భారతదేశంలోనే బెస్ట్ సేఫెస్ట్ ఈవీ.. ఈ టాటా కారుకు 5 స్టార్ సేఫ్టీ.. ఏకంగా 489 కిలోమీటర్ల రేంజ్‌

భారతదేశంలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యత్తమమైన ప్రమాణాలతో కూడిన కార్లను విడుదల చేయడంలో టాటా మోటార్స్ (tata motors) ఎప్పుడు ముందు స్థానంలో ఉంటుంది. భారతీయ ఆటోమొబైల్ రంగానికి భద్రత ఎంత ముఖ్యమో నేర్పిన బ్రాండ్ టాటానే. క్రాష్ టెస్టుల్లో అత్యుత్తమ 5-స్టార్ రేటింగ్ సాధించిన టియాగో, ఆల్ట్రోస్, నెక్సాన్, హారియర్, సఫారీ వంటి మోడల్స్‌తో టాటా తన కస్టమర్లకు 'సేఫ్టీ ఫస్ట్' అన్న సూత్రాన్ని పరిచయం చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేస్తున్నా, టాటా ఎప్పుడు కూడా సేఫ్టీ విషయంలో మాత్రం రాజీ పడటం లేదు. తాజాగా దాని ప్రసిద్ధ ఎలక్ట్రిక్ మోడల్ అయినటువంటి నెక్సాన్ ఈవీ 45 kWh వెర్షన్‌ భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ క్రాష్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.

నెక్సాన్ EV భద్రత పరంగా ఎంతలా అగ్రస్థానంలో ఉందో మరోసారి రుజువైంది. భారత్ NCAP (భారత న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్) తాజాగా ప్రారంభించినా, గతంలో జారీచేసిన 5-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్‌ను నెక్సాన్ EV తాజా 45 kWh వేరియంట్‌కి కూడా వర్తింపజేసింది. ఇది ఈ ఎలక్ట్రిక్ SUVకి భద్రత పరంగా ఉన్న స్థాయిని ఘనంగా తెలియజేస్తుంది. నెక్సాన్ ఈవీ సేఫ్టీలోనే కాకుండా ఆకట్టుకునే డిజైన్‌తో అందరిని ఆకర్షిస్తుంది.

Nexon Ev 45 Kwh Scored 5 Star Safety Rating In Bncap

ఈ కారు వయోజనుల భద్రత(Adult Occupant Protection - AOP)లో నెక్సాన్ EV కొత్త వేరియంట్ 32కి 29.86 పాయింట్లను సాధించింది. ఇక పిల్లల భద్రత(Child Occupant Protection - COP)లో 49కి 44.95 పాయింట్లను నమోదు చేసింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16 పాయింట్లకు 14.26 పాయింట్లు, సైడ్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16కి 15.60 పాయింట్లతో నెక్సాన్ EV బలమైన నిర్మాణాన్ని మరోసారి నిరూపించింది.

టాటా నెక్సాన్ EV టాప్-ఎండ్ వేరియంట్ ఎంపవర్డ్ ప్లస్ LR భద్రత పరంగా కూడా ఓ అడుగు ముందుంది. ఇందులో ఏకంగా ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయిజ. అలాగే చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ISOFIX చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరికీ 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, అలాగే సీట్‌బెల్ట్ రిమైండర్‌లు ఉంటాయి.

Tata Nexon Ev 45 Kwh

ఇంకా చుట్టు ప్రక్కల చూడటానికి 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్‌ను ఎప్పటికప్పుడు చెబుతూ డ్రైవర్‌కు అవగాహన కలిగించే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి సదుపాయాలు ఇందులో ఉంటాయి. టాటా మోటార్స్ తన తాజా వర్షన్ అయిన నెక్సాన్ EV 45 మోడల్‌ను 45 kWh బ్యాటరీ ప్యాక్‌తో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్లయితే 489 కి.మీ వరకు ప్రయాణించగలదు.

ఇది డైలీ యూజ్‌తో పాటు లాంగ్ డ్రైవ్‌లకు కూడా అనువుగా ఉంటుంది. ఈ కారులో శాశ్వత మాగ్నెట్ మోటార్‌తో కూడిన ఫ్రంట్-వీల్ డ్రైవ్ లేఅవుట్ అమర్చారు. ఇది 142 bhp పవర్, 215 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 0-100 kmph వేగాన్ని 8.9 సెకన్లలో చేరుకుటుంది. 60 kW ఫాస్ట్ ఛార్జర్‌‌తో దాదాపు 40 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.

Nexon Ev 45 Kwh Scored 5 Star Safety Rating In Bncap

ఈ EV లో పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్ అందించడం చాలా సంతోషించే విషయం అని చెప్పవచ్చు. దీని ధర వచ్చేసి రూ. 12.49 లక్షల నుండి మొదలవుతుంది. అదే నెక్సాన్ EV 45 మోడల్ రూ. 13.99 లక్షల నుండి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. పెద్ద బ్యాటరీ ప్యాక్ మోడల్ రెడ్, డార్క్ ఎడిషన్‌లలో కూడా లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, April 25, 2025, 11:00 [IST]
English summary
Tata nexon ev 45 kwh scored 5 star safety rating in bncap more details inside
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+