మార్చి 31 తర్వాత కస్టమర్లకు భారీ షాక్ ఇవ్వనున్న టాటా.. వెహికల్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి

టాటా మోటార్స్ మన దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ. ప్రస్తుతం దేశంలో అగ్రగామి కార్ల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్, కార్ల మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు భారీ ట్రక్కులు, బస్సుల వంటి వాణిజ్య వాహనాలను ఉత్పత్తి చేసేది. కార్ల మార్కెట్ రోజు రోజుకు పెరుగుతుండడం చూసి ఆ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది టాటా మోటార్స్.

ప్రజల అభిరుచిని తెలుసుకుని వాటికి అనుగుణంగా కార్లను తయారు చేస్తూ టాటా మోటార్స్ 1990లలో కార్ల అమ్మకాల వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండియా ప్రముఖ వాణిజ్య వాహన తయారీ సంస్థ టాటా మోటర్స్ త్వరలోనే కస్టమర్లకు ఓ భారీ షాక్ ఇవ్వబోతుంది. వాణిజ్య వాహనాల ధరలను అమాంతం పెంచబోతుంది. కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

Tata Prima

పెరిగిన టాటా వాహనాల కొత్త ధరలు ఏప్రిల్ 1నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇతర ప్రైవేట్ కంపెనీల మాదిరిగానే, ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ధరలను క్రమం తప్పకుండా పెంచుతాయి. కొన్ని కంపెనీలు ఒకే సంవత్సరంలో 2-3 సార్లు వాహనాల ధరలను సవరిస్తుంటాయి. కొత్తేడాది ప్రారంభంలో ఒకసారి.. ఆ తర్వాత మరో ఆరేడు నెలల తర్వాత మరోసారి పెంచుతాయి.

Take a Poll

కొన్నిసార్లు ఆటోమొబైల్ కంపెనీలు ఏప్రిల్‌లో కూడా వాహనాల ధరలను పెంచుతాయి. ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభం కావడంతో కొన్ని ఆటోమొబైల్ తయారీ కంపెనీలు ధరల పెరుగుదలతో నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తాయి. ఆ విషయంలో, మారుతి సుజుకి ఇటీవలే రాబోయే ఏప్రిల్ నెలను ధరల పెరుగుదలతో ప్రారంభిస్తామని అధికారికంగా ప్రకటించింది.

Tata DCM Price

మన దేశంలో నంబర్ వన్ కార్ల కంపెనీ మారుతి సుజుకి కాబట్టి ఆ కంపెనీ ధరల పెంపుదలను ప్రకటించిన తర్వాత మారుతి సుజుకి కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారు షాక్ తిన్నారు. ఆ వెంటనే టాటా మోటార్స్ దాని వాణిజ్య వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారిపై భారం మోపుతున్నట్లు ప్రకటించింది.

టాటా మోటార్స్ 2025 ఏప్రిల్ 1 నుండి వాణిజ్య వాహనాల ధరలను 2శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. 2శాతం అనేది గరిష్ట పెరుగుదల. అంటే కొన్ని టాటా వాణిజ్య వాహనాలను 1శాతం లేదా అంతకంటే తక్కువ కూడా పెరగొచ్చు. అందువల్ల, టాటా మోటార్స్ ఈ ధరల పెరుగుదల వాహనం, దాని వేరియంట్‌ను బట్టి మారుతుంది.

Tata Bus Price

ఎప్పటిలాగే, టాటా మోటార్స్ ఈ ధరల పెరుగుదలకు వాహన ఉత్పత్తి వ్యయాలలో నిరంతర పెరుదల కారణం అని పేర్కొంది. ఇండియాలో వాణిజ్య వాహనాల అమ్మకాల్లో టాటా మోటార్స్ నంబర్ వన్ కంపెనీ. కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకీ ఆధిపత్యం చెలాయిస్తుంటే.. వాణిజ్య వాహనాల అమ్మకాల్లో మాత్రం టాటా మోటార్స్ ఆధిపత్యం చెలాయిస్తోంది.

ఎందుకంటే టాటా మోటార్స్ పలు రకాల ఉపయోగాల నిమిత్తం విస్తృత శ్రేణి వాణిజ్య వాహనాలను ఉత్పత్తి చేసి విక్రయిస్తుంది. టాటా బ్రాండ్ టాటా సిగ్నా వంటి భారీ-డ్యూటీ ట్రక్కుల నుండి టాటా ఇంట్రా వంటి తేలికపాటి కార్గో వాహనాల వరకు విస్తృత శ్రేణి వాణిజ్య వాహనాలను విక్రయిస్తుంది. టాటా మోటార్స్ గ్రూప్ దాదాపు 165 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ. వీటిలో టాటా మోటార్స్ విలువ ఒక్కటే 44 బిలియన్ డాలర్లు.

Tata Mini Truck

టాటా మోటార్స్ అంత పెద్ద కంపెనీ అయినప్పటికీ, దాని వాహనాల ధరలను పెంచవలసి వచ్చింది. మీలో కొందరికి 2% తక్కువగా అనిపించవచ్చు. కానీ దాన్ని రూపాయల్లోకి మార్చుకుంటేనే అది ఎంత అనేది మీకు అర్థమవుతుంది. ఉదాహరణకు, రూ.20 లక్షల విలువైన టాటా వాణిజ్య వాహనం ధర కొంటే దాదాపు రూ.40వేలు పెరుగుతుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 18, 2025, 11:25 [IST]
English summary
Tata motors to shock customers after march 31 prices of commercial vehicles to rise from april 1
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+