2026లో మార్కెట్‌ను షేక్ చేయనున్న కారు వస్తోంది! కొత్త ఫీచర్లతో పంచ్ ఫేస్‌లిఫ్ట్
భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో టాటా పంచ్ ఈవీ(Tata Punch Ev) ఒకటిగా నిలిచింది. టాటా మోటార్స్ విక్రయించే ఎలక్ట్రిక్ కార్లలో ఇది అత్యంత సరసమైన ధరకు లభించే మోడల్ కావడంతో, మిడిల్ క్లాస్ కుటుంబాలు, మొదటిసారి EV కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల నుంచి దీనికి భారీ స్పందన లభిస్తోంది. స్టైలిష్ డిజైన్, నగర వినియోగానికి సరిపోయే సైజ్, టాటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం ఈ అన్నీ కలిసి పంచ్ EVని మార్కెట్లో హాట్ ఫేవరెట్‌గా మార్చాయి. మార్కెట్లో టాటా పంచ్ EVకు ఉన్న ఈ బలమైన డిమాండ్‌ను గమనించిన టాటా మోటార్స్, ఇప్పుడు ఈ కారును మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సిద్ధమవుతోంది.
అందులో భాగంగా, టాటా పంచ్ EV అప్‌డేట్ చేసిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను త్వరలో విడుదల చేయాలనే ప్రణాళికలను కంపెనీ రూపొందిస్తోంది. ప్రముఖ ఆటో వెబ్‌సైట్ కార్వాలే సమాచారం ప్రకారం, ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ వచ్చే ఏడాది అంటే 2026లో భారత మార్కెట్లో అమ్మకానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో డిజైన్ పరంగా కీలక మార్పులు కనిపించే అవకాశం ఉందని ఆటో వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ముందు భాగంలో కొత్త స్టైలింగ్, అప్‌డేటెడ్ లైటింగ్ ఎలిమెంట్స్, మరింత ఆధునికంగా కనిపించే బంపర్ డిజైన్ వంటి మార్పులు ఉండవచ్చని భావిస్తున్నారు. అంతేకాదు, ఇంటీరియర్‌లో కూడా కొన్ని కొత్త ఫీచర్లు, టెక్నాలజీ అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న టాటా పంచ్ EVను ఫేస్‌లిఫ్ట్ రూపంలో మరింత బలంగా మార్కెట్లో నిలబెట్టాలని టాటా మోటార్స్ భావిస్తోంది.
2026లో వచ్చే ఈ అప్‌డేటెడ్ మోడల్, భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో మరోసారి చర్చకు కేంద్రబిందువుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ మాత్రమే కావడంతో, టాటా పంచ్ EVలో బ్యాటరీ ఎంపికల విషయంలో పెద్ద మార్పులు ఉండే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్యాటరీ ప్యాక్‌లు, రేంజ్, పవర్‌ట్రెయిన్ సెటప్ యథాతథంగా కొనసాగనున్నట్లు ఆటో వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఫీచర్ల విషయంలో మాత్రం టాటా మోటార్స్ కీలక అప్‌డేట్స్ తీసుకురావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న దానికంటే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ను ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో అందించే అవకాశం ఉంది. దీనితో పాటు అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్, మెరుగైన కనెక్టెడ్ కార్ ఫీచర్లు, కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్ వంటి అంశాలు కూడా జోడించవచ్చని సమాచారం. ఇంటీరియర్‌లో డిజైన్ మార్పులు, కొత్త కలర్ థీమ్స్, మెరుగైన మెటీరియల్ క్వాలిటీ వంటి అప్‌డేట్స్ కూడా ఆశించవచ్చు
ప్రస్తుతం భారత మార్కెట్లో టాటా పంచ్ EV ఎలక్ట్రిక్ కారు ధరలు ఆకట్టుకునే స్థాయిలో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కార్‌కు సంబంధించిన ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ.9.99 లక్షలుగా ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ.14.44 లక్షలు. ఇవన్నీ టాటా మోటార్స్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఎక్స్-షోరూమ్ ధరలు కావడం గమనార్హం. ఈ ధరల కారణంగానే పంచ్ EV భారత EV మార్కెట్లో సరసమైన, విలువైన ఎంపికగా నిలుస్తోంది.

బ్యాటరీ ఆప్షన్ల విషయానికి వస్తే, టాటా పంచ్ EVలో కంపెనీ 25 kWh, 35 kWh అనే రెండు బ్యాటరీ ఎంపికలను అందిస్తోంది. 25 kWh బ్యాటరీ వేరియంట్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 265 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ను అందిస్తుంది. అదే విధంగా, 35 kWh బ్యాటరీ వేరియంట్ సుమారు 365 కిలోమీటర్ల రేంజ్ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








