Tata Nano EV టాటా నానో ఎలక్ట్రిక్ వచ్చేస్తుంది.. సింగిల్ ఛార్జ్‌లో 300 కి.మీ వెళ్లవచ్చు!
టాటా నానో.. ఇది మనందరికీ సుపరిచితమైన తక్కువ ధరలో లభించే ఫేవరెట్ కారు. పేదలు కూడా కార్లలో తిరగాలనే దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా కలలకు వాస్తవ రూపం ఈ కారు. రూ. లక్ష ఖరీదుతో అందుబాటులోకి వచ్చిన ఈ కారు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. కొన్నేళ్ల క్రితమే ఈ నానో కారు అమ్మకాలను టాటా సంస్థ నిలిపివేసింది. అయితే ఈ కారుపై ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఇప్పటికీ సెకండ్- హ్యాండ్ కార్ మార్కెట్లో దీన్ని కోరికోరి కొనుగోలు చేసేవారు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం దేశంలో ట్రెండ్ మారతోంది. అందరూ ఈవీలపై మొగ్గు చూపుతున్నారు. అనేక వాహన తయారీ సంస్థలు సైతం ఈవీలను తయారు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
ఫ్యూయల్ ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఈవీలైతే ఖర్చులు కలిసి వస్తాయని చాలా మంది వినియోగదారులు భావిస్తున్నారు. అందుకే అట్రాక్టివ్ ఫీచర్లతో ఉండే ఈవీలను కొనేందుకు ఈ మధ్య ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ల ధరలు.. సాధారణ కార్లతో పోలిస్తే కాస్త ఎక్కువ ధరలో ఉండడం వల్ల ఈవీలను కొనేందుకు ఇంకా చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు.

చాలా మంది కూడా.. టాటా కంపెనీ గతంలో తక్కువ ధరలో తీసుకువచ్చిన నానో కారును ఎలక్ట్రిక్ కారుగా మళ్లీ తీసుకువస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఈ కారు ఎలక్ట్రిక్ వెర్షన్ గురించి టాటా సంస్థ నుంచి ఇప్పటివరకైతే ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. కానీ, ఈ డిమాండ్ మాత్రం అధికంగానే వినిపిస్తోంది. అతి త్వరలోనే ఇది మార్కెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
టాటా నానోను ఈవీగా తీసుకురాబోతోందని కొన్ని మీడియాా సంస్థలు గతంలో కథనాలు వెల్లడించాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నానో ఎలక్ట్రిక్ కారు.. అతి తక్కువ ధరలో దేశ ప్రజలకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నానో ఈవీ కారు ఎక్స్-షో రూమ్ ధర రూ.5 లక్షలుగా ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ధర ప్రీమియం బైకుల కంటే కూడా తక్కువే కావడం గమనార్హం.

టాటా నానో ఈవీ... పవర్ ఫుల్ 40 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ తో ఉండనుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల దూరం మైలేజీ అందించగలదని తెలుస్తోంది. అంతేగాకుండా అత్యంత వేగంగా ఛార్జింగ్ సదుపాయం దీంట్లో ఉండనుంది. ఈ ఫీచర్లన్నీ అంచనాలే అని ఇక్కడ గుర్తుంచుకోవాలి. టాటా నానో ఎలక్ట్రిక్ కారును ప్రత్యేక ఫీచర్లను జోడించి తీసుకురానుంది టాటా మోటార్స్ సంస్థ.
ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే, పవర్ విండోస్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇన్నోవేటివ్ మ్యూజిక్ సిస్టం వంటి ఫీచర్లు ఉంటాయి. ఇది నాలుగు సీట్లతో అందుబాటులోకి రానుంది. టాటా నానో కారు 2009 నుంచి 2018 మధ్య సేల్స్‌లో అందుబాటులో ఉంది. దీని ధర అప్పట్లో రూ.2.50 లక్షల నుంచి రూ. 3.41 లక్షలు(ఎక్స్- షోరూమ్)గా ఉంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








