టాటా కొత్త వెపన్ రెడీ.. ఈ సారి మార్కెట్లో పంచ్ పడిందంటే హ్యుందాయ్, మారుతి గజగజ వణకాల్సిందే

టాటా మోటార్స్ ఎంట్రీ-లెవల్ మోడల్, చిన్న కారు అయిన టాటా పంచ్, దాని పేరుకు తగ్గట్టుగానే ప్రత్యర్థులకు ఒక అదిరిపోయే పంచ్ ఇచ్చింది. సిఎన్‌డి పవర్‌ట్రెయిన్‌తో వచ్చిన ఈ కారు నిజంగానే మిగతా కార్ల తయారీదారులకు ఒక సవాలు విసిరింది.

ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉన్న ఈ చిన్న కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ త్వరలో రాబోతుంది. దీనికి సంబంధించిన టెస్ట్ రన్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నదిగా కనిపించినా, సేఫ్టీ విషయంలో పెద్ద ఎస్‌యూవీలకు కూడా గట్టి పోటీ ఇస్తుంది. టాటా పంచ్‌లో రాబోయే మార్పులు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

Tata Punch Facelift on its Way Will it Beat Hyundai Exter and Citroen

లీక్ అయిన స్పై చిత్రాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, ముందు భాగంలోని గ్రిల్‌లో మూడు రంధ్రాలు లేకపోవడం ఒక ముఖ్యమైన మార్పుగా కనిపిస్తోంది. టెస్ట్ వాహనంలో హెడ్‌ల్యాంప్‌లకు బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. ఫాగ్ ల్యాంప్‌లు కనిపించడం లేదు. అయితే, ప్రొడక్షన్ వెర్షన్‌లో టాటా మోటార్స్ ఫాగ్ ల్యాంప్‌లను కూడా అందించే అవకాశం ఉంది.

బయటి డిజైన్‌లో లైటింగ్ సిగ్నేచర్, కొత్త వీల్స్ కూడా లభించే అవకాశం ఉంది. బయట మాత్రమే కాదు, కారు లోపల కూడా టాటా చాలా మార్పులు చేసింది. క్యాబిన్ డిజైన్, ఫీచర్లలో మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా స్టీరింగ్ వీల్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు.

Tata Punch Facelift on its Way Will it Beat Hyundai Exter and Citroen

టాటా కర్వ్, హారియర్ మోడళ్లలో ఉన్నట్లుగా కొత్త పంచ్‌లో కూడా గ్లోస్ బ్లాక్ సెంటర్ పీస్, జిగేల్ మనే టాటా లోగోతో కూడిన రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్ అందించనున్నారు. దీంతో పాటు కొత్త ఆల్ట్రోజ్‌లో ఉన్నట్లుగా టచ్ ఆధారిత హెచ్‌విఏసీ (HVAC) కంట్రోల్స్ కూడా రావచ్చు.

ప్రస్తుతం టాటా పంచ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6,19,990 నుంచి రూ. 10,31,990 వరకు ఉంది. ఇది హ్యుందాయ్ ఎక్స్‌టర్, నిస్సాన్ మాగ్నైట్, సిట్రోయెన్ సి3, కైగర్ వంటి కార్లతో పోటీ పడుతుంది. ఇది 9 వేరియంట్‌లు, 6 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కారులో 1.2 లీటర్, 3 సిలిండర్, నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది.

ఈ ఇంజిన్ 86 బీహెచ్‌పీ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టీ గేర్‌బాక్స్‌తో వస్తుంది. మాన్యువల్ వెర్షన్ లీటరుకు 18.82 కిలోమీటర్ల మైలేజీని, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 18.97 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ మంచి మైలేజ్ కారణంగానే ఈ కారు మార్కెట్‌లో మంచి అమ్మకాలను నమోదు చేస్తోంది.

ఈ కారులో 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, ఐఆర్‌ఏ కనెక్టెడ్ టెక్నాలజీ, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్, లెదర్ స్టీరింగ్ వీల్, లెదర్ గేర్ నాబ్, ఆటో-ఫోల్డింగ్ ఓఆర్వీఎం, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, రియర్ సీట్ ఆర్మ్‌రెస్ట్, ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా పంచ్ ఇండియాలో అందుబాటులో ఉన్న సేఫ్టీ కార్లలో ఒకటి. గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) క్రాష్ టెస్ట్‌లో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ప్రయాణికుల సేఫ్టీ కోసం ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, రియర్ డీఫాగర్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా, ఐఎస్‌ఓఎఫ్ఐఎక్స్ యాంకర్లు వంటి సేఫ్టీ ఫీచర్లు అందించారు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 3, 2025, 11:37 [IST]
English summary
Tata punch facelift on its way will it beat hyundai exter and citroen
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+