5 స్టార్ సేఫ్టీ, రూ.8 లక్షల ధర, 24 కి.మీల మైలేజ్.. హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న టాటా కారు!
ప్రయాణికుల సేఫ్టీ పరంగా దేశంలో అత్యంత నాణ్యతతో కూడిన కార్లను తయారు చేసే ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (tata motors) తన కార్లను భారీ సంఖ్యలో విక్రయిస్తూ మారుతీ సుజుకీ కంపెనీకి బలమైన పోటీదారుగా నిలుస్తుంది. ice ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ కార్లను కూడా విడుదల చేస్తూ భారత్‌తో పాటు అంతర్జాతీయంగా ప్రసిద్ధ కార్ల తయారీదారుగా అవతరించింది. మార్చి నెల ముగిసిన నేపథ్యంలో టాటా తన సేల్స్ వివరాలు విడుదల చేసింది. ఇటీవల వచ్చిన డేటా ప్రకారం, టాటా మోటార్స్ ప్రసిద్ధ మోడల్ నెక్సాన్ (nexon) కారు దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ప్రధాన కార్ల జాబితాలో ఏడవ స్థానంలో ఉంది. ఇది నెక్సాన్ కారుకు భారతీయ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణను తెలియజేస్తుంది.
మొదటి స్థానంలో హ్యుందాయ్ క్రెటా, రెండవ స్థానంలో మారుతి స్విఫ్ట్, మూడవ స్థానంలో టాటా పంచ్ మైక్రో SUVలు నిలవగా, ఏడవ స్థానంలో నెక్సాన్ ఉంది. మార్చి 2025లో టాటా మోటార్స్ నెక్సాన్ SUVలను దాదాపు 16,366 మంది కొనుగోలు చేశారు. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 16 శాతం పెరగడం విశేషం. 2024 మార్చి నెలలో నెక్సాన్ కారును దాదాపు 14,058 మంది కొనుగోలు చేశారు.

టాటా నెక్సాన్ అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం దాని ఆకట్టుకునే డిజైన్ అలాగే, శక్తివంతమైన ఇంజిన్ పనితీరు, మైలేజ్, ఈవీ రేంజ్ మొదలైన అంశాలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో నెక్సాన్ suv 15,349 యూనిట్ల అమ్మకాలు సాధించింది. అదే జనవరిలో 15,397 యూనిట్లు అమ్ముడుపోయింది. దీనికి ముందు డిసెంబర్‌లో 13,536 యూనిట్లు, నవంబర్‌లో 15,329 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.
అక్టోబర్ పండుగ సమయంలో సేల్స్ ఎక్కువగా ఉంటాయని అనుకున్నప్పటికీ 14,759 యూనిట్లు అమ్ముడుపోయాయి. కానీ ఆ తర్వాత నెలలో విక్రయాలు పెరగడం చాలా సంతోషించే విషయం అని చెప్పవచ్చు. నెక్సాన్ ప్రస్తుతం భారతీయ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న మోడల్‌గా ఉంది. దేశీయంగా అందుబాటులో ఉన్న టాటా నెక్సాన్ SUV ప్రారంభ బేస్ వేరియంట్ ధర వచ్చేసి రూ. 8 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర.

అదే టాప్ ఎండ్ వేరియంట్‌ను కొనుగోలు చేయాల్సిన వారు రూ. 15.60 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ ధర దేశంలోని ప్రధాన నగరాలను బట్టి మారుతుంది. ఈ కారులో 5 మంది కలిసి సౌకర్యంగా ప్రయాణించవచ్చు. చిన్న కుటుంబం గల వినియోగదారులకు అత్యుత్తమైన ఆప్షన్ గా ఉంటుంది. నెక్సాన్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది.
టాటా నెక్సాన్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.2 లీటర్ CNG ఇంజిన్ ఆప్షన్‌లో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 7-స్పీడ్ DCT (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్)ను వేరియంట్‌ను బట్టి ఇంజిన్‌లకు జోడించారు. ఈ కారు దాదాపు 17.01 నుంచి 24 కి.మీల వరకు మైలేజ్‌ను అందిస్తుంది. ఈ విషయంలో కస్టమర్లను బాగా అట్రాక్ట్ చేసే మోడల్‌గా ఉంది.

ఈ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది 30 కిలోవాట్ (kWh), 46.08 కిలోవాట్ (kWh) కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంది. పూర్తి ఛార్జ్‌తో 275 నుండి 489 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. దేశీయ మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.12.49 లక్షల నుంచి మొదలుకుని టాప్ ఎండ్ వేరియంట్ రూ. 17.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.


Click it and Unblock the Notifications








