రూ.5 లక్షలకే వచ్చే కారు, సేఫ్టీలో 4 స్టార్.. పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ వరకూ.. ఎంత మంది కొన్నారంటే?
టాటా టియాగో (Tata Tiago) భారత మార్కెట్లో ఎప్పటినుంచో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న హ్యాచ్‌బ్యాక్. చిన్న కారు కావాలి, కానీ కాంప్రమైజ్ లేకుండా సేఫ్టీ, మైలేజ్, కంఫర్ట్ కూడా కావాలి అనుకునే ఫ్యామిలీలకు ఇది ఎప్పుడూ సరైన ఎంపికగా నిలిచింది. టాటా మోటార్స్ తమ మేడ్ ఇన్ ఇండియా ఇమేజ్‌ను బలంగా నిలబెట్టడంలో టియాగో కీలక పాత్ర పోషించింది. స్టైలిష్ డిజైన్, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసింగ్, రోజువారీ అవసరాలకు సరిపోయే మైలేజ్ టాటా టియాగోను మిలియన్ల మంది వినియోగదారులకు ఇష్టమైన కారుగా మార్చాయి. అయితే ప్రస్తుత జూలై 2025లో టియాగో అమ్మకాలలో స్వల్పంగా తగ్గుదల నమోదైంది.
కంపెనీ మొత్తం 5,575 యూనిట్లు మాత్రమే విక్రయించగా, గత సంవత్సరం జూలై 2024లో 5,665 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే కేవలం 90 యూనిట్ల తేడాతో అమ్మకాలలో తగ్గుదల వచ్చింది. శాతాల్లో చెప్పుకుంటే, సేల్స్ 2 శాతం తగ్గాయి. ఇది పెద్ద సంఖ్య కాకపోయినా, ఆటోమొబైల్ మార్కెట్‌లోని పోటీని పరిశీలిస్తే చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ సెగ్మెంట్‌లో మరికొన్ని కొత్త మోడళ్లు, ఫీచర్ రిచ్ వేరియంట్లు కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

మరోవైపు, EVల పెరుగుతున్న ట్రెండ్ కూడా కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల మార్కెట్‌పై కొంత ప్రభావం చూపుతోంది. అయినా, టియాగో స్థిరమైన నాణ్యత, సరసమైన ధర, టాటా మోటార్స్‌పై కస్టమర్లకు ఉన్న విశ్వసనీయత వలన తన స్థానం కోల్పోయే అవకాశాలు తక్కువ. చిన్న తగ్గుదల ఉన్నప్పటికీ, ఈ కారు ఇంకా భారతీయ కుటుంబాల కోసం ఒక నమ్మకమైన, ఆర్థికంగా సరైన ఎంపికగానే కొనసాగుతోంది.
టాటా టియాగో ఎప్పటినుంచో భారతీయులను గెలుచుకున్న హ్యాచ్‌బ్యాక్. అయితే, జూలై 2025లో టియాగో అమ్మకాలలో వచ్చిన చిన్న తగ్గుదల కారణంగా, ఈసారి టాప్ 10 హ్యాచ్‌బ్యాక్‌ల జాబితాలో అది 5వ స్థానానికే పరిమితమైంది. మొదటి నాలుగు స్థానాలను మాత్రం మారుతి సుజుకి ఆధిపత్యంగా ఆక్రమించింది. వరుసగా వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బాలెనో, ఆల్టో వంటి మోడళ్లు ముందంజలో నిలవడం ద్వారా, ఈ సెగ్మెంట్‌లో మారుతి మళ్లీ తన శక్తిని చూపించింది.

కానీ టియాగోకు వచ్చిన తగ్గుదల పెద్ద ఆందోళన కలిగించేది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ కారు ఇప్పటికీ తన కేటగిరీలో బలమైన పోటీదారే. కేవలం 2 శాతం తగ్గుదల మాత్రమే నమోదైందని గమనిస్తే, త్వరలోనే ఇది తిరిగి తన స్థాయిని పొందే అవకాశం ఉందని పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టాటా టియాగో IC ఇంజిన్ వెర్షన్ ధర రూ.5 లక్షల నుంచి రూ.8.55 లక్షల వరకు ఉంద.
ఈవీ ధర రూ.7.99 లక్షల నుంచి రూ.11.14 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. సీఎన్జీలో కూడా ఉంది. చౌకైన కారు అని తక్కువ నాణ్యత అని అనుకోలేం. ఎందుకంటే టియాగోకు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లలో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. కుటుంబ కారుగా టియాగోను ఎంచుకున్నప్పుడు, కేవలం డబ్బు సేవ్ చేయడం మాత్రమే కాదు, భద్రత పరంగా కూడా ఒక బలమైన ఎంపికను తీసుకుంటున్నారు.

ఈ వేరియంట్ గరిష్టంగా 28.06 కి.మీ మైలేజీని అందించగలవు. అలాగే, దాని ఎలక్ట్రిక్ వెర్షన్ పూర్తి ఛార్జ్‌తో 290 కి.మీల వరకు దూసుకెళ్లగలదు. మొత్తం మీద, అమ్మకాలలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, టాటా టియాగో తన ధర, సేఫ్టీ,ఎలక్ట్రిక్ వెర్షన్ అందుబాటుతో మార్కెట్లో మళ్లీ బలంగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఈ కారు ఇంకా కోట్లాది మధ్యతరగతి కుటుంబాల నమ్మకాన్ని దక్కించుకుంటూ, భారతీయ రోడ్లపై తన పయనం కొనసాగిస్తూనే ఉంది.


Click it and Unblock the Notifications








