కేవలం రూ. 6 లక్షల లోపు టాటా కారు.. 5 మందికి ఫుల్ కంఫర్ట్.. పైగా 28.06 కి.మీ మైలేజ్!

సెడాన్ కార్లంటే ప్రత్యేకమైన అందం, క్లాస్, కంఫర్ట్ అన్నీ కలిసి ఉండటం వల్ల చాలామందికి అవి మొదటి ఎంపికగా ఉంటాయి. అలాంటి సెడాన్ శ్రేణిలో బడ్జెట్‌కి తగ్గ ధరలో మంచి లుక్, మన్నిక, ఫీచర్లు ఆల్‌రౌండ్ ప్యాకేజ్‌గా కనిపించేది 2025 టాటా టిగోర్ (tigor). కొత్త టిగోర్‌ను ఒక్కసారి చూస్తేనే ఈ ధరలో ఇంత మంచి కారు ఎలా ఇచ్చారు? అని అనిపించేట్టుగా టాటా మోటార్స్ డిజైన్‌ నుండి ఫీచర్ల వరకు ప్రతి విషయంలో ఎంతో శ్రద్ధ పెట్టింది. కొత్త తరం టాటా టిగోర్ తన క్లాస్‌లో అత్యంత విలువను అందించే కార్లలో ఒకటిగా నిలుస్తోంది. ఇది పలు వేరియంట్‌లలో లభించడం వల్ల, మీ బడ్జెట్‌కి, అవసరాలకి సరిపోయే ఆప్షన్‌ను ఎంచుకోవడం మరింత సులభం. టాటా కంపెనీకి ప్రత్యేకతైన ఘనమైన నిర్మాణ నాణ్యత టిగోర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.

బాడీ స్ట్రక్చర్ పటిష్టంగా ఉండేలా రూపొందించబడింది, అందువల్ల సేఫ్టీ విషయంలో కూడా పెద్ద నమ్మకం కలుగుతుంది. ఇంటీరియర్‌ విషయానికొస్తే, టిగోర్ పూర్తిగా తాజా లుక్‌తో రూపొందించబడింది. ధర, 2025 టాటా టిగోర్ నిజంగా విలువకు తగిన కారు అనేది సందేహమేలేదు. ఇది రూ. 5.49 లక్షల నుండి రూ. 8.74 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది. ఈ ధరలో ఇవ్వబడుతున్న ఫీచర్లు, సేఫ్టీ, స్పేస్, స్టైల్ బెస్ట్‌గా అనిపిస్తాయి.

Tata Motors Tigor Sedan Price Engine Features And All Top Things Details Inside

2025 టిగోర్‌లో టాటా ప్రత్యేకమైన 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజిన్ చాలా స్మూత్‌గా, రోజువారీ డ్రైవింగ్‌కి అనుకూలంగా, మంచి పనితీరు ఇస్తుంది. పెట్రోల్ వేరియంట్ 86 PS శక్తి, 113 Nm టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది నగర ట్రాఫిక్‌లోనూ, హైవే క్రూజింగ్‌లోనూ సరైన రెస్పాన్స్‌ను ఇస్తుంది. బడ్జెట్ సెడాన్ కొనేవారిలో CNG డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, టాటా టిగోర్‌లో CNG ఎంపికను కూడా అందిస్తోంది.

CNG మోడ్‌లో ఈ ఇంజిన్ 73.5 PS శక్తి, 95 Nm టార్క్‌‌ను అందిస్తుంది. ఇది గరిష్ట మైలేజ్‌ను అందించడానికే ప్రత్యేకంగా ట్యూన్ చేయబడింది. అందుకే CNG వెర్షన్ 28.06 km/kg వరకు అద్భుతమైన మైలేజ్‌ను ఇస్తుంది, ఇది ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమంగా చెప్పుకోవచ్చు. పెట్రోల్ వేరియంట్ కూడా 19.28 kmpl వరకు మంచి ఇంధన సమర్థతను అందిస్తుంది. ట్రాన్స్‌మిషన్ విషయంలోనూ టిగోర్ కస్టమర్ ప్రాధాన్యాలను బట్టి ఆప్షన్‌లు ఇస్తుంది.

Tata Motors Tigor Sedan Price Engine Features And All Top Things Details Inside

పెట్రోల్, CNG రెండింటిలోనూ 5-స్పీడ్ మాన్యువల్, AMT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లభిస్తాయి. అంటే డ్రైవింగ్ స్టైల్ ఏదైనా, నగరాల్లో క్లచ్ వర్క్ తగ్గించుకోవాలనుకుంటే AMT, ఫుల్ కంట్రోల్ కావాలంటే మాన్యువల్ రెండూ మీ ముందే ఉంటాయి. భద్రత విషయానికి వస్తే, టాటా టిగోర్‌లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ కంట్రోల్, TPMS, పార్కింగ్ సెన్సార్లు, రియర్‌వ్యూ కెమెరా వంటి ఫీచర్లు లభిస్తాయి.

టాప్ ట్రిమ్‌లలో 360-డిగ్రీ కెమెరా కూడా అందించబడింది. భద్రత పరంగా, టిగోర్ గ్లోబల్ NCAPలో 4-స్టార్ రేటింగ్ సాధించింది. ఇంటీరియర్ విషయానికి వస్తే, టిగోర్‌లో కొత్త డాష్‌బోర్డ్ థీమ్, కంఫర్ట్‌ను పెంచే ఆర్మ్‌రెస్ట్‌లు, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తుంది. వేరియంట్‌పై ఆధారపడి 6-స్పీకర్ లేదా 8-స్పీకర్ ఆడియో సిస్టమ్, అలాగే ఆధునిక సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అందించబడుతుంది.

Tata Motors Tigor Sedan Price Engine Features And All Top Things Details Inside

More from DriveSpark

Article Published On: Wednesday, November 19, 2025, 17:03 [IST]
English summary
Tata motors tigor sedan price engine features and all top things details inside
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+