పేద- మిడిల్ క్లాస్ కలల కారు.. 200 కి.మీ రేంజ్.. తక్కువ ధరకే 'టాటా నానో ఎలక్ట్రిక్' కారు వచ్చేస్తుంది!
దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలందరికి కూడా కారు ఉండాలనే మహానుభావుడు రతన్ టాటా ఆలోచన నుంచి పుట్టిన టాటా నానో (tata nano) భారత కార్ మార్కెట్లో ఓ విప్లవాన్ని తీసుకొచ్చింది. కేవలం ఒక లక్ష రూపాయల ధరలో కొనుగోలుకు విడుదల అయి, ప్రపంచంలోనే అన్ని దేశాల ఆటోమొబైల్ తయారీ కంపెనీలను ఒక్కసారిగా తన వైపు తిప్పుకునేలా చేసింది. చిన్నదైనా చక్కని డిజైన్, నగరాల్లో సులభంగా నడిపేలా ఉండటం, ధర పరంగా అందరికీ అందుబాటులో ఉండటం కారణంగా మార్కెట్లోకి వచ్చిన ప్రారంభంలోనే భారీగా విక్రయాలను నమోదు చేసింది. అయితే ఆ తరువాత రాను రాను దీనికి ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడంతో ఆశించిన మేరకు అమ్మకాలు సాధించలేదు. దీంతో టాటా మోటార్స్ క్రమంగా నానో కారు ఉత్పత్తిని నిలిపివేసింది.
కానీ, ఇక్కడితో కథ ముగియలేదు. ఇప్పుడు అదే టాటా నానో ఎలక్ట్రిక్ వేరియంట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కార్ కోసం చూస్తున్న కస్టమర్లకు ఇది ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. టాటా మోటార్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు కానీ, మార్కెట్‌లో ఊహాగానాలు, ఆన్‌లైన్ ఇమేజెస్ చూస్తుంటే, ఈసారి టాటా నానో మళ్ళీ ఓ కొత్త చరిత్ర సృష్టించబోతుందనే అంచనాలు పెరిగిపోయాయి.

మార్కెట్ ఊహగాణాల ప్రకారం, ఈ ఏడాదిలో నానో ఈవీ అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా రాబోతున్న టాటా నానో ఎలక్ట్రిక్ కారు ఇప్పుడు పూర్తిగా తిరిగి లేటెస్ట్ ఫీచర్స్‌తో వస్తుందని అంచనాలు ఉన్నాయి. అధికారికంగా ఇంకా పూర్తిగా ప్రకటించకపోయినా, లీక్ అయిన సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ నానోలో పలు కీలక మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎక్స్‌టీరియర్ అంతా కూడా పాత మోడల్‌ను గుర్తు చేసేలా ఉండొచ్చు.
ఇంటీరియర్‌లో మాత్రం మోడ్రన్ టచ్, అప్‌గ్రేడ్‌డ్ టెక్నాలజీ అందించనున్నారు. కారు చిన్నదిగానే ఉండే అవకాశమే ఉన్నా, నాలుగు మంది ప్రయాణీకులు సౌకర్యంగా కూర్చునేలా మంచి సీటింగ్ ఉంటుంది. చిన్న కుటుంబాలకోసం, నగరాల్లో రోజువారీ ప్రయాణాలకోసం ఈ నానో EV ఒక బెస్ట్ ఆప్షన్. దీనిలో శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ అందించనున్నారని సమాచారం. ఇది ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 200 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించగలదని అంచనా.

కారులో ప్రయాణికులు, డ్రైవర్‌కు అనుకూలమైన డజన్ల కొద్ది ఫీచర్స్ ఉంటాయి. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 4-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మ్యూజిక్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రీమియం 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్, అలాగే పార్కింగ్‌కి బాగా ఉపయోగపడే రియర్ వ్యూ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు రావచ్చని తెలుస్తోంది. సాధారణ జనాల కోసం చిన్న కారుగా ఇప్పుడు స్మార్ట్ ఫీచర్స్‌తో వస్తుంది.
ఇది చిన్న కారు అయినప్పటికి కూడా ప్రయాణీకుల భద్రతపైనా కంపెనీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి పలు అత్యుత్తమ సేఫ్టీ ప్రమాణాలను అందించనుంది. లోపల మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్), అలాగే EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) సిస్టమ్, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్) కూడా ఇందులో ఉంటాయి. ఇంకా, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా టైర్లలో గాలి ఒత్తిడి తగ్గిపోతే ముందుగానే హెచ్చరిస్తుంది.

రాబోతున్న టాటా నానో ఎలక్ట్రిక్ కారు మరోసారి మధ్యతరగతి ప్రజల కలల మోడల్‌గా వస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ కారు ధర ఎక్స్-షోరూమ్ రూ. 6 నుండి రూ. 7 లక్షల మధ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ధరలో ఒక శక్తివంతమైన ఎలక్ట్రిక్ కారు లభించడం అనేది మధ్యతరగతి ప్రజలకే కాకుండా, ఫస్ట్ టైమ్ కారు కొనుగోలు దారులకు కూడా కలిసొచ్చే అంశం.


Click it and Unblock the Notifications








