టెస్లాకు గట్టి షాక్ ఇచ్చిన టాటా.. ఇక మన దేశంలోనూ ఆటోమేటిక్ కార్స్.. మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే ?

టాటా మోటార్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మన దేశంలో విశ్వసనీయతకు మారు పేరుగా టాటా వాహనాలు నిలుస్తాయి. సేఫ్టీ ఫీచర్స్, బాడీ బిల్డింగులో టాటా వాహనాలకు తిరుగు లేదనే చెప్పాలి. ఇటీవల కాలంలో టాటా వాహనాల అమ్మకాలు పడిపోయాయన్న వార్తలు వచ్చాయి. ఈ సందర్భంలోనే మిగతా కంపెనీలకు దిమ్మ తిరిగి పోయే షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

పులి రెండడుగులు వెనక్కి వేసిందంటే మరింత దూకుడుగా ముందుకు పోతుందన్న సామెత ప్రస్తుతం టాటా మోటర్స్‎కు సరిగ్గా సరిపోతుంది. కార్ల అమ్మకాలు తగ్గిపోతున్నాయన్న తరుణంలోనే టాటా సెల్ఫ్ డ్రైవింగ్ కార్గో వ్యాన్ కు పేటెంట్ పొందింది. టాటా యు అనే ఈ ఆలోచన వెనుక అన్సుమన్ మల్లి, ఆత్మజ్ వర్మ ఉన్నట్లు తెలుస్తోంది. టాటా యు అనేది వస్తువులను రవాణా చేయగల మోడల్ అలాగే ప్రజలను కూడా రవాణా చేయగలదు.

TataU Van

టాటా యు వెనుక ఉన్న అన్సుమాన్ మల్లిక్, ఆత్మజ్ వర్మ ఆర్నెళ్ల ఈ ప్రాజెక్ట్‌ను బెంగళూరులోని స్ట్రాట్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో చేపట్టారు. దీనిని టాటా మోటార్స్ స్పాన్సర్ చేసింది . వారికి కావాల్సిన మార్గదర్శకత్వాన్ని అజయ్ జైన్ (టాటా మోటార్స్), ఎడ్మండ్ స్పిట్జ్ (ట్రాన్స్‌పోర్టేషన్ డిజైన్, స్ట్రాట్ స్కూల్ ఆఫ్ డిజైన్, బెంగళూరు), థామస్ దాల్ (డీన్, స్ట్రాట్ స్కూల్ ఆఫ్ డిజైన్ బెంగళూరు) అందించారు.

మొత్తంమీద ఈ వెహికల్ ఆటోమేటిక్ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్ అని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా లాంటి పెద్ద దేశాల్లో ఆటోమేటిక్ వెహికల్స్ కు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో కూడా ఆటోమేటిక్ వెహికల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. త్వరలోనే టాటా వారి ఎదురు చూపులను నిజం చేయబోతుంది.

Tata U

ఈ వాహనం అందుబాటులోకి వస్తే డ్రైవర్ సాయం లేకుండానే ప్రజలను, వస్తువులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చవచ్చు. సరుకు రవాణాలో పార్శిళ్లను వాహనం మధ్యలో ఉంచుతారు. ప్రయాణీకులను వెనుక భాగంలో ఉంచుతారు. పార్శిళ్లను డెలివరీ చేయాల్సిన చోటికి ఖచ్చితంగా డెలివరీ చేయడానికి, వాహనంలో వాటిని సరిగ్గా పేర్చడానికి కూడా ఓ సిస్టమ్ ఉంటుంది.

డెలివరీ అనేది రెండు విధాలుగా జరుగుతుంది. ప్రత్యేకమైన ఆటోమేటెడ్ ట్రాన్స్ ఫర్ సిస్టమ్. అందుబాటులో ఉన్న ప్రదేశాలలో ఇ-కామర్స్ పార్శిల్‌లను నేరుగా ఆ సిస్టమ్ లో డిపాజిట్ చేస్తారు. ఈ ప్రాజెక్టులో ఈ ఆటోమేటెడ్ ట్రాన్సఫర్ సిస్టమ్ ను బ్రిడ్జి అని పిలుస్తారు. భవిష్యత్తులో, ఇటువంటి వ్యవస్థలు వివిధ ఆఫీసులు, హౌసింగ్ కాంప్లెక్స్ లలో రావొచ్చు.

Tata Yu

పార్శిళ్లను డెలివరీ ఎగ్జిక్యూటివ్ ద్వారా డెలివరీ చేయడం మరో మార్గం. ఫుడ్ డెలివరీ యాప్‌ల మాదిరిగానే గిగ్ వర్కర్లు డెలివరీ చేయాల్సిన ప్యాకేజీ గురించి వివరాలను పొందుతారు. వారు ఆఫర్‌ను అంగీకరించి సెలెక్టెడ్ స్టాప్‌లో వ్యాన్ నుండి పార్శిల్‌ను తీసుకోవచ్చు. ఆ తర్వాత వారు పార్శిల్‌ను గమ్యస్థానానికి డెలివరీ చేసి వారి కమీషన్‌ను పొందవచ్చు.

ప్రయాణీకులను తరలించడం గురించి మాట్లాడుకుంటే ఉబెర్, ఓలా మాదిరిగానే ఉంటుంది. ప్రయాణీకులు యాప్‌లో తమ గమ్యస్థానాన్ని నమోదు చేసుకోవచ్చు. ఏదైనా వ్యాన్ అదే దిశలో వెళుతుంటే వారు ఎక్కి తమ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. యాప్ ద్వారానే పేమెంట్స్ చేసుకోవచ్చు. టాటా యు ఇద్దరు ప్రయాణీకులకు వసతి కల్పిస్తుంది.

