మిడిల్ క్లాస్ కలల కారు.. పెట్రోల్ డబ్బులను ఆదా చేసే టాటా సరికొత్త పంచ్.. దీని మెయింటనెన్స్ చాలా తక్కువ..
దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) అత్యున్నత ప్రమాణాలతో కూడిన కార్లను విడుదల చేయడంలో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఢిల్లీలో ఎంత అట్టహసంగా జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో టాటా తన వాహనాలను ఆవిష్కరించింది. ఇతర కంపెనీలకు పోటీగా కంపెనీ హారియర్ EV, సియెర్రా, అవిన్యతో సహా అనేక రకాల మోడళ్లను ఆవిష్కరించింది. ఇదే కార్యక్రమంలో టాటా మోటార్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ పంచ్ కారును అందరికీ పరిచయం చేసింది. ఈ కొత్త మోడల్ తక్కువ స్థాయిలో వాతావరణ ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఇటీవల కాలంలో గాలి కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీంతో ఇలాంటి సమయంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ప్రత్యామ్నాయ ఇంధన వాహనంగా బాగా ఉపయోగపడుతుంది.
కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి టాటా 'పంచ్' మాక్రో SUV బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుందని టాటా మోటార్స్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో నడిచే వాహనం కాబట్టి దీని మెయింటనెన్స్ కూడా చాలా సులభంగా ఉంటుంది. తక్కువ స్థాయిలో కాలుష్య కారకాలను విడుదల చేస్తుంది. ఫ్లెక్స్ ఇంధనం అంటే.. ఇది పెట్రోల్, ఇథనాల్‌ల మిశ్రమం. ప్రస్తుతం దేశంలో చాలా వాహనాలు ఈ రకమైన ఇంధనంతో పనిచేస్తున్నాయి.

ఫ్లెక్స్ ఫ్యూయల్‌లో 80% పెట్రోల్, 20% ఇథనాల్ మిశ్రమం ఉంటుంది. వ్యవసాయ వ్యర్థాలను (వరి గడ్డిని) ఉపయోగించి ఇథనాల్ ఇంధనాన్ని తయారు చేస్తారు. దీన్ని పెట్రోల్‌లో కలపడం ద్వారా విషపూరిత కాలుష్య కారకాలు తక్కువగా విడుదల అవుతాయి. ప్రస్తుతం విడుదల అవుతున్న కొత్త వాహనాల్లో ఈ రకమైన ఇంధనానికి అనువుగా ఉండే ఇంజిన్లను అందిస్తున్నారు. రాబోయే నెలల్లో పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును మార్కెట్లో అమ్మకానికి తీసుకువస్తుంది.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో టాటా మోటార్స్‌కు సంబంధించి ఈ కారు ప్రధాన ఆకర్షణగా ఉంది. దీని పవర్‌ట్రెయిన్ వివరాల గురించి కంపెనీ ఇంకా ఎలాంటి వివరాలు అందించలేదు. త్వరలోనే కంపెనీ పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ధర, ఫీచర్స్ గురించి మొత్తం డేటాను వెల్లడిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో టాటా పంచ్ కారు అమ్మకానికి ఉంది. ఇది 1.2-లీటర్ 3-సిలిండర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్‌లో ఉంది.

ఇప్పుడు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నటువంటి టాటా పంచ్ కారు ర రూ.6.20 లక్షల నుంచి రూ.10.32 లక్షల మధ్య ఉంది. ఇది ఎక్స్ షోరూమ్. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను కలిగి ఉంది. మైలేజ్ విషయానికి 18.8 నుంచి 26.99 kmpl వరకు వస్తుంది. అదే ఎలక్ట్రిక్ టాటా పంచ్ ధర రూ.9.99 లక్షల నుంచి రూ. 14.44 లక్షలు(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
ఇది 25 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌లో దాదాపు 265 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. అదే 35 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌లో 365 కి.మీల రేంజ్ అందిస్తుంది. 5 మంది పంచ్ కారులో ఈజీగా ప్రయాణించవచ్చు. దీనిలో అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. సేఫ్టీ కోసం ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటివి ఉన్నాయి.

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం మా డ్రైవ్‌స్పార్క్ సోషల్ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications








