భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో కిరాక్‌ ఎలక్ట్రిక్‌ కార్లు.. ఇప్పుడే ఖర్చీఫ్ వేయండి, లేదంటే మీ లక్‌ పోయినట్లే!

భారత ఆటోమోబైల్ ఇండస్ట్రీలో.. తమ వాహనాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది టాటా మోటార్స్ సంస్థ. అన్ని వర్గాల వినియోగదారులకు సరిపడే వాహనాలను తయారు చేస్తూ కస్టమర్స్ నుంచి మన్ననలు అందుకుంటూ ఉంది. ఈవీల్లోనూ తగ్గేదేలా అన్నట్లుగా తమ జోరు చూపెడుతోంది. ఈ సంస్థ నుంచి గతేడాది టాటా పంచ్ ఈవీ (Tata Punch EV), టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) మోడళ్లు అమ్మకాలతో అదరగొట్టాయి. ఇప్పుడు తమ సేల్స్‌ను మరింత పెంచుకునేందుకు టాటా మోటార్స్ సంస్థ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ రెండు మోడళ్ల ఈవీలపై ఏకంగా రూ.85,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు అందుబాటులో ఉండనుంది? ఈ తగ్గింపుతో ఈ కార్ల ధరలు ఎలా ఉండబోతున్నాయి? వంటి వివరాలు చూసేద్దాం.

టాటా పంచ్ ఈవీ, టాటా టియాగో ఈవీలకు సంబంధించి MY2024, MY2025 స్టాక్స్‌పై ఈ డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఈ జనవరి నెలాఖరు వరకు ఈ ఆఫర్ ఉండనుంది. అయితే ఈ డిస్కౌంట్ వేరియంట్‌ను బట్టి వేర్వేరుగా ఉండనున్నాయి. "గ్రీన్ బోనస్", ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపింగ్ రూపేణా వంటి ఇతర డిస్కౌంట్లు కూడా లభించనున్నాయి.

Tata Punch EV

టాటా టియాగో MY2024 స్టాక్ అయిన ఈవీ‌ 3.3 kW XE వేరియంట్ ధర రూ.8.57 లక్షలుగా ఉంది. ఇది రూ.50,000 డిస్కౌంట్‌లో లభిస్తుంది. 3.3kW XT MR వేరియంట్ రూ.9.61 లక్షల్లో అందుబాటులో ఉంది. దీనిపై రూ.70,000 వరకు డిస్కౌంట్ ఉంటుంది.

అదే సమయంలో రూ.10.63 లక్షల్లో లభించే 3.3 KW XT LR వేరియంట్‌పై రూ.85,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. టియాగో ఈవీ 3.3kW XZ+ వేరియంట్ ధర రూ.11.18 లక్షలుగా ఉండగా.. ఇందులో టాప్ వేరియంట్ XZ+ Tech Lux ధర రూ.11.71 లక్షలుగా ఉంది. వీటిపై రూ.60,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

Tata Tiago EV

7.2kW ఫాస్ట్ ఛార్జర్‌తో వచ్చే టాటా టియాగో ఈవీ XZ+ and XZ+ Tech Lux వేరియంట్లపై రూ.60,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. మొత్తంగా చూస్తే MY2025 టియాగో ఈవీ లైనప్‌పై రూ.40,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది.

ఇక టాటా పంచ్ విషయానికి వస్తే.. MY2024 స్టాక్‌కు సంబంధించి 3.3kW MRతో ఉండే Smart and Smart + వేరియంట్లపై రూ.40,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. 3.3kW MRకి సంబంధించి ఇతర వేరియంట్లపై రూ.50,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

Tata Tiago Offers

అదే సమయంలో 3.3kW LR వేరియట్ కూడా రూ.50,000 డిస్కౌంట్‌లో దొరుకుతుండగా.. 7.2kWతో ఉండే LR వేరియంట్ అయితే రూ.70,000 వరకు తగ్గింపు ఉంటుంది. టాటా పంచ్ ఈవీ MY2025 స్టాక్‌కు సంంబంధించి స్మార్ట్, స్మార్ట్+ మినహా అన్ని వేరియంట్లు రూ.40,000 వరకు తగ్గింపు ఉంటుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 8, 2025, 16:25 [IST]
English summary
Tata punch and tiago ev gets discount up to rs 85000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+