కనీవిని ఎరుగని రీతిలో 5-స్టార్ సేఫ్టీ కారు సేల్స్.. ఒక్క నెలలో ఏకంగా 22 వేల మంది కొన్నారు!

టాటా నెక్సాన్ (tata nexon) భారతీయ మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్‌ను సొంతం చేసుకున్న SUV. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తన ప్రభావాన్ని చూపుతోంది. పనితీరు, సేఫ్టీ, డిజైన్, ఎన్నో వేరియంట్ ఆప్షన్లు ఈ నాలుగు అంశాలు నెక్సాన్‌ను SUV అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. గ్లోబల్ NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధిస్తూ మేడిన్ ఇండియా వాహనాలకు గౌరవం తీసుకువచ్చిన మొదటి SUV ఇదే కావడం టాటాకు పెద్ద మైలురాయి. ఇలాంటి ఖ్యాతిని సంపాదించిన నెక్సాన్, అమ్మకాల పరంగా కూడా అదే రీతిలో దూసుకుపోతోంది. ప్రకటించిన తాజా గణాంకాలను పరిశీలిస్తే, ఈ అక్టోబర్ నెలలో మొత్తం 22,083 యూనిట్లు కొనుగోలుదారులకు డెలివరీ చేయబడ్డాయి.

2024 అక్టోబర్ అమ్మకాలతో పోలిస్తే ఇది ఆశ్చర్యకరమైన వృద్ధి. అప్పుడు 14,759 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ రెండింటినీ కలిపి చూసినప్పుడు అమ్మకాల వృద్ధి 49.62% వరకు పెరిగిందని అంచనా. SUV సెగ్మెంట్‌లో ఇది చిన్న పెరుగుదల కాదు, భారీ మెరుగుదల. నెక్సాన్ అమ్మకాలు అక్టోబర్‌లో ఇలా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది సెప్టెంబర్ 22న అమల్లోకి వచ్చిన GST సవరణ.

Tata Nexon October 2025 Sales Recorded 22083 Units More Details

ఈ మార్పు వల్ల నెక్సాన్ ధర గణనీయంగా తగ్గి, మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ధర తగ్గడం ఒక్క కారణం కాకుండా, దీపావళి పండుగ సీజన్ కూడా అమ్మకాలపై ప్రత్యేక ప్రభావం చూపింది. ఫెస్టివ్ సీజన్‌లో కార్ల కొనుగోలు అధికంగా ఉండటం సహజం. దానికి అదనంగా టాటా అందించిన ఆఫర్లు, ఇంస్టంట్ డెలివరీ ఆప్షన్లు, ఫైనాన్స్ సౌకర్యాలు.. ఇవన్నీ కలిపి నెక్సాన్ అమ్మకాలను మరింతగా పెంచాయి.

ప్రస్తుతం SUV సెగ్మెంట్‌లో పోటీ ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ, నెక్సాన్ మాత్రం తన సొంత స్థానాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతుంది. సేఫ్టీ పరంగా రికార్డులు, డిజైన్ పరంగా, ఫీచర్ల విషయంలో ఆధునికత, పనితీరులో నమ్మకం.. ఈ నాలుగు అంశాలు కలిసి నెక్సాన్‌ను ఎప్పటికప్పుడు ప్రజాదరణ కలిగిన SUVగా నిలబెడుతున్నాయి. ఈ వేగంతో నెక్సాన్ భవిష్యత్తులో కూడా అమ్మకాల పట్టికలో టాప్ స్థానాల్లో నిలుస్తుందనే నమ్మకం ఆటో పరిశ్రమ నిపుణుల్లో ఉంది.

Tata Nexon October 2025 Sales Recorded 22083 Units More Details

టాటా నెక్సాన్ ధర పరంగా కూడా కస్టమర్లకు చాలా అందుబాటులో ఉంటుంది. SUV సెగ్మెంట్‌కు చెందినప్పటికీ, ఇది బడ్జెట్ రేంజ్‌లోనే లభించడం దీని ప్రధాన ఆకర్షణ. ప్రస్తుత ధరలు రూ. 7.32 లక్షల నుంచి రూ. 14.05 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. ఈ ధరల్లో నెక్సాన్ అందించే ఫీచర్లు, పనితీరు, సేఫ్టీ స్టాండర్డ్స్ చూస్తే, ఇది విలువకు సరిపోయే ప్యాకేజ్ అనిపిస్తుంది.

ఇంటీరియర్ స్పేస్ విషయానికి వస్తే, నెక్సాన్ 5 సీట్లను సౌకర్యవంతంగా అమర్చడానికి మంచి ప్రాక్టికల్ డిజైన్‌ను ఉపయోగించింది. పవర్‌ట్రెయిన్ విషయంలో నెక్సాన్ మరింత ఆప్షన్లను అందిస్తోంది. ఇది మూడు శక్తివంతమైన ఇంజిన్ లైనప్‌లతో 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.2-లీటర్ పెట్రోల్ + CNG (డ్యూయల్-ఫ్యూయల్ ఆప్షన్), అలాగే ఎలక్ట్రిక్ వేరియంట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Tata Nexon October 2025 Sales Recorded 22083 Units More Details

డ్రైవింగ్ స్టైల్‌ను బట్టి ఎన్నుకునే విధంగా ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను కూడా అందించింది. వీటిలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, ఇంకా వేగవంతమైన, స్మూత్ గేర్‌షిఫ్ట్‌ల కోసం 7-స్పీడ్ DCT కూడా ఉంది. మైలేజీ విషయంలో నెక్సాన్ అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తుంది. వేరియంట్ మరియు డ్రైవింగ్ కండిషన్లను బట్టి 17 నుండి 24 kmpl వరకు ఇంధన సామర్థ్యం ఇస్తుంది.

గంటకు 180 కి.మీ గరిష్ఠ వేగాన్ని చేరుకోగలిగే ఈ SUV, కేవలం 11 సెకన్లలో 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకోవడం దీని శక్తిని స్పష్టంగా తెలియజేస్తుంది. టాటా నెక్సాన్ EV ధర రూ.12.49 లక్షల నుండి రూ.17.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. నెక్సాన్ EV 30 కిలోవాట్ (kWh),45 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌తో పూర్తి ఛార్జ్‌పై 275 నుండి 489 కి.మీ. రేంజ్ అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 11, 2025, 9:17 [IST]
English summary
Tata nexon october 2025 sales recorded 22083 units more details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+