చాలా తక్కువ ధరలో టాటా కార్లు.. అప్‌డేటెడ్ వెర్షన్‌లో వచ్చేస్తున్నాయ్.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు పండగే!
భారతీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాటా మోటార్స్ పేరుని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుబాటు ధరల్లో క్వాలిటీతో కూడిన కార్లను అందిస్తూ ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీని ఇస్తోంది. మాస్ మార్కెట్‌తో పాటు క్లాస్ టచ్‌తో ప్రతీ కస్టమర్ నుంచి మన్ననలు అందుకుంటూ మార్కెట్లో జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తుంది. ఈ 2025 సంవత్సరంలో వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు పక్కా ప్లాన్‌తో టాటా మోటార్స్ వస్తోంది. తమ కారు లైన్ -అప్ నుంచి మూడు అప్‌డేటెడ్ వెర్షన్స్ లేదా ఫేస్‌లిఫ్ట్‌లో తీసుకురావాలని యోచిస్తోంది. వీటి ధర కేవలం రూ.6 నుంచి 11 లక్షల మధ్యలో అండే అవకాశం ఉంది.
ప్రీమియం వెహికల్స్‌పై దృష్టి సారిస్తూనే మరోవైపు ఎంట్రీ -లెవెల్ కార్ సెగ్మెంట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది టాటా సంస్థ. ఈ సంస్థ నుంచి రాబోతున్న అప్‌డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కంపెనీ నుంచి టాటా పంచ్.. అతి తక్కువ కాలంలోనే భారత వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 2024లో టాప్ సెల్లింగ్ కారుగానూ నిలిచింది.

ఈ ఏడాది ఈ మైక్రో ఎస్‌యూవీకి సంబంధించి మరో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను తీసుకురానుంది టాటా సంస్థ. ఈవీల తరహాలో ఉండే డిజైన్ ఎలిమెంట్స్‌తో దీన్ని అప్గ్రేడ్ చేసి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇందులో షార్ప్ LED DRL, వెల్ కమ్ యానిమేషన్, వర్టికల్లీ పొజిషన్‌డ్ LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ వంటివి ఈ మైక్రో ఎస్‌యూవీకి అట్రాక్టివ్ లుక్‌ని అందించనున్నాయి. రీడైజన్ చేసిన అప్పర్ గ్రిల్, లోయర్ గ్రిల్ ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ కొత్త టాటా పంచ్ కారులో రీడిజైన్ చేసిన డ్యాష్‌బోర్డు ఉండనుంది. ఈ కారు కొత్త అప్‌హోల్‌స్టరీ(upholstery)తో వివిధ రంగుల్లో లభించనుంది. 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంతో ఉండే ఈ కారులో వైర్లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఇది 1.2 లీటర్ పెట్రోల్, పెట్రోల్ సీఎన్‌జీ ఇంజిన్లతో ఉండనుంది.

టాటా సంస్థ నుంచి పాపులర్ అయిన మరో కారు టాటా టియాగో. ఈ సంవత్సరం ఈ కారుకు సంబంధించి రెండో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చి, పోటీ పెంచేందుకు ప్లాన్ చేస్తోంది టాటా సంస్థ. కారు ఖర్చు తగ్గించడం కోసం దీని షీట్ మెటల్‌లో కొన్ని మార్పులు చేసి తీసుకురానుంది. ఇందులో కొత్త బంపర్లు, రీవైజ్ చేసిన హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్, కొత్త అలాయ్ వీల్స్ ఉండనున్నాయి.
ఇక ఇంటీరియర్ అప్డేట్స్ విషయానికి వస్తే ఇందులో USB టైప్ -C పోర్ట్ తో పాటు ప్రస్తుతం ఉన్న 7 అంగుళాల కంటే పెద్ద సైజులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉండనుంది. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్, పెట్రోల్- సీఎన్‌జీ ఇంజిన్లతో రానుంది. ప్రస్తుతం ఉన్న గేర్ బాక్స్ ఆప్షన్లే రానున్న కారులోనూ ఉండనున్నాయి.

టాటా సంస్థ నుంచి అదరగొట్టిన మరో కారు టాటా టిగోర్. ఈ మోడల్ ఈ ఏడాది కీలకమైన అప్డేట్‌లతో రానుంది. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ విషయానికి వస్తే ఇందులో మిర్రర్స్ మొదలుకుని బంపర్స్, రివైజ్డ్ లైటింగ్ ఎలిమెంట్స్ సహా అల్లాయ్ వీల్స్ వరకు అప్డేట్ చేసి దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇంటీరియర్ అప్డేట్స్ చూస్తే... పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, USB టైప్-సి పోర్ట్‌లు ఉంటాయి.
టాటా టిగోర్ లో ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ పెట్రోల్, పెట్రోల్-సీఎన్ జీ ఇంజిన్లనే రానున్న అప్డేటెడ్ కారు మోడల్‌లోనూ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. గేర్ బాక్స్ ఆప్షన్లలో కూడా పెద్ద మార్పులేవీ ఉండబోవని సమాచారం. ఒకవేళ ఇంజిన్లను గనుక మార్చకపోతే దీని పర్ఫార్మెన్స్ విషయంలోనూ పెద్దగా మార్పు ఉండదనే చెప్పవచ్చు.
అప్డేట్లతో రానున్న ఈ కార్ మోడళ్ల ద్వారా... కస్టమర్లను ఆకర్షించి, అమ్మకాలు పెంచుకోవాలని చూస్తోందీ టాటా సంస్థ. సేఫ్టీ, ఇన్నోవేషన్ విషయంలో రాజీ పడబోమని చెబుతూనే భారత మార్కెట్లో ఎంట్రీ-లెవెల్ సెగ్మెంట్లో తమ మోడల్స్ ద్వారా పోటీ పెంచాలని భావిస్తోంది. కావున 2025లోనూ టాటా కార్ల హవా కొనసాగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








