ఓల్డ్ టైగర్‌ను దింపుతున్న టాటా.. బరిలోకి దిగితే ప్రత్యర్థులకు చెమటలే.. చరిత్ర తిరగరాయడానికి సిద్ధం!
భారతదేశంలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమమైన ప్రమాణాలతో కూడిన కార్లను విడుదల చేయడంలో టాటా మోటార్స్(Tata Motors) ఎప్పుడు అగ్రగామిగా ఉంటుంది. చాలా ఏళ్లుగా టాటా అదిరిపోయే కార్లు విక్రయిస్తూ, భారతదేశం పేరును ప్రపంచం నలుమూలలకు విస్తరింపజేస్తుంది. తన పాత మోడళ్లను కొత్తగా అప్‌డేట్ చేస్తూనే ఇదే సమయంలో అదిరిపోయే కొత్త వాటిని సైతం విడుదల చేస్తుంది. తాజాగా టాటా మోటార్స్ తన ప్రసిద్ధ మోడల్ సియెర్రా (sierra) కారును సరికొత్త రూపంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇది ఒక ఎస్‌యూవీ మోడల్. 1991 నుంచి 2003 వరకు భారతదేశ రోడ్లపై బాగా ప్రసిద్ధి చెందిన మోడల్. ఇప్పుడు ఈ కారును తిరిగి మరింత కొత్తగా మార్చి మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో కూడా ఈఎస్‌యూవీని ప్రదర్శించారు.
దీని విడుదల ద్వారా టాటా మోటార్స్ తన చరిత్రను తిరగరాయడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఈ SUV స్పెసిఫికేషన్స్, అంచనా ధర, ఇతర వివరాలను గురించి ఒకసారి తెలుసుకుందాం.. భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ఆవిష్కరించిన టాటా సియెర్రా SUV ఎక్స్‌టీరియర్ డిజైన్ అట్రాక్టివ్‌గా ఉంది. డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్,ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, LED హెడ్‌ల్యాంప్‌లు, కనెక్ట్ చేయబడినటువంటి LED లైట్ సెటప్, బాడీ-కలర్ B-పిల్లర్లు వంటివి ఉన్నాయి.

ఇంజిన్ వివరాలను చూసినట్లయితే ఇది పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్‌టో కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 1.5-లీటర్ టర్బో పెట్రోల్, అలాగే, 2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో లభించే అవకాశం ఉంది. మైలేజ్ పరంగా అయితే 18 నుంచి 20 కిలోమీటర్లు అందిస్తుందని అంచనా. ఇక ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈవీలో అయితే పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను అందించవచ్చు. దీనిని పూర్తిగా ఛార్జింగ్ చేసినట్లయితే దాదాపు 500 కి.మీల దూరం వరకు ఛార్జ్ పెట్టకుండా ప్రయాణించవచ్చని సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉంది. తయారీదారులు వరుసగా ఈవీలను విడుదల చేస్తున్నారు. టాటా మోటార్స్ ఇప్పటికే ఈవీ విభాగంలో ముందు స్థానంలో ఉంటుంది. అలాంటిది కంపెనీ తన కొత్త మోడల్ పనితీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది.

ఇతర కంపెనీలకు చెందిన ఈవీలకు బలమైన పోటీని అందించడానికి సియెర్రా suvని అదిరిపోయే విధంగా మార్కెట్లోకి విడుదల చేయడానికి టాటా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది పనోరమిక్ సన్‌రూఫ్‌తో లభిస్తుంది. 3-స్క్రీన్ సెటప్ అలాగే 4-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంటుందని మార్కెట్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. కారు లోపల డజన్ల కొద్ది ఫీచర్స్ ఉంటాయి. సీటింగ్ కూడా మరింత అప్‌డేట్ అవుతుంది.
కారు లోపల డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రీమియం సౌండ్ సిస్టమ్, ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగులు, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 360-డిగ్రీ కెమెరా పలు ఫీచర్స్ ఉన్నాయి. పెట్రోల్ మోడల్ ప్రారంభ ధర రూ. 10.50 లక్షలు, ఈవీ ధర రూ. 25 లక్షలు(ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని అంచనా.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








