ప్రపంచాన్ని భారతదేశం వైపు చూసేలా చేసిన టాటా కారు! ఈ హీరో కోసం జనాలు క్యూ కట్టారు!

భారతీయ ఆటో పరిశ్రమలో ప్రయాణికుల రక్షణ పరంగా అత్యున్నత సేఫ్టీ ప్రమాణాలతో కూడిన కార్లను తయారు చేయడంలో టాటా మోటార్స్ (Tata Motors) ఎప్పుడు కూడా ముందు స్థానంలో ఉంటుంది. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే వాహనాలు ప్రమాద సమయంలో లోపల కూర్చున్న వారిని రక్షించడానికి అధిక ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఇదే క్రమంలో సేఫ్టీ పరంగా టాటా నెక్సాన్ (Tata Nexon) పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లలో పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన మొట్టమొదటి 'మేడ్ ఇన్ ఇండియా' కారు కావడం వల్ల, ఈ SUV కి వినియోగదారులలో అపారమైన నమ్మకాన్ని తెచ్చిపెట్టింది. ఇలాంటి చరిత్రాత్మక కారుకు సంబంధించి మే 2025 సేల్స్ నివేదిక తాజాగా విడుదలైంది.

సేఫ్టీలో కీలకంగా నిలుస్తున్న టాటా నెక్సాన్, అమ్మకాల పరంగానూ అదే స్థాయిలో మెరుపు మెరుస్తోంది. మే 2025లో ఈ SUV 13,096 యూనిట్లు అమ్ముడుపోయింది. ఇది గతేడాది ఇదే నెలలో నమోదైన 11,457 యూనిట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇప్పటికీ చాలామందికి నెక్సాన్ అంటే సేఫ్టీకి మరో పేరు. మార్కెట్లో హవా కొనసాగించడంలో, నెక్సాన్‌కు రెండు శక్తివంతమైన వెర్షన్లు మద్దతుగా నిలుస్తున్నాయి, ICE, మరొకటి EV.

Tata Nexon May 2025 Sales Reported 14 Percent

టాటా నెక్సాన్ IC ఇంజిన్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 8 లక్షల నుండి మొదలవగా, టాప్ వేరియంట్ ధర రూ.15.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. EV ఎలక్ట్రిక్ వెర్షన్ ప్రారంభ ధర రూ.12.49 లక్షలుగా ఉండగా, దీని టాప్ ఎండ్ వేరియంట్ ధర వచ్చేసి రూ.17.19 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ రెండు వేరియంట్‌లలోనూ వినియోగదారులకు అనేక భద్రతా ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్ లభిస్తున్నాయి.

టాటా నెక్సాన్‌ భద్రత పరంగా భారత్‌లోని అన్ని కార్లకు రోల్ మోడల్‌గా నిలిచింది. మార్కెట్లో అంతటి పోటీ ఉన్నా కూడా, వినియోగదారుల నమ్మకంతో నెక్సాన్ నిలబడుతోంది. ఇది ఏకంగా ఒక బ్రాండ్ నమ్మకాన్ని, భద్రతపై బాధ్యతను సూచిస్తుంది. భారతదేశంలో తయారైన కార్లలో గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లలో తొలిసారిగా 5-స్టార్ భద్రతా రేటింగ్ అందుకున్న ఘనత నెక్సాన్‌కే చెందుతుంది. సేఫ్టీ పరంగా ఇది మిగతా భారతీయ కార్లకు స్ఫూర్తిగా నిలిచింది.

Tata Nexon Price

నెక్సాన్ 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.2 లీటర్ సీఎన్జీ (CNG)లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఫ్యూయెల్‌ ఎఫిషియెన్సీని కోరే వారికి సీఎన్జీ, శక్తివంతమైన డ్రైవింగ్‌ అనుభూతిని ఇష్టపడేవారికి పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్లు అనుకూలంగా ఉంటాయి. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, ట్రిమ్‌ను బట్టి, 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ AMT (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్), 7-స్పీడ్ DCT(డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్)లను కలిగి ఉంది.

వేరియంట్ ఆధారంగా, నెక్సాన్ 17.01 కి.మీ/లీటర్ నుండి 24 కి.మీ/లీటర్ వరకు మైలేజ్‌ను అందిస్తుంది. ఈ లెక్కన చూస్తే, రోజువారీ ప్రయాణాలకు నెక్సాన్ ఒక ఆర్థికంగా వినియోగదారులను బెస్ట్. ఎంపిక.దీని ఎలక్ట్రిక్ వెర్షన్ గురించి చూసినట్లయితే 30(kWh) కెపాసిటీ కలిగిన బ్యాటరీ ప్యాక్, 46.08(kWh) లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తుంది. ఈ బ్యాటరీలపై నెక్సాన్ EV పూర్తి ఛార్జ్‌తో 275 కిలోమీటర్ల నుండి 489 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలదు.

Tata Nexon May 2025 Sales

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, June 23, 2025, 9:47 [IST]
English summary
Tata nexon may 2025 sales reported 14 percent growth compared to previous
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+