6లక్షల యూనిట్ల అమ్మకాలతో చరిత్ర సృష్టించిన టాటా పంచ్.. ఇంత సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా ?

టాటా మోటార్స్ తన విప్లవాత్మక కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన పంచ్ ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుందని ప్రకటించింది. ఇది కేవలం నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో 6 లక్షల కార్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించింది. అక్టోబర్ 2021లో విడుదలైన తర్వాత టాటా పంచ్ తన స్పెషల్ డిజైన్, పర్ఫామెన్స్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో దూసుకుపోతోంది.

2024లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా టాటా పంచ్ చరిత్ర సృష్టించింది. ఇది సిటీ నుంచి గ్రామీణ ప్రాంత ప్రజల వరకు అందరినీ ఆకర్షిస్తోంది. అంతే కాకుండా ఫస్ట్ టైం కారు కొనుగోలు చేసే వారి బెస్ట్ ఛాయిస్ కూడా టాటా పంచే. సిటీ రోడ్ల నుంచి కచ్చా రోడ్ల వరకు అన్ని రహదారుల్లో నడిచే విధంగా దీనిని రూపొందించారు.

Tata Punch

యువతకు, ఫ్యామిలీ వంటి వివిధ వర్గాల వినియోగదారులను టాటా పంచ్ ఆకర్షిస్తోంది. దీని ప్రారంభ ధర రూ.6.20 లక్షలు (ఎక్స్‌షోరూమ్) కాగా, టాప్ వేరియంట్ ధర రూ.10.32 లక్షలు (ఎక్స్‌షోరూమ్) ఉంది.

మొదటిసారి కారు కొనుగోలు చేసే వారికి పంచ్ అత్యుత్తమ ఎంపిక. ఇది ఫెసిలిటీ, సేఫ్టీ, ఎస్‌యూవీ స్టాండ్‌ను సంపూర్ణంగా అందిస్తుంది. పంచ్ యజమానులలో దాదాపు 70% మంది మొదటిసారి కారు కొనుగోలు చేసిన వారే. అంతేకాకుండా, మహిళా డ్రైవర్లలో కూడా పంచ్ బలమైన ఆకర్షణను పొందిందని కంపెనీ తెలిపింది.

Tata Punch

టాటా పంచ్ పెట్రోల్/సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వెర్షన్లు అన్నీ గ్లోబల్ ఎన్‌క్యాప్, భారత్ ఎన్‌క్యాప్ నుండి 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను పొందాయి ఇది పెట్రోల్, సీఎన్‌జీ, ఈవీ, పవర్‌ట్రైన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. టాటా మోటార్స్ మొత్తం ప్యాసింజర్ వెహికల్ అమ్మకాల్లో పంచ్ వాటా 36% అని కంపెనీ తెలిపింది.

పంచ్ ఆకర్షణ భారతదేశంలోని నగరాలు, గ్రామీణ ప్రాంతాలలో కూడా విస్తరించింది. టైర్ 1 నగరాల నుండి 24%, టైర్ 2 నగరాల నుండి 42%, టైర్ 3 పట్టణాల నుండి 34% మంది టాటా పంచ్ కార్లను కలిగి ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా వినియోగదారులతో దాని లోతైన సంబంధాన్ని స్పష్టం చేస్తుందని టాటా పేర్కొంది.

Tata Punch

పంచ్ మహిళా డ్రైవర్లను కూడా టాటా పంచ్ ఆకర్షిస్తోంది. దాని స్మార్ట్ డిజైన్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, మంచి రోడ్ వ్యూలను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనికి చక్కటి ఉదాహరణ ఏమిటంటే, 25% పంచ్.ఈవీ యజమానులు మహిళలు కావడమే.

సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో పంచ్ 38% మార్కెట్ వాటాతో తన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. సంవత్సరానికి 15% బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఇది 20కి పైగా ప్రసిద్ధ ఆటోమోటివ్ అవార్డులను దక్కించుకుంది. ఈ అసాధారణ ప్రయాణాన్ని గుర్తుచేసుకోవడానికి టాటా మోటార్స్ ఇండియా కి ఎస్‌యూ అనే కొత్త దేశవ్యాప్త ప్రచారాన్ని కూడా ప్రారంభించింది.

6 లక్షలకు పైగా టాటా పంచ్ కార్లు రోడ్లపైకి రావడం అనేది కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు, ఈ విజయాన్ని సాధ్యం చేసిన వివిధ రకాల ప్రయాణాలకు ఇది ఒక కృతజ్నత అని టాటా తెలిపింది.

More from DriveSpark

Article Published On: Friday, July 18, 2025, 8:39 [IST]
English summary
Tata punch achieves historic milestone 6 lakh units produced in under 4 years
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+