కారు కొనేవారు కాస్త ఆగండి.. కొత్త టాటా నెక్సాన్ 2nd జనరేషన్ వచ్చేస్తుంది.. ఫీచర్లు చేసేయండి!
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఏళ్లుగా ఈ బ్రాండ్ కార్లు వినియోగదారులను ఆకట్టుకుంటూనే వస్తున్నాయి. వాటిల్లో బాగా పాపులర్ అయిన సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్. లాంచ్ అయినప్పటి నుంచి ఈ కారు కస్టమర్లను బాగా ఆకర్షించడమే కాకుండా.. టాటా సంస్థకు బోలెడన్ని లాభాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ మోడల్‌లో నెక్స్ట్-జనరేషన్ మోడల్‌ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది టాటా సంస్థ. 'Garut' పేరుతో రానున్నట్లు తెలుస్తున్న ఈ కారు 2027 నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నెక్సాన్.. టాటా లైన్-అప్‌లో పంచ్ కారు తర్వాత బెస్ట్-సెల్లింగ్ మోడల్‌గా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, స్సెసిఫికేషన్స్ తదితర అంశాలకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో..
ఈ కారు 2017లో లాంచ్ అయ్యింది. రెండుసార్లు అప్డేటెడ్ వెర్షన్లలో వచ్చింది. ఇప్పుడు రాబోతున్న కొత్త నెక్సాన్ కారులోనూ X1 ప్లాట్‌ఫామ్‌నే వినియోగించనున్నారు. ఇది 1990 నాటి ఇండికా ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మించింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ ప్లాట్‌ఫామ్ కీలకమైన అప్డేట్లతో వచ్చింది 2023 ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఇందులో ఒకటి. ఇప్పుడు రాబోతున్న న్యూ-జనరేషన్ కారులో.. చాలా స్ట్రక్చరల్ చేంజెస్ ఉండబోతున్నాయి. దీని ఎక్స్టీరియర్ డిజైన్‌ను పూర్తిగా మార్పు చేశారు.

ఇక ఈ నెక్స్ట్-జనరేషన్ టాటా నెక్సాన్ కారులో ఫీచర్లలో కూడా అధునాతనతను జోడించి తీసుకురానున్నారు. ఈ మార్పులు మోడర్న్ ట్రెండుకు తగ్గట్టుగా ఉంటూ వినియోగదారులకు మెరుగైన అనుభూతి ఇచ్చే విధంగా ఉంటాయి. అయితే వీటిలో అప్డేట్స్ ఏంటి అనే వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదు. కానీ, వీటితో ఈ కారుకు కొత్త లుక్&ఫీల్ ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.
ఇక ఈ కారు ఇంజిన్ ఆప్షన్స్ విషయానికొస్తే ప్రస్తుతం ఉన్న పెట్రోల్, CNG, డీజిల్ ఇంజిన్లను రాబోయే కారులోనూ కొనసాగించే అవకాశం ఉంది. అయితే BS7 ఉద్గారాల నిబంధనల కారణంగా డీజిల్ వేరియంట్‌కు అంత ఆదరణ దక్కకపోవచ్చు. దీన్నిబట్టి టాటా మోటార్స్ సంస్థ 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ డిస్కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ కారులో SCR సిస్టం కూడా జోడించనున్నారు.

ఐసీఈ(Internal Combustion Engine) మోడల్‌తో పాటుగా నెక్సాన్ ఈవీలో కూడా అప్‌డేట్స్‌తో తీసుకువచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వీటి వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ.. ఈ కొత్త అప్డేట్లతో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో తన సత్తా చాటాలని టాటా సంస్థ భావిస్తోంది. ఈ రెండు వెర్షన్లు అందుబాటులోకి రావడం వల్ల అటు రెగ్యూలర్ కస్టమర్లతో పాటు.. ఈవీ ఔత్సాహికులను సైతం ఆకట్టుకునే అవకాశం ఉంటుంది.
ఈ సెకండ్-జనరేషన్ నెక్సాన్ కారు మారుతి సుజుకి బ్రీజా, మహీంద్రా XUV 3XO, కియా సోనేట్, హ్యుందాయ్ అవెన్యూ వంటి కార్లకు పోటీగా నిలవనుంది. ఈ నెక్సాన్ కారులో ఈవీ వేరియంట్‌ను కూడా 2027 నాటికి తీసుకురానున్న నేపథ్యంలో.. ఈ సంస్థకు పర్యావరణహితకర వాహనాలను తీసుకురావడంపై ఉన్న నిబద్ధతను చాటుతోంది. ఈ కారు మార్కెట్లోకి వస్తే వినియోగదాల నుంచి మంచి ఆదరణ దక్కించుకునే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: ఈ నెక్సాన్ కారులో అప్డేటెడ్ వెర్షన్ అయిన ఈ కొత్త కారును 2027 నాటికి లాంచ్ చేసే అవకాశం ఉంది. మార్కెట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ కొత్త కారులో అప్డేట్లను టాటా సంస్థ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ టాటా నెక్సాన్ పూర్వ వైభవం దిశగా సాగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








