టాటా మాస్టర్ ప్లాన్ అదిరిపోతుంది.. ఇకపై ఎలక్ట్రిక్ కారులో నాన్‌స్టాప్ రైడ్ ఎంజాయ్ చేయండి!

భారతదేశంలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యంత అధునాతన ప్రమాణాలతో కార్లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన దిగ్గజ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (tata motors) గత కొన్నేళ్లుగా సాంప్రదాయ ఇంధన వాహనాలను విడుదల చేస్తూనే అదే సమయంలో ఎలక్ట్రిక్ కార్లను కూడా తీసుకొస్తూ దేశంలోనే టాప్ ఈవీ మేకర్‌గా ఉంది. కంపెనీ ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ కార్ల(ev) కోసం ఛార్జింగ్ పాయింట్లను దేశవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా ఏర్పాటు చేయడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. తాజాగా కంపెనీ నుంచి ఈ విషయంపై కీలక ప్రకటన వెలువడింది. ఇండియాలో ఛార్జింగ్ స్టేషన్ల ఇప్పుడు ఉన్న వాటి కంటే రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. మామూలుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే సంస్థల్లో టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో తన కస్టమర్లకు ఛార్జింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది రాకూడదని వీటి సంఖ్యను పెంచాలని నిర్ణయించారు.

2027 నాటికి దేశవ్యాప్తంగా 4 లక్షల ఛార్జింగ్ పాయింట్లు కలిగి ఉండాలని టాటా మోటార్స్ ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇప్పుడు దానికి అనుగుణంగా చర్యలు మొదలు పెట్టింది. దీనికోసం కంపెనీ 2023లో 'ఓపెన్ కొలాబరేషన్' ప్రాజెక్ట్‌ను సైతం మొదలుపెట్టింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో పాటు, ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లతో కలిసి కంపెనీ ఒప్పందాలు కూడా చేసుకుంది. దూర ప్రాంతాలకు ఈవీలలో ప్రయాణాలు చేసే వారికి ఛార్జింగ్ అతిపెద్ద సమస్యగా ఉంది.

Tata Motors Ev Charging Stations

ఇతర దేశాల్లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు మెరుగ్గా నమోదవుతున్నాయి. దీనికి కారణం అక్కడ ఛార్జింగ్ పాయింట్లను విరివిగా ఏర్పాటు చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అయితే భారత్‌లో మాత్రం ఈవీ సేల్స్ నెమ్మదిగా ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశంలో సరిపడా ఛార్జింగ్ పాయింట్లు లేకపోవడమే. అందుకే టాటా మోటార్స్ ఈ సమస్యను పరిష్కరించడానికి కీలక అడుగు వేసింది. ముఖ్యంగా టాటా హైవే మార్గాలపై ఎక్కువ ఫోకస్ చేసింది.

దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువ అయ్యాయి. ఇలాంటి రూట్లలో ఛార్జింగ్ సమస్య ఎక్కువగా ఉంది. అందుకే టాటా మోటార్స్ దేశంలో ప్రధాన రూట్లలో ప్రయాణించే కార్లకు ఛార్జింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడడానికి హైవే మార్గాల్లో వాహనదారులకు అనువుగా ఉండే విధంగా ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయబోతుంది. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై భారీగా పెట్టుబడులు పెడుతుంది.

Tata Motors Charging Points 4 Lakh

టాటా మోటార్స్ ప్రధానంగా 2019 నుంచి ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడంలో నిమగ్నమైంది. దీనికి కారణం ఆ ఏడాది నుంచే కంపెనీ ఈవీలను విక్రయించడం మొదలుపెట్టింది. గతంతో పోలిస్తే ఇప్పుడు పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్ల సంఖ్య భారీగా పెరిగింది. అయినప్పటికి ఈవీల సేల్స్ భారీగా ఉండటంతో వాటికి సరిపడా ఛార్జింగ్ పాయింట్లను వేగంగా ఏర్పాటు చేయలేకపోయారు. అందుకే ఈవీ సేల్స్ నెమ్మదిగా ఉన్నాయి.

టాటా మోటార్స్ తన TATA.ev ద్వారా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను పెంచాలని అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇప్పటికే టాటా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంది. పంచ్ EV, టియాగో EV, నెక్సాన్ EV, కర్వ్ EV వంటి పలు మోడళ్లను విక్రయిస్తుంది. అదనంగా ఈ 2025 ఏడాదిలో కూడా మరిన్ని మోడళ్లను తీసుకురావాలని చూస్తుంది. ఛార్జింగ్ పాయింట్లు పెంచినట్లయితే వీటి సేల్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది.

Tata Motors Ev Charging Details

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, February 15, 2025, 11:30 [IST]
English summary
Tata motors plans to increase the number of charging points 4 lakh by 2027
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+