టాటా నానో ఈవీ కారు లాంచ్ అయిందా? ఇది అదేనా? వైరల్ అవుతున్న ఫోటోల వెనుక అసలు రహస్యం ఇదే
భారతదేశంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. అందరికీ సొంత ఇళ్లుతో పాటు, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే టూవీలర్, కారును కొనడం ప్రతి ఒక్కరి కల. టూవీలర్స్ దాదాపు అందరి దగ్గర ఉన్నప్పటికి కారు మాత్రం ఉండటం చాలా అరుదు. మారుతున్న కాలానికి అనుగుణంగా తక్కువ ధరలో అయిన లభించే వాటిని కొనాలని చాలా మంది అనుకుంటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారి కోరికను తీర్చడానికి సామాన్య ప్రజలకు ఒక టూవీలర్ కొనగలిగే ధరలోనే కారును కూడా అందించాలనే ఆశయంతో ఎప్పుడు కూడా పేద, మధ్య తరగతి ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఆలోచన కలిగి ఉండే ఇటీవల మరణించిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా గతంలో టాటా నానో కారును తీసుకొచ్చారు. కేవలం ఒక లక్ష రూపాయల ధరలో ఈ నానో కారును విడుదల చేసి ఏకంగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.
సొంత కారును కలిగి ఉండాలనే వారి కోరికను ఇది చాలా వరకు తీర్చింది. అయితే మొదట్లో లభించినంత డిమాండ్ ఈ కారుకు తరువాతి కాలంలో లభించలేదు. చాలా మంది నానో కారును కొనడానికి ఆసక్తి చూపించకపోవడంతో టాటా మోటార్స్ దీని ఉత్పత్తిని క్రమంగా నిలిపివేసింది. ఓ సందర్భంలో రతన్ టాటా నానో కారుకు అనుకున్నంత ఆదరణ లభించలేదని పేర్కొనడం గమనార్హం. తరువాతి కాలంలో నానో ఈవీలను తీసుకొస్తామని ఆయన ప్రకటించారు.

ఈ క్రమంలో నానో ఎలక్ట్రిక్ వెర్షన్ వస్తుందని, దాని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఇప్పుడు మరోసారి నానో ఈవీ కారు గురించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా నానో ఈవీ మార్కెట్లోకి వచ్చిందా అని చర్చించుకుంటున్నారు. అయితే ఈ ఫోటోల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాటా నానో ఎలక్ట్రిక్ కారు ఫోటోలు అసలైనవి కారు. ఈ ఫోటోలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో రూపొందించి, కొంత మంది షేర్ చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే టాటా మోటార్స్ నుంచి నానో ఎలక్ట్రిక్ లాంచ్ గురించి ఎలాంటి అధికారికి ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే నానో ice ఇంజిన్ ఉండటంతో దానికి కొత్త హంగులు అద్దుతూ ఈవీ అని ప్రచారం చేస్తున్నారు.
కృత్రిమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొందరు ఈ విధంగా నానో ఎలక్ట్రిక్ కారు డిజైన్ లాగా కనిపించే ఫోటోను సృష్టించి షేర్ చేస్తున్నారు. దీన్ని చూసిన చాలా మంది కూడా నానో ఈవీ కారు ఇదే అని అనుకుంటున్నారు. అయితే అసలు నానో ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి విడుదల కావాలంటే మరి కొద్ది కాలం ఆగాల్సిందే. భారత్‌లో ఈవీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీంతో పోటీ ఎక్కువ అయింది.
ఈ క్రమంలో మధ్యతరగతి ప్రజలు చాలా కాలంగా నానో ఎలక్ట్రిక్ కారు రాకపై ఎదురుచూస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో సెర్చింగ్ కూడా చాలా వరకు పెరిగింది. దీని డిమాండ్‌ను గమనించిన కొంతమంది కావాలనే కృత్రిమ మేధస్సు టెక్నాలజీతో నానో ఈవీ కారును రూపొందించారు. ఇదిలావుంటే టాటా మోటార్స్ నుంచి ఈ ఏడాదిలోనే నానో ఈవీ రాబోతుందని తెలుస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








