్చిన కొత్త మోడళ్లు ఈ ఫలితాన్ని మలిచినట్లు అనిపిస్తోంది.

అయితే, ఎగుమతుల పరంగా టాటా మోటార్స్ ప్రదర్శన పూర్తిగా భిన్నంగా ఉంది. గత నెలలో కంపెనీ మొత్తం 2,314 యూనిట్లను విదేశీ మార్కెట్లకు సరఫరా చేసింది. ఇది 2024 ఆగస్టులో ఎగుమతి చేసిన కేవలం 344 యూనిట్లతో పోలిస్తే దాదాపు 1,970 యూనిట్ల పెరుగుదల. అలాగే, సవాళ్లను దాటుకుని టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను బలంగా నిలబెట్టుకోవడంలో విజయవంతమైంది.

Tata Motors Passenger Vehicle August 2025 Sales Reported 43315 Units

నెక్సాన్ EV, టిగోర్ EV, పంచ్ EV వంటి మోడళ్లు మార్కెట్‌లో బలమైన డిమాండ్‌ను కొనసాగిస్తుండటంతో కంపెనీకి ఒక రకంగా ఊరట లభిస్తోంది. సంప్రదాయ ఇంజిన్ కార్ల అమ్మకాలలో చిన్న స్థాయి పడిపోవడం గమనించదగ్గ విషయం అయినప్పటికీ, కంపెనీ దృష్టి ఇప్పుడు స్పష్టంగా భవిష్యత్‌దిశగా, ముఖ్యంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మలుపు తిరిగింది.

ఎలక్ట్రిక్ వాహనాల విభాగం బలంగా ముందుకు సాగుతోంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, ఆగస్టు 2025లో టాటా మోటార్స్ మొత్తం 8,540 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసింది. ఇది గత ఏడాది ఇదే నెలలో రవాణా చేసిన 2,605 యూనిట్లతో పోలిస్తే 44 శాతం వృద్ధి సాధించినట్టుగా కనిపిస్తోంది. అంటే, సాధారణ ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో స్వల్పంగా తగ్గుదల వచ్చినప్పటికీ, EV సెక్టార్‌లో మాత్రం కంపెనీకి బలమైన ఆయుధంగా ఉంది.

Tata Motors Passenger Vehicle August 2025 Sales Reported 43315 Units

ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణం టాటా మోటార్స్ అందిస్తున్న EV మోడళ్లు. వినియోగదారులు ఇంధన ధరల పెరుగుదలతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తుండటంతో, ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి మరింతగా పెరిగింది. దీని ఫలితంగా, టాటా మోటార్స్ EV విభాగంపై ప్రత్యేక దృష్టితో లాభాలను గడించాలని చూస్తోంది. ఎలక్ట్రిక్ మొబిలిటీని కేంద్రీకృత వ్యూహంగా మార్చుకుని, మరిన్ని లేటెస్ట్ EV మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 3, 2025, 14:25 [IST]
English summary
Tata motors passenger vehicle august 2025 sales reported 43315 units
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+