టాటా యు మధ్యలో ఇ-కామర్స్ పార్శిళ్లను స్టోర్ చేసేందుకు కావాల్సినంత స్పేస్ ఉంటుంది. అలాగే వెనుక భాగంలో వ్యాన్‌లో ప్రయాణీకులు కూర్చునేందుకు స్థలం ఉంటుంది. ఇ-కామర్స్ పార్శిల్‌లను మధ్యలో వివిధ పరిమాణాల పెట్టెల్లో స్టోర్ చేస్తారు. వ్యాన్ వీటిని గిడ్డంగి నుండి నేరుగా సేకరించి కావలసిన ప్రదేశానికి డెలివరీ చేస్తుంది. డెలివరీ గమ్యస్థానం ప్రకారం, ఈ పెట్టెలను ఆటోమేటిక్ గా క్రమబద్ధీకరించే కెపాసిటీ టాటా యూకి ఉంటుంది.

ఒక వాహనాన్ని ఉపయోగించి డెలివరీ ఎగ్జిక్యూటివ్ ప్రమేయంతో వస్తువులను సరైన గమ్యస్థానానికి డెలివరీ చేయడం సాధ్యం అవుతుంది. ఈ టాటా యూ కొలతలు, పరిమాణాన్ని పరిశీలిస్తే దాని పొడవు 3,700 మిమీ, వెడల్పు 1,500 మిమీ, ఎత్తు 1,800 మిమీగా ఉంటుంది. వాహనం బ్యాటరీ కెపాసిటీ, రేంజ్ గురించిన సమాచారం మాత్రం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. దీనిని నిర్మాణంలోకి తీసుకురావడానికి కొన్నేళ్లు పట్టవచ్చు.

Tata Sierra

టాటా యు ప్రాజెక్ట్ బిజినెస్ పరంగా అందుబాటులోకి వచ్చేందుకు దాదాపు 2030వరకు సమయం పడుతుందని దాని క్రియేటర్స్ భావిస్తున్నారు. టాటా మోటార్స్ ప్రొడక్షన్ స్పెక్ సియెర్రా కోసం డిజైన్ పేటెంట్ దాఖలు చేసింది. ఈ వాహనం ఇంటర్నల్ కంబుషన్ ఇంజిన్(ICE) సాయంతో పవర్ పొందుతుంది. దీని అర్థం ఈ SUV ప్రారంభంలో డీజిల్, పెట్రోల్ ఇంజన్ ఆఫ్షన్లతో ప్రారంభించనున్నారు.

సియెర్రా ఎలక్ట్రిక్-మాత్రమే మోడల్‌ను కూడా తర్వాత మార్కెట్లోకి రిలీజ్ చేయాలని నిర్ణయించింది. సియెర్రా ప్రొడక్షన్ వెర్షన్ లో కంపెనీ కొన్ని సూక్ష్మమైన మార్పులను చేస్తుందని డిజైన్ పేటెంట్ వెల్లడించింది. బి-పిల్లర్‌పై ఉన్న కింక్ డిజైన్ ఎలిమెంట్ ఇకపై ప్రొడక్షన్ వెర్షన్‌లో అందుబాటులో లేదు. కానీ అది 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించిన మోడల్‌లో ఉంది.

Tata Sierra Price

కంపెనీ అల్లాయ్ వీల్ డిజైన్‌ను కూడా ఛేంజ్ చేసింది. ఈ SUV అమ్మకానికి వచ్చిన తర్వాత టాటా మోటార్స్ రెండు అల్లాయ్ వీల్ డిజైన్‌లను అందించే అవకాశం ఉందని సమాచారం. ఇది కాకుండా, టాటా సియెర్రాలో ఎలాంటి మార్పులు ఉండవు. ఈ SUV ప్రొడక్షన్ వెర్షన్ స్లిమ్ లైట్ బార్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో ఎత్తైన, ఫ్లాట్ బోనెట్‌ కలిగి ఉంటుంది.

స్కిడ్ ప్లేట్ డిజైన్‌ను ఫాలో కావడానికి బంపర్ రెండు-టోన్, గ్లోస్ బ్లాక్, గ్రే కలర్స్ లో డిజైన్ చేశారు. స్కేర్ షేప్ వీల్స్ ఆర్చ్, డోర్ క్లాడింగ్ వెహికల్కు రఫ్ లుక్ ఇస్తాయి. ఈ మోడల్ మార్కెట్లోకి రిలీజ్ చేసిన తర్వాత దీని అమ్మకాలు భారీగా ఉంటాయని కంపెనీ భావిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. గత కొన్నేళ్లుగా ఈ మోడల్ కోసం ఎదురు చూసే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది.

Take a Poll

టాటా సియెర్రా రెండు ఇంజన్ ఆఫ్షన్లను కలిగి ఉంటుంది. 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 2.0-లీటర్ డీజిల్. టర్బో పెట్రోల్ ఇంజన్ 168 బిహెచ్‌పి పవర్, గరిష్టంగా 280 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 168 bhp పవర్, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసేలా దీనిని డిజైన్ చేస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 18, 2025, 10:26 [IST]
English summary
Tata motors shocks tesla with self driving cargo van a game changer for india s automotive future
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+