రతన్ టాటా కంపెనీకే షాక్ ఇచ్చిన జనాలు.. జూన్‌లో పడిపోయిన టాటా మోటార్స్ సేల్స్.. ఎందుకిలా జరిగింది?

ప్రయాణికుల సేఫ్టీ కోసం అత్యున్నత సేఫ్టీ నాణ్యత ప్రమాణాలతో కార్లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) తాజాగా జూన్ నెలకు సంబంధించిన అమ్మకాల వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, ఈ నెలలో కంపెనీ 37,237 యూనిట్ల ప్యాసింజర్ వాహనాల అమ్మకాలను నమోదు చేసింది. ఇది గడిచిన ఏడాది ఇదే కాలంలో ఉన్న 43,624 యూనిట్లతో పోలిస్తే సుమారుగా 15 శాతం తగ్గుదలను సూచిస్తోంది. మార్కెట్‌లో సాధారణంగా ఉన్న వాణిజ్య ప్రతికూల పరిస్థితులు, మార్పులు కారణంగా కొనుగోలు ధోరణులు ఈ తగ్గుదలకు కారణమయ్యాయని మార్కెట్ వర్గాల వారు భావిస్తున్నారు. అయితే, పెట్రోల్, డీజిల్ వాహనాల అమ్మకాల్లో వెనకడుగు కనిపించగా, ఎలక్ట్రిక్ విభాగం మాత్రం నిరంతర వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ మొత్తంలో 5,228 యూనిట్ల ఈవీలు అమ్ముడుపోయాయి.

ఇది గత ఏడాది ఇదే నెలలో నమోదైన ఈవీ అమ్మకాలతో పోలిస్తే 12 శాతం వృద్ధిని చూపిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి స్థిరంగా పెరుగుతూనే ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ నెలలో అన్ని వాహనాల అమ్మకాలు దేశీయంగా 65,019 యూనిట్లగా నమోదయ్యాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 74,147 యూనిట్లతో పోలిస్తే దాదాపు 12 శాతం తగ్గుదలను చూపిస్తోంది.

Tata Motors Passenger Vehicle Sales

త్రైమాసిక వారీగా చూసినట్లయితే, టాటా మోటార్స్ మొత్తం 2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి జూన్ వరకు మూడు నెలల కాలంలో, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లను కలిపి మొత్తం 2,10,415 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 2,29,891 యూనిట్లతో పోలిస్తే దాదాపు 8 శాతం తగ్గుదలను సూచిస్తుంది. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలను చూసినట్లయితే త్రైమాసికంలో 1,24,809 యూనిట్ల అమ్మకాలు నమోదు చేయగలిగింది.

ఇది 2024లో ఇదే త్రైమాసికంలో ఉన్న 1,38,682 యూనిట్లతో పోలిస్తే 10 శాతం తగ్గుదల అని అర్ధమవుతోంది. అంతేకాదు, వాణిజ్య వాహనాల విభాగం కూడా గతేడాది స్థాయిని నిలుపుకోలేకపోయింది. ఈ కేటగిరీలో 85,606 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఇది 2024లోని గణాంకాలతో పోలిస్తే సుమారుగా 6 శాతం తగ్గుదలను చూపిస్తోంది. ట్రాన్స్‌పోర్ట్, నిర్మాణ రంగాల డిమాండ్‌లో కొంత ఆర్ధిక మాంద్యం, ఖర్చుల పెరుగుదల ఈ తగ్గుదలకు కారణమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Tata Motors June 2025 Sales report

ఈ త్రైమాసికం గణాంకాలు చిన్న వెనుకడుగు అయినా, రాబోయే నెలల్లో పండుగ సీజన్, కొత్త లాంచ్‌ల ద్వారా పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు త్రైమాసికంలో 16,231 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 16,579 యూనిట్లతో పోలిస్తే కొంచెం వెనుకబడి, 2 శాతం తగ్గుదలను సూచిస్తుంది.

సంవత్సరపు ప్రారంభంలో స్థిరంగా కొనసాగిన ఈవీ అమ్మకాలు, త్రైమాసికం ముగియేసరికి కొంచెం వెనకడుగు వేసినట్లు ఈ గణాంకాలు వివరిస్తున్నాయి. అయినప్పటికీ, జూన్ నెల వారీగా చూసినట్లయితే పెరుగుదల కనిపించడం గమనార్హం. మే, జూన్ నెలల్లో టాటా మోటార్స్ మాత్రమే కాకుండా పరిశ్రమ అంతటా డిమాండ్‌లో కొంత వెనకడుగు స్పష్టమయ్యింది. దీనిని కంపెనీ కూడా నిస్సహాయంగా అంగీకరించింది.

Tata Motors Electric Vehicle Sales

వినియోగతారుల ఖర్చు తగ్గుదల, మార్కెట్లో ఉన్న అస్థిరతల వల్ల అమ్మకాల‌పై భారీ భారం పడి, పలు విభాగాల్లో తగ్గుదల కనిపించింది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రం ప్రత్యేకంగా నిలిచాయి. టాటా ఇటీవల లాంచ్ చేసిన హారియర్ EV, కొత్త ఆల్ట్రోజ్ మొదట్లోనే అనుకూలమైన మార్కెట్‌ను పొందాయి. వీటికి తోడుగా రానున్న పండగ టైంలో కొత్త మోడళ్లు వచ్చే అవకాశం ఉంది. దాంతో టాటా అమ్మకాలు తిరిగి పుంజుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 1, 2025, 17:35 [IST]
English summary
Tata motors passenger vehicle sales 15 percent down in june 2025 more details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+