దేశంలో టాటా జెండా మళ్లీ ఎగరబోతోంది.. అందరి ఫేవరెట్ టాటా ఈవీ కారు కొత్తగా రాబోతుంది
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్(tata motors) సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల(EV)ను కూడా విడుదల చేస్తుంది. గతంతో పోలిస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువ అయింది. ఇప్పటికే ఇతర కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో సరికొత్త కార్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తుండగా, వాటి నుంచి వచ్చే పోటీని తట్టుకుని నిలబడటానికి టాటా కంపెనీ మరింత ముందడుగు వేస్తూ, అధునాతన ఫీచర్స్‌తో కూడిన కార్లను విడుదల చేస్తుంది. ప్రస్తుతం ఈవీలలో టాటా కంపెనీ టాప్ ప్లేస్‌లో ఉంది. కంపెనీ పలు ఈవీలను విక్రయిస్తుండగా, వాటిని మరింత అప్‌డేట్ చేస్తూ మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఈ క్రమంలో భారతీయ ప్రజల్లో అత్యంత డిమాండ్ కలిగిన నెక్సాన్(Nexon) కారును గతంలో టాటా ఎలక్ట్రిక్(EV) వెర్షన్లో తీసుకువచ్చి అందరిని ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.నెక్సాన్ ఈవీ లాంచ్ అయిన తక్కువ కాలంలోనే చాలా మంది వినియోగదారులకు చేరువ అయింది.
భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఈ మోడల్ ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ కారు కనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో టాటా నెక్సాన్ ఈవీకి పోటీగా ఇతర కంపెనీల నుంచి పలు మోడళ్లు మార్కెట్లోకి విడుదల అయ్యాయి. ముఖ్యంగా ఎంజీ విండ్సర్ ఈవీ టాటా నెక్సాన్ EV ఎలక్ట్రిక్ కారకు గట్టి పోటీని ఇస్తుంది. ఈ పోటీని తట్టుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది.

టాటా మోటార్స్ కొత్తగా నెక్సాన్ ఈవీని అప్‌డేట్ చేసి విడుదల చేయబోతుంది. ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉన్న నెక్సాన్ EV ఎలక్ట్రిక్ కారులో ఉన్న ఫీచర్లలో మార్పులు చేసి, మరింత ఆకట్టుకునే విధంగా లాంచ్ చేయడానికి కంపెనీ కసరత్తు చేస్తోంది. మార్కెట్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, భారతీయ కస్టమర్లలో ఎంతో డిమాండ్ ఉన్న నెక్సాన్ ఈవీ కొనసాగింపు మోడల్ 2025లో విడుదల అవుతుందని సమాచారం.
రాబోతున్న కొత్త తరం నెక్సాన్ ఈవీ దాని పాత తరం మోడల్ లాగే విజయవంతం అవుతుందని టాటా మోటార్స్ భారీ అంచనాలు పెట్టుకుంది. అన్ని అనుకున్నట్లు జరిగినట్లయితే కొత్త నెక్సాన్ ఈవీ వచ్చే దీపావళి నాటికి అమ్మకానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. పాత దానితో పోలిస్తే, కొత్త దానిలో బ్యాటరీల పరంగా కూడా మార్పులు ఉంటాయని తెలిసిన వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

కొత్త తరం టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో రెండు ప్రధాన బ్యాటరీలు 45 kWh,55 kWh ప్యాక్ అందించే అవకాశం ఉంది. చిన్న బ్యాటరీతో 489 కిలోమీటర్లు రేంజ్ రావచ్చు, అలాగే పెద్ద బ్యాటరీ ఆప్షన్‌తో 585 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం విక్రయిస్తున్న మోడల్‌లో 30 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తున్నారు. ఇదే బ్యాటరీని కూడా అందించే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం.
అయితే ఇలా చేసినట్లయితే సేల్స్ తక్కువగా నమోదు కావచ్చు. కాబట్టి దీని కంటే పెద్ద బ్యాటరీలను అందించవచ్చని చెప్పవచ్చు. అదే ఫీచర్స్ విషయానికి వస్తే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం వంటి వాటిని కొత్త తరం నెక్సాన్ ఈవీలో ఇవ్వనున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








