డబ్బు సంపాదించి పెట్టే వ్యాన్.. కొని అద్దెకు ఇచ్చినా చాలు.. రెగ్యులర్ ఇన్‌కమ్ సంపాదించండి

టాటా మోటార్స్ (Tata Motors) గురించి మాట్లాడితే, మనకు మొదట గుర్తొచ్చేది భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో అగ్రగామి అనే విషయం. కార్లతో పాటు వ్యాన్లు, బస్సులు, ట్రక్కులు వంటి అన్ని రకాల వాణిజ్య వాహనాలను తయారు చేసి, వాటిని ప్రపంచవ్యాప్తంగా విక్రయించే సంస్థగా టాటా మోటార్స్ పేరు ప్రఖ్యాతులు సాధించింది. ఈ క్రమంలోనే, వాణిజ్య వాహనాల విభాగంలో తన స్థానం మరింత బలంగా నిలబెట్టుకునే ఉద్దేశంతో కంపెనీ తాజాగా ఒక కొత్త వాహనాన్ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే టాటా వింగర్ ప్లస్ (tata winger plus). ఈ కొత్త మోడల్ ప్రత్యేకత ఏంటంటే, ఇది 9 సీట్ల వాహనం. అంటే ఇది వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే కాకుండా, పర్యాటక ప్రయాణాలు, స్కూల్ లేదా ఆఫీస్ ట్రాన్స్‌పోర్ట్ అవసరాలకు కూడా సరైన ఎంపిక అవుతుంది.

ధర విషయానికి వస్తే, వింగర్ ప్లస్‌ను రూ. 20.60 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేశారు. ఈ ధర ఇతర వాహనాలతో పోల్చితే తగినదే అని చెప్పాలి. పాత వెర్షన్‌తో పోలిస్తే కొత్త వింగర్ ప్లస్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. డిజైన్ పరంగా మరింత ఆధునికంగా, ఆకర్షణీయంగా తయారు చేశారు. లోపలి భాగంలో సీటింగ్ అమరికను సౌకర్యవంతంగా మార్చి, దూర ప్రయాణాల్లో కూడా ప్రయాణికులు అలసట లేకుండా కూర్చునేలా రూపొందించారు.

Tata New Winger Plus 9 Seater Van Price Engine Specification

టాటా వింగర్ ప్లస్‌కి సంబంధించిన వివరాలు చూస్తే, ఇది నిజంగా ఒక ప్రీమియం లుక్, ప్రాక్టికల్ యూజ్ రెండింటినీ కలిపి రూపొందించారు. విశాలమైన క్యాబిన్ కారణంగా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ముఖ్యంగా, ఆర్మ్‌రెస్ట్‌లతో కూడిన రిక్లైనింగ్ కెప్టెన్ సీట్లు లాంగ్ జర్నీలో బాగా అనుకూలంగా ఉంటాయి. పెద్ద లగేజ్ ఏరియా ఉండటంతో ఇది వ్యక్తిగత వినియోగం మాత్రమే కాకుండా టూర్స్‌కు ఒక మంచి ఎంపిక అవుతుంది.

ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.2L డైకోర్ డీజిల్ ఇంజిన్ అమర్చారు. ఇది 100hp శక్తిని, 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే, బరువుతో నిండినప్పుడు కూడా ఇది శక్తివంతమైన పనితీరును అందించగలదు. డ్రైవర్‌కు కూడా దీన్ని నడపడం సులభంగానే అనిపిస్తుంది. సౌకర్యాల విషయానికి వస్తే, కొత్త వింగర్ ప్లస్ వ్యాన్ వ్యక్తిగత USB ఛార్జింగ్ పాయింట్లు, ప్రతి సీటుకు ప్రత్యేక AC వెంట్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Tata New Winger Plus 9 Seater Van Price Engine Specification

ఇవి నేటి ఆధునిక ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందించిన సౌకర్యాలు. సేఫ్టీ ఫీచర్లను కూడా టాటా మోటార్స్ చాలా ప్రాధాన్యతనిచ్చింది. ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), సీటుపై హ్యాండిల్స్, స్కిడ్-ప్రూఫ్ వినైల్ ఫ్లోరింగ్, గార్డ్ రైల్స్, అన్ని సీట్లపై సీట్ బెల్టులు వంటి అంశాలు అందులో ఉన్నాయి. ఇవన్నీ ప్రయాణికులకు అదనపు భద్రతను కల్పిస్తాయి. అదనంగా, ఎకో మోడ్ స్విచ్ ఉండటంతో మైలేజీని మెరుగుపర్చుకోవచ్చు.

టాటా వింగర్ ప్లస్ పై కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్ కూడా తమ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ ఆనంద్ ఎస్ మాట్లాడుతూ, ఈ కొత్త వాహనం అత్యుత్తమ రైడ్ కంఫర్ట్‌తో పాటు ఆధునిక సౌకర్యాలు, సెగ్మెంట్‌లోనే అగ్రగామి మైలేజీని అందిస్తుందని స్పష్టం చేశారు. అదనంగా, వింగర్ ప్లస్ తక్కువ యాజమాన్య వ్యయం కారణంగా కస్టమర్లకు మరింత ఆర్థికంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Tata New Winger Plus 9 Seater Van Price Engine Specification

దేశవ్యాప్తంగా విశ్రాంతి ప్రయాణాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, ఈ మోడల్ అలాంటి అవసరాలకు సరైన పరిష్కారమని ఆయన అన్నారు. టాటా వింగర్ ప్లస్ వాణిజ్య ప్రయాణీకుల వాహన విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పేలా రూపకల్పన చేయబడిందని కూడా ఆనంద్ ఎస్ వ్యాఖ్యానించారు. ఈ కొత్త వాహనం మార్కెట్లోకి రావడం ద్వారా టాటా మోటార్స్ తమ విస్తృతమైన ప్యాసింజర్ కమర్షియల్ వాహన శ్రేణిని మరింత బలోపేతం చేసుకుంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 30, 2025, 10:04 [IST]
English summary
Tata new winger plus 9 seater van price engine specification details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+