తక్కువ EMIలో టాటా నెక్సాన్ కొనాలా? నెలకు రూ.11 వేలతో వస్తోంది.. పూర్తి ధర వివరాలు ఇవే
టాటా నెక్సాన్ (Tata Nexon) ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటి. తన బలమైన డిజైన్, నాణ్యమైన నిర్మాణం, ఆధునిక ఫీచర్లు, విశ్వసనీయమైన పనితీరు వల్ల ఇది వినియోగదారులలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలు చూస్తే, ఈ SUV ఇంకా అదే ఉత్సాహంతో కొనుగోలు చేయబడుతున్నదని స్పష్టమవుతోంది. 2025 సెప్టెంబర్ నెలలో టాటా నెక్సాన్ భారీ విజయాన్ని నమోదు చేసింది. కేవలం ఒక నెలలోనే మొత్తం 22,500 యూనిట్లు డెలివరీ చేయడం ద్వారా ఇది మరోసారి మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. టాటా నెక్సాన్ ధర విషయానికి వస్తే, ఇది విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 7.32 లక్షలు.
ఇక టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 14.05 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ ధర పరిధి కారణంగా, ఇది విభిన్న బడ్జెట్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. భద్రత పరంగా, టాటా నెక్సాన్ ఇప్పటికే గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లలో 5-స్టార్ రేటింగ్ సాధించింది. కొత్తగా కారు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నవారు, ఫీచర్స్, సేఫ్టీ కలిగినటువంటి ఈ కారును హాయిగా ఎంచుకోవచ్చు. దీని EMI గురించిన వివరాలు ఈ కథణంలో చూద్దాం.

ముందుగా స్టార్ట్ (పెట్రోల్) వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 8.74 లక్షలు. ఈ మోడల్‌ను కొనుగోలు చేసే సమయంలో రూ. 3 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన రూ. 5.74 లక్షల మొత్తానికి రుణం తీసుకోవచ్చు. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల రుణం తీసుకుంటే, నెలవారీ EMI సుమారు రూ. 11,500 వరకు వస్తుంది. తక్కువ బడ్జెట్‌లో SUV కొనాలనుకునే వారికి ఇది సరైన ఆప్షన్‌గా చెప్పొచ్చు.
ఇక స్టార్ట్ ప్లస్ ఎస్ (పెట్రోల్) వేరియంట్ విషయానికి వస్తే, దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ. 9.89 లక్షలు. మీరు రూ. 3 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన రూ. 6.89 లక్షల రుణంపై 9% వడ్డీతో 5 సంవత్సరాల EMI సుమారు రూ. 14,000 వరకు వస్తుంది. ఇది కొంచెం ఎక్కువ ఫీచర్లను కోరుకునే వినియోగదారులకు మంచి ఎంపికగా ఉంటుంది.

స్టార్ట్ ప్లస్ డీజిల్ మోడల్ ఆన్-రోడ్ ధర రూ. 10.72 లక్షల వరకు ఉంటుంది. మీరు రూ. 3 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, రూ. 7.72 లక్షల రుణం మిగులుతుంది. దీనిపై 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటే, నెలవారీ EMI సుమారు రూ. 16,000 వరకు ఉంటుంది. ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి డీజిల్ వేరియంట్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
ఇక సిఎన్‌జి వేరియంట్ స్మార్ట్ CNG గురించి చెప్పుకుంటే, దీని ఆన్-రోడ్ ధర రూ. 9.82 లక్షలు. రూ. 3 లక్షల డౌన్ పేమెంట్ తర్వాత మిగిలిన రూ. 8.49 లక్షలకు రుణం తీసుకుంటే, EMI సుమారు రూ. 14,150 వరకు ఉంటుంది. ఇంధన వ్యయాన్ని తగ్గించుకోవాలనుకునే కుటుంబాలకు ఈ CNG వేరియంట్ ఒక అద్భుతమైన ఎంపికగా ఉంటుంది.

టాప్ వేరియంట్ ఫియర్‌లెస్ ప్లస్ PS డార్క్ CNG ప్రీమియం కస్టమర్ల కోసం రూపొందించబడింది. దీని ఆన్-రోడ్ ధర రూ. 16.26 లక్షలు. రూ. 3 లక్షల డౌన్ పేమెంట్‌తో మిగిలిన రూ. 13.26 లక్షల రుణంపై 9% వడ్డీతో 5 సంవత్సరాల EMI సుమారు రూ. 27,500 వరకు వస్తుంది. ఈ వేరియంట్ స్టైలిష్ లుక్, ఫీచర్లు, సురక్షితమైన డ్రైవింగ్ అనుభవం కోరుకునే వారికి అత్యుత్తమ ఎంపికగా ఉంటుంది.
టాటా నెక్సాన్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.2-లీటర్ CNG. ఈ మూడు ఇంజిన్‌లలో ప్రతి ఒక్కదీ వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా డిజైన్ చేయబడింది. మైలేజ్ విషయానికి వస్తే, టాటా నెక్సాన్ 17 kmpl నుంచి 24 kmpl వరకు ఇస్తుంది. ప్రయాణికుల భద్రత పరంగా చూస్తే, టాటా నెక్సాన్ తన తరగతిలోనే అత్యుత్తమ SUVలలో ఒకటి. ఇది గ్లోబల్ NCAP టెస్టుల్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది.


Click it and Unblock the Notifications








