రతన్ టాటా కంపెనీకి షాక్ ఇచ్చిన జనాలు.. 7 మంది కలిసి వెళ్లే కారు కోసం షోరూమ్‌కు రాని కస్టమర్లు

టాటా మోటార్స్‌ (Tata Motors) తాజాగా తన కార్ల విక్రయ గణాంకాలను బయటపెట్టింది. అందులో భాగంగా కంపెనీకి ప్రతిష్టాత్మకమైన SUV మోడల్ అయిన టాటా సఫారీ (Tata Safari) అమ్మకాలపై కూడా స్పష్టమైన వివరాలు వెల్లడయ్యాయి. ఒకప్పుడు కుటుంబ కార్ల విభాగంలో బలమైన స్థానం సంపాదించిన ఈ వాహనం, కొత్త తరం మోడల్‌గా మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత మంచి స్పందనను సొంతం చేసుకుంది. శక్తివంతమైన ఇంజిన్, ఆధునిక ఫీచర్లు, ప్రీమియం లుక్ వంటి ఎన్నో అంశాలు సఫారీని ప్రత్యేకంగా నిలబెట్టాయి. అయితే, ఇటీవల విడుదలైన డేటా ప్రకారం ఈ కారు అమ్మకాలలో కొంత వెనుకబాటు కనిపిస్తోంది. 2025 ఆగష్టు నెలలో టాటా సఫారీ కేవలం 1,489 యూనిట్లు మాత్రమే విక్రయించబడింది.

ఇది గత సంవత్సరం ఇదే నెలలో అంటే ఆగష్టు 2024లో 1,951 యూనిట్ల వరకు చేరాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే, ఒక్క సంవత్సరంలోనే అమ్మకాల పరిమాణం -23.68% తగ్గిందని అర్థమవుతోంది. ఇది చూస్తుంటే, మార్కెట్‌లో పోటీ పెరిగిందనేది స్పష్టమవుతోంది. హ్యుందాయ్, మహీంద్రా, కియా వంటి ప్రత్యర్థి కంపెనీలు కొత్త SUVలను మరింత అప్‌డేట్ ఫీచర్లతో, ఆకర్షణీయమైన ధరలతో తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో సఫారీకి డిమాండ్ కొంత తగ్గినట్టు కనిపిస్తోంది.

Tata Motors Safari Suv August 2025 Sales Reported 1489 Units Details Inside

అయినా సరే, సఫారీకి ఉన్న ప్రత్యేక గుర్తింపు మాత్రం తగ్గలేదు. ఫీచర్ల పరంగా చూస్తే కారు ఇప్పటికీ బలమైన స్థానాన్ని కలిగి ఉంది. రాబోయే నెలల్లో టాటా మోటార్స్‌ కొత్త ఆఫర్లు, అప్‌డేట్‌లు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. లేదంటే సఫారీ తన పాత స్థాయిని తిరిగి పొందడంలో మరింత కష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. రానున్న పండుగ సీజన్‌లో ఇది మెరుగైన అమ్మకాలన సాధింస్తుందని అంచనాలు ఉన్నాయి.

టాటా సఫారీ అమ్మకాలలో ఆగష్టు 2025లో నమోదైన క్షీణత వెనుక కొన్ని స్పష్టమైన కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా రెండు అంశాలు కీలకంగా నిలిచాయి. మొదటగా, కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నెలలోనే కార్లపై GST రేటును తగ్గించనున్నట్టు ప్రకటించింది. ఈ సమాచారం బయటకు వచ్చిన తర్వాత, చాలా మంది వినియోగదారులు కొత్త వాహనం కొనుగోలు చేయడాన్ని కొద్ది రోజులపాటు వాయిదా వేసుకున్నారు.

Tata Motors Safari Suv August 2025 Sales Reported 1489 Units Details Inside

ధరలు తగ్గవచ్చనే అంచనాతో, ఆగస్టులో కొత్త కారు బుక్ చేసుకోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపలేదు. ఈ ప్రభావం సఫారీ సహా పలు మోడళ్ల అమ్మకాలపై పడింది. రెండవది, సఫారీ డీజిల్ SUV కావడం. ప్రస్తుతం మార్కెట్‌లో పెట్రోల్ మోడళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. సౌండ్ తక్కువగా ఉండటం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, వంటి కారణాల వల్ల చాలా మంది కస్టమర్లు డీజిల్ కంటే పెట్రోల్ వాహనాల వైపు ఆకర్షితులవుతున్నారు.

ఈ ట్రెండ్ కూడా సఫారీ అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ రెండు కారణాలు కలిసివచ్చి, ఆగష్టు నెలలో సఫారీ విక్రయాలను గణనీయంగా తగ్గించాయని చెప్పొచ్చు. అయితే టాటా మోటార్స్‌ భవిష్యత్తులో ఈ మోడల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం చేస్తే, మళ్లీ అమ్మకాలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం సఫారీ SUV ధర రూ.15.50 లక్షల నుండి రూ.27.44 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

Tata Motors Safari Suv August 2025 Sales Reported 1489 Units Details Inside

ఈ కారుపై GST కూడా తగ్గించబడింది, దీనితో ధర రూ.1.45 లక్షల వరకు తగ్గింది. కొత్త సవరించిన ధరలు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయి. ఇందులో 2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది. వేరియంట్‌ను బట్టి 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో లభిస్తోంది. పనితీరు పరంగా ఈ SUV 16 kmpl వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది 6-సీట్లు/7-సీట్లతో వస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 17, 2025, 7:15 [IST]
English summary
Tata motors safari suv august 2025 sales reported 1489 units details inside
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+