అందరికి ఇష్టమైన కారు ధరను పెంచిన టాటా.. షోరూమ్‌కు వెళ్లే ముందు దీని గురించి తెలుసుకోండి!

టాటా మోటార్స్ (Tata Motors) నుంచి వచ్చిన టాటా కర్వ్ ప్రీమియం కూపే SUV, తన ఆకర్షణీయ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, అందుబాటులో ఉండే ధర వల్ల వినియోగదారులను ఆకట్టుకుంటోంది. మార్కెట్లోకి వచ్చి కొద్ది రోజులే అవుతున్నా, ఈ మోడల్‌ను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. అంతే కాకుండా, కర్వ్ రూపకల్పనలో కనిపించే కాస్త స్పోర్టీ కూపే శైలి, బలమైన రోడ్డు ప్రెజెన్స్‌కి తోడు, ఇంటీరియర్‌లో అందించిన ఆధునిక టెక్నాలజీ ఫీచర్లు దీనికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చాయి. తాజాగా, ఈ కర్వ్ SUV వేరియంట్లలో కొన్నింటి ధరలు సవరిస్తూ టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన కొన్ని వేరియంట్లకు గరిష్ఠంగా రూ.13,000 వరకు ధర పెరుగుదల చేసింది. ఈ సవరించిన ధరలు వెంటనే అమలులోకి రాగా, కొత్తగా కొనుగోలు చేసే వినియోగదారులకు ఇది వర్తిస్తుంది.

ఇప్పుడు ఈ కారుని కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నవారు ఇకపై పెరిగిన ధరల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ధరల్లో ఈ స్వల్ప మార్పుతోనూ, కర్వ్ SUVకి ఉన్న ప్రధాన డిమాండ్ తగ్గినట్టేమీ కాదు. ఎంట్రీ-లెవల్ వేరియంట్ ఇప్పటికీ చాలా పోటీ ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కొనసాగుతుండగా, ఫీచర్లను పుష్కలంగా పొందిన టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.19.51 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు చేరింది.

Tata Motors Price Hiked The Curvv Suv

టాటా కర్వ్ ప్రీమియం కూపే SUVను మూడు శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో వినియోగదారులకు అందిస్తోంది. ఈ విభిన్న ఇంజిన్ శ్రేణి వల్ల, ప్రతి ఒక్కరు అవసరాలకు తగ్గట్లుగా ఇంజిన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కర్వ్ 1.2-లీటర్ రెవోట్రాన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది 118 hp శక్, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ నగర వినియోగానికి ఈ ఇంజిన్, మెరుగైన మైలేజ్, స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

దీనికంటే మరింత శక్తి కోరుకునే వారికి, మరో ప్రీమియం ఇంజిన్ 1.2-లీటర్ హైపెరియన్ టర్బోచార్జ్డ్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజిన్- అందుబాటులో ఉంది. ఇది 123 hp శక్తి, 225 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని శక్తివంతమైన పనితీరు, స్పోర్టీ డ్రైవింగ్ అనుభూతిని ఇష్టపడే వారిని అలరిస్తుంది. తక్కువ ఇంధన ఖర్చులతో ఎక్కువ దూరాలు ప్రయాణించాలనుకునే వినియోగదారుల కోసం, టాటా 1.5-లీటర్ క్రియోజెట్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను అందిస్తోంది.

Tata Motors Price Hiked The Curvv

ఇది 116 hp శక్, 260 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని బలమైన మిడ్-రేంజ్ టార్క్, లాంగ్-డిస్టెన్స్ క్రూయింగ్‌లో విశేషమైన సహాయం అందిస్తుంది. ఈ మూడు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటాయి. కర్వ్ SUVలో 5 సీట్లు ఉంటాయి, వీటిలో ప్రయాణికులు విస్తృతమైన లెగ్‌రూమ్, హెడ్‌రూమ్‌తో సౌకర్యవంతంగా కూర్చోని సుదూర ప్రాంతాలకు ప్రయాణించవచ్చు.

ప్రయాణికుల రక్షణ పరంగా ఇది Bncap క్రాష్ టెస్ట్‌లో ఏకంగా 5 స్టార్ రేటింగ్ పొందింది. మరో విషయం ఏమిటంటే కర్వ్ పూర్తి ఎలక్ట్రిక్ రూపంలోనూ లభ్యమవుతోంది. టాటా కర్వ్ EV, పర్యావరణానికి అనుకూలమైన, సున్నా ఉద్గారాలు కలిగిన SUVను కోరుకునే వినియోగదారులకు ఒక అద్భుతమైన ఎంపిక. ఈ ఎలక్ట్రిక్ SUV ధర రూ.17.49 లక్షల నుండి ప్రారంభమై, టాప్ వేరియంట్ ధర రూ.22.24 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్).

Tata Curvv Suv

కర్వ్ EVలో రెండు బ్యాటరీ ప్యాక్‌‌లు ఉన్నాయి, ఒకటి 45 kWh సామర్థ్యం కలిగినది, మరొకటి 55 కిలోవాట్-గంటల సామర్థ్యం కలిగినది. ఈ రెండు బ్యాటరీ వేరియంట్లలో రేంజ్‌ కూడా తేడాగా ఉంటుంది. 45 kWh బ్యాటరీని ఎంచుకుంటే, ఒకసారి పూర్తిగా చార్జ్ చేసిన తర్వాత సుమారుగా 430 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. పెద్ద 55 kWh బ్యాటరీను ఎంచుకుంటే, దీని రేంజ్‌ గరిష్ఠంగా 502 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, July 7, 2025, 11:44 [IST]
English summary
Tata motors price hiked the curvv suv in india deatils inside
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+