దేశంలో సంచలనం సృష్టించబోయే కొత్త టాటా సియెర్రా ఇదే.. రీ-ఎంట్రీతో మార్కెట్ షేక్!
దేశవ్యాప్తంగా ఆటోప్రేమికులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ విభాగం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సియెర్రా బ్రాండ్ డేలో, ప్రతిష్టాత్మక టాటా సియెర్రా (sierra) ప్రొడక్షన్-రెడీ వేరియంట్‌ను ఘనంగా ఆవిష్కరించింది. భారతీయుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఈ ఐకానిక్ SUV ఇక కొత్త యుగానికి నాంది పలుకుతోంది. కొత్త తరానికి అనుగుణంగా పునర్ ఆవిష్కరించబడిన టాటా సియెర్రా, తన ఒరిజినల్ లెగసీ, ప్రత్యేకమైన డిజైన్ గుర్తింపును అలాగే కొనసాగిస్తూ మరింత కొత్తగా ముస్తాబై వచ్చింది. దీని రాకతో ఇతర కార్ల తయారీ కంపెనీలకు బలమైన పోటీ ఏర్పడినట్లయింది. 1991లో వచ్చిన ఒరిజినల్ టాటా సియెర్రా నుంచి పూర్తిగా కొత్త అవతారానికి చేరుకున్న ప్రయాణంలో, ఈ SUV డిజైన్ అభివృద్ధి, సాంకేతిక, దేశంలో కార్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
నవంబర్ 25న దాని ధర ప్రకటనకు ముందే మార్కెట్లో కొత్త హైప్‌ను క్రియేట్ చేసింది. ఎక్స్‌టీరియర్ డిజైన్ చూసినట్లయితే, . ముందుభాగంలో గ్లాస్-బ్లాక్ ప్యానెల్‌లో కనెక్ట్ చేయబడిన LED DRLలు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, మధ్యలో ప్రకాశించే టాటా లోగో, మొత్తం గ్రిల్ ప్రాంతానికి భవిష్యత్ తరహా లుక్‌ను ఇస్తాయి. కఠినమైన బంపర్‌పై గ్లాస్-బ్లాక్ ఇన్సర్ట్‌లు, సిల్వర్ ఫినిష్‌లో ఉన్న ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌లు SUVకి ఆగ్రెసివ్, ప్రీమియం టచ్‌ను అందిస్తాయి.

వెనుక భాగం కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. పూర్తి వెడల్పు LED లైట్ బార్, స్క్వేర్ డిజైన్ లైన్లు, క్లామ్‌షెల్ టెయిల్‌గేట్, మొత్తం రియర్ ప్రొఫైల్‌ను చాలా శుభ్రంగా, కానీ మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాయి. ఇతర బాహ్య హైలైట్‌లు కూడా SUV లగ్జరీ లుక్‌ను పెంచుతాయి, ముఖ్యంగా 19-అంగుళాల స్టైలిష్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, దృఢమైన బాడీ క్లాడింగ్, బ్లాక్-అవుట్ ORVMలు, రూఫ్ రెయిల్‌లు ఆకట్టుకుంటున్నాయి.
అదే సమయంలో, 1991 సియెర్రాలో ఉన్న ప్రసిద్ధ త్రీ-క్వార్టర్ గ్లాస్ డిజైన్ స్థానంలో టాటా ఇప్పుడు ఆధునిక పరిష్కారాన్ని తీసుకొచ్చింది. పనోరమిక్ రూఫ్, ఫ్లష్ గ్లేజింగ్, బ్లాక్డ్-అవుట్ రూఫ్ ఫినిషర్. కొత్త భద్రతా నియమాలకు అనుగుణంగా ఉండేలా చేసినప్పటికీ, పాత క్లాసిక్ ఆకర్షణ మాత్రం యథాతథంగా నిలిచేలా చేసింది. ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అందంగా ఉంటుంది. లోపలికి అడుగుపెట్టగానే అంత కూడా ఆకట్టుకుంటుంది.

టాటా ఈ కారు కోసం రూపొందించిన లైఫ్ స్పేస్ ఫిలాసఫీ సౌకర్యం, సౌందర్యం, సాంకేతికత కొత్త అనుభూతిని ఇస్తుంది. డాష్‌బోర్డ్ పై ఒకే గ్లాస్ ప్యానెల్ కింద మూడు స్క్రీన్‌లు అమర్చడం ఈ ఇంటీరియర్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది. డ్రైవర్ కోసం డిజిటల్ డిస్‌ప్లే, మధ్యలో ప్రధాన ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అదేవిధంగా ముందున్న ప్రయాణీకుడి కోసం ప్రత్యేక స్క్రీన్ ఈ థియేటర్‌ప్రో లేఅవుట్ సియెర్రా కేబిన్‌ను అత్యంత ఆధునికంగా మార్చింది.
అంతర్గత భాగంలో ఉపయోగించిన మెటీరియల్స్ కూడా చాలా ఆలోచిస్తూ ఎంపిక చేసినట్లుగానే కనిపిస్తాయి. మృదువైన ఉపరితలాలు, సహజమైన రంగుల కలయిక, సొగసైన మెటాలిక్ టచ్‌లు, మినిమలిస్టిక్ కంట్రోల్‌లు కేబిన్‌కు ఓ వెచ్చని, ప్రశాంతమైన వాతావరణాన్ని ఇస్తాయి. కారు లోపల కూర్చుంటే అది ఒక లగ్జరీ లివింగ్ రూం అనుభూతిని కలిగిస్తుంది. లోపల అధునాతన ఫీచర్స్ చాలా ఉన్నాయి.

డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ గదిలా చల్లదనాన్ని ఇస్తుంది. వెంటిలేటెడ్ పవర్ ఫ్రంట్ సీట్లు దూర ప్రయాణాల్లో కూడా అలసటను మరిచిపెడతాయి. వెనుక సీట్ల కోసం సన్‌షేడ్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీల కెమెరా, సేఫ్టీ విభాగంలో లెవల్-2 ADAS చేరడంతో ఈ కారు మరింత నమ్మకాన్ని ఇస్తుంది. మ్యూజిక్ ప్రేమించే వాళ్లకు డాల్బీ అట్మోస్‌తో కూడిన కొత్త JBL బ్లాక్ 12-స్పీకర్ సిస్టమ్, ప్రత్యేకమైన సోనిక్‌షాఫ్ట్ సౌండ్‌బార్ ఉన్నాయి.
టాటా మోటార్స్ కొత్త సియెర్రా పూర్తి డిజైన్‌ను అధికారికంగా బయటపెట్టింది. అయితే ఈ ప్రతిష్ఠాత్మక SUV ధరల వివరాలను మాత్రం ఇంకా గోప్యంగా ఉంచింది. టాటా ప్రకారం, సియెర్రా ధరలను నవంబర్ 25న అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తం మీద సియెర్రా ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైన్ అనేది ఒక SUVలో ఉండాల్సిన ఫీచర్లను మాత్రమే కాకుండా, ఒక వ్యక్తి రోజువారీ ప్రయాణాన్ని ఆనందంగా మార్చే విధంగా రూపుదిద్దుకుంది.


Click it and Unblock the Notifications








