ఇదెక్కడి టాటా కారు భయ్యా.. ఒక్క నెలలోనే 14 వేలు.. సేల్స్‌లో దుమ్మురేపింది

దేశీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ (tata motors) ఎప్పటినుంచో తనదైన ముద్ర వేసుకుంటూ వస్తోంది. వినియోగదారుల అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా వాహనాలను అందిస్తూ, మార్కెట్లో పోటీదారులకు గట్టి సవాలు విసురుతోంది. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో ఈ కంపెనీకి ఉన్న పట్టుదల ప్రత్యేకం. ప్రస్తుతం దేశీయంగా SUVల క్రేజ్ పెరిగిపోతుండటంతో, టాటా మోడళ్లకు డిమాండ్ మరింతగా పెరుగుతోంది. ఇందులో నెక్సాన్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మోడల్. తాజాగా ఆగస్టు 2025లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్ అమ్మకాల గణాంకాలు వెలువడగా, టాటా నెక్సాన్ మరోసారి తన సత్తా ఏంటో నిరూపించింది. గత నెలలోనే 14,004 యూనిట్లు అమ్ముడవడంతో ఈ విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

దీని వెంటనే మారుతి సుజుకి బ్రెజ్జా 13,620 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. అదే విధంగా మారుతి ఫ్రాంక్స్ 12,422 యూనిట్లతో మూడో స్థానంలో ఉండగా, హ్యుందాయ్ వెన్యూ 8,109 యూనిట్లతో, కియా సోనెట్ 7,741 యూనిట్లతో తరువాతి స్థానాల్లో నిలిచాయి. మహీంద్రా ఇటీవల విడుదల చేసిన XUV 3XO కూడా 5,521 యూనిట్ల అమ్మకాలతో జాబితాలో చోటు సంపాదించింది. ఇంత పోటీలో నెక్సాన్ తన స్థానాన్ని కొనసాగించడం గమనార్హం.

Tata Nexon Becomes The Top Selling Compact Suv In August 2025 Details

నెక్సాన్ ఇలా వరుసగా ప్రజాదరణ పొందటానికి కారణం కేవలం డిజైన్, ఫీచర్లు మాత్రమే కాకుండా, విభిన్న ఇంజిన్ ఎంపికలు కూడా. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉండటం వినియోగదారులకు ఎన్నో ఎంపికలను ఇస్తోంది. భద్రతా పరంగా గ్లోబల్ NCAP నుంచి ఫైవ్‌స్టార్ రేటింగ్ సాధించడం కూడా ఈ కారుకు మరో పెద్ద ప్లస్. అందుబాటు ధరలో ప్రీమియం ఫీచర్లతో నెక్సాన్, పనితీరులో వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంది.

టాటా నెక్సాన్ గురించి మరిన్ని వివరాలు పరిశీలిస్తే, ఈ SUV వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చేలా విస్తృత ఇంజిన్ ఎంపికలను అందిస్తోంది. బేస్ మోడల్ 1.2-లీటర్ రెవోట్రాన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. ఇది 120 bhp శక్తిని, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కి 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ AMT మరియు ఆధునిక 7-స్పీడ్ DCA ట్రాన్స్‌మిషన్ ఎంపికలు లభిస్తాయి.

Tata Nexon Becomes The Top Selling Compact Suv In August 2025 Details

పెట్రోల్‌తో పాటు, నెక్సాన్‌లో 1.5-లీటర్ రెవోటార్క్ డీజిల్ ఇంజిన్ కూడా లభిస్తోంది. ఇది 115 bhp శక్తి, 260 Nm పీక్ టార్క్‌ను అందించగలదు. డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్‌లతో జత చేయబడింది. డీజిల్ కార్లను ఇష్టపడే వారికి ఇది ఒక మంచి ఎంపికగా మారింది. అంతేకాకుండా, టాటా మోటార్స్ ఇటీవల పరిచయం చేసిన CNG వేరియంట్ కూడా నెక్సాన్ లైనప్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.

ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తూ, 100 bhp శక్తిని, 170 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ట్విన్-సిలిండర్ ఇంజిన్ ప్రధాన ఆకర్షణ దాని మైలేజ్. ఎక్కువ ఇంధన ఖర్చులను తగ్గించుకోవాలని భావించే వినియోగదారులకు ఇది ఒక సరైన ప్రత్యామ్నాయం. నెక్సాన్ EV వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ SUV రెండు వేరే బ్యాటరీ ఎంపికల్లో 30kWh, 45kWhలలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది.

Tata Nexon Becomes The Top Selling Compact Suv In August 2025 Details

పెద్ద 45kWh బ్యాటరీ ప్యాక్ ARAI సర్టిఫికేషన్ ప్రకారం గరిష్టంగా 489 కి.మీ డ్రైవింగ్ రేంజ్ అందించగలదు. ఇది ఈ విభాగంలో వినియోగదారులకు మరింత విశ్వాసాన్ని కలిగిస్తోంది. ధరల విషయానికి వస్తే, ప్రస్తుతం టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్, CNG వేరియంట్లు కలిపి రూ. 7.99 లక్షల నుండి రూ. 15.59 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. అయితే తాజాగా GST పన్ను తగ్గింపులు రావడంతో, ధరలు తగ్గనున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, September 15, 2025, 15:42 [IST]
English summary
Tata nexon becomes the top selling compact suv in august 2025 details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+