రతన్ టాటాకు ఉన్నంత ప్రజాదరణ పొందిన కారు.. భద్రతలో రారాజు.. దేశంలోనే మంచి డిమాండ్ ఉన్న మోడల్

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ప్రయాణికులకు అవసరమయ్యే సదుపాయాలతో కార్లను విడుదల చేస్తుంది. ఇండియాలో కార్ల ఉత్పత్తిలో మూడో అతిపెద్ద సంస్థగా ఉంది. రతన్ టాటా పేద, మధ్యతరగతి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అందుకే తక్కువ ధరల్లో కార్లు విడుదల అవుతుంటాయి. టాటా కంపెనీ నుంచి విడుదలయ్యే కార్లకు దేశంలో మంచి ఆదరణ ఉంటుంది. ప్రతి ఏడాది కూడా కార్ల అమ్మకాల్లో ఇది వృద్ధి చెందుతూనే ఉంది. ఇటీవల వరుసగా తన అమ్మకాల వివరాలను వెల్లడిస్తుంది. ఈ క్రమంలో టాటా పంచ్ మైక్రో SUV సేల్స్ డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం, మార్కెట్‌లోకి లాంచ్ అయిన అనతి కాలంలోనే టాటా పంచ్ 5 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2024 ఏడాదిలో కూడా టాటా పంచ్ ఇండియా మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.

దీంతో మారుతీ సుజుకీ నాలుగు దశాబ్దాల ఆధిపత్యానికి తెరపడినట్లయింది. గత క్యాలెండ్ సంవత్సరంలో టాటా పంచ్‌ను దాదాపు 2.02 లక్షల మంది కొనుగోలు చేశారు. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2024 వరకు 1.48 లక్షల మంది కొన్నారు. ఇది 2021లో మైక్రో SUVగా లాంచ్ అయింది. మార్కెట్‌లోకి అడుగుపెట్టిన 38 నెలల్లోనే 5 లక్షల యూనిట్ల సేల్స్‌ను సాధించి ఈ కారుకు డిమాండ్ ఏమాత్రం తగ్గటం లేదని నిరూపించింది.

Tata Motors Punch 5 Lakh Unit Sales

మొత్తంగా గణంకాలను చూసినట్లయితే టాటా ఇప్పటివరకు 5,04,447 పంచ్‌లను మార్కెట్లో విక్రయించింది. ఇది లాంచ్ అయిన 10 నెలల్లోనే ఒక లక్ష యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఆ తర్వాత 2 లక్షల యూనిట్లకు కూడా వేగంగానే చేరుకుంది. 20 నెలల్లో ఈ మైలురాయిని అధిగమించింది. తిరిగి 28 నెలలకే మొత్తంగా 3 లక్షల అమ్మకాలను నమోదు చేసింది. 4 లక్షల యూనిట్ల మార్కును 2024 జూన్‌లో చేరింది.

ఆ తర్వాత ఏడాది ముగింపు నాటికి 6 నెలల కాలంలోనే 4 లక్షల నుంచి ఏకంగా 5 లక్షల మార్కును సాధించింది. ప్రధానంగా గత ఏడాది అక్టోబర్ పండుగ సమయంలో కంపెనీ టాటా పంచ్ కారుపై భారీ తగ్గింపులు ఇవ్వడంతో పాటు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న డీలర్లు అదనంగా ప్రత్యేక తగ్గింపులు ఆఫర్ చేయడం వలన కొత్త కస్టమర్లు చాలా మంది పంచ్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు.

Tata Motors Punch 5 Lakh Unit Sales Milestone

ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యంత అధునాతన ప్రమాణాలతో కూడిన కార్లను తయారు చేయడంలో టాటా మోటార్స్‌కు మంచి పేరు ఉంది. మైక్రో SUV విభాగానికి డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా ఇతర కంపెనీల నుంచే వచ్చే పోటీని ఎదుర్కొవడానికి కంపెనీ అప్‌డేట్ చేసిన 2024 పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయగా, దీంతో ఈ కారు అమ్మకాలు మరింత పుంజుకున్నాయి.

టాటా పంచ్ 1.2-లీటర్, మూడు-సిలిండర్, NA పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం అమ్ముడవుతున్న టాటా పంచ్ అకాంప్లిష్డ్ ప్లస్,అడ్వెంచర్ ఎస్, ప్యూర్, ప్యూర్ (ఓ), అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్, అడ్వెంచర్,క్రియేటివ్ ప్లస్ ఎస్, క్రియేటివ్ ప్లస్ వంటి వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. టాటా పంచ్‌లో ప్రయాణికుల సేఫ్టీ కోసం అధునాతన ఫీచర్స్ అందించారు. సేఫ్టీ విషయంలో కంపెనీ రాజీ పడలేదు.

కారులో డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి. కొత్త 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో,వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్ వంటి ఇతర అధునాత ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, January 16, 2025, 11:43 [IST]
English summary
Tata motors punch 5 lakh unit sales milestone since its launch all details check here
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+