కేవలం రూ.6 లక్షలకే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న కారు! కస్టమర్లు రాకపోయే సరికి కంగుతిన్న డీలర్లు

ప్రయాణికులకు ప్రమాద సమయంలో అత్యుత్తమ రక్షణ అందించే కార్లను తయారు చేయడంలో ఎప్పుడు ముందు ఉంటుంది టాటా మోటార్స్ (tata motors). ఏప్రిల్ నెల ముగిసిన నేపథ్యంలో కంపెనీ వరుసగా తన మోడళ్ల వారీగా అమ్మకాలను విడుదల చేస్తుంది. ఈ క్రమంలో తన ప్రసిద్థ మోడల్ పంచ్ మైక్రో SUVకి సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, గత ఏడాది ఇదే నెలలో (ఏప్రిల్ 2024) 19,158 యూనిట్లు విక్రయించిన ఈ మోడల్, ఏప్రిల్ 2025లో కేవలం 12,496 యూనిట్లకే పరిమితమైంది. ఇది సుమారు 35 శాతం తగ్గుదలగా నమోదు కావడంతో, పంచ్ మోడల్‌కు మార్కెట్ డిమాండ్‌లో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు టాప్-5 SUVల జాబితాలో నిలిచిన పంచ్, ఇప్పుడు 6వ స్థానానికి పరిమితమవడం, గమనించదగిన మార్పు.

దీన్ని బట్టి చూస్తే, మార్కెట్లో కొత్త మోడళ్ల రాక, వినియోగదారుల అభిరుచుల మార్పు, అలాగే టాటా మోటార్స్ తాజా లాంచ్ సమయంలో తీసుకున్న వ్యూహపరమైన నిర్ణయాల ప్రభావం కారణంగా అమ్మకాలు కొంత వరకు తగ్గాయి. అంతేకాదు, ఏప్రిల్ 2025లో పంచ్ మోడల్‌కి సరైన ప్రచారం లేకపోవడం, లేదా మరింతగా పోటీదారుల కార్లు దీని కంటే ఎక్కువ ఆకట్టుకోవడం వంటి అంశాలు కూడా ఈ అమ్మకాల తగ్గుదలకు కారణమవుతున్నట్టు అర్థమవుతోంది.

Tata Punch Sales Report

టాటా పంచ్ అమ్మకాలు మార్చి 2025లో నమోదైన 17,714 యూనిట్లతో పోలిస్తే ఏప్రిల్ నెలలో 29.46 శాతం తగ్గుదల. ఈ గణాంకాలు చూస్తే, టాటా పంచ్ మైక్రో SUV సాలిడ్ పర్ఫార్మెన్స్‌ను కొంతకాలంగా కొనసాగించినప్పటికీ, పోటీ పెరగడం వలన సేల్స్ తగ్గుముఖం పట్టాయి. దీనికంటే ముందు ర్యాంకింగ్ ప్రకారం, టాప్ 5 SUVలలో హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ బ్రెజ్జా, మహీంద్రా స్కార్పియో, టాటా నెక్సాన్, మారుతి ఫ్రాంక్స్ ఉన్నాయి.

అయితే అమ్మకాలు తాత్కాలికంగా వెనుకడుగు వేసినప్పటికి పంచ్ త్వరలోనే కోలుకునే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం, టాటా మోటార్స్ త్వరలోనే ఫేస్‌లిఫ్ట్ మోడల్‌‌ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నదన్న ఊహగానాలు. ఈ అప్‌డేట్ వెర్షన్‌లో కొత్త డిజైన్‌, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, ఇన్నోవేటివ్ టెక్నాలజీ సమ్మేళనంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, టాటా పంచ్ మళ్లీ తన పాత పటిష్టతను సాధించవచ్చు.

Tata Punch Ev Sales

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న టాటా మోటార్స్, పంచ్ మోడల్‌కు సంబంధించి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మరింత శక్తివంతమైన రూపంతో 2025 చివరి నాటికి మార్కెట్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కొత్త మోడల్ రాకతో, గత కొన్ని నెలలుగా తగ్గుముఖం పట్టిన అమ్మకాల గణాంకాలు తిరిగి పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉన్న టాటా పంచ్ విభిన్న వెర్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఐసీఈ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.20 లక్షల నుంచి రూ.10.32 లక్షల వరకు కొనుగోలుకు లభిస్తుంది. అదే ఎలక్ట్రిక్ వెర్షన్ రూ.9.99 లక్షల నుంచి రూ.14.44 లక్షల వరకు లభిస్తుంది. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే ప్రభుత్వ పన్నులు, నగరాలను బట్టి మారుతు మరింత ఎక్కువగా ఉంటాయి.

Tata Punch April 2025 Sales Recorded 35 Percent Down

కేవలం ధర పరంగా కాకుండా, భద్రతా ప్రమాణాల విషయంలోనూ టాటా పంచ్ నిలదొక్కుకుంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్టుల్లో ఇది 5-స్టార్ రేటింగ్ పొంది కుటుంబాల భద్రతను ముఖ్యంగా పరిగణించే వినియోగదారులకు నమ్మకమైన మోడల్‌గా నిలుస్తుంది. పైగా మైలేజ్ కూడా ఎక్కువగా ఇస్తుండటం కూడా కస్టమర్లకు కలిసొచ్చే అంశం అని చెప్పవచ్చు.

Take a Poll

More from DriveSpark

Article Published On: Wednesday, May 14, 2025, 12:50 [IST]
English summary
Tata punch april 2025 sales recorded 35 percent down compared to previous
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+