దేశంలోనే సేఫ్టీలో ఇదే తోపు కారు.. ఎన్ని మోడళ్లు వచ్చినప్పటికి దీనికి ఇంకా భారీ డిమాండ్
టాటా పంచ్ (tata punch) గురించి మాట్లాడితే, భారతీయ వినియోగదారుల మనసుల్లో ఏర్పడిన విశ్వాసం, నమ్మకం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. దేశంలో చిన్న సైజ్‌లో వచ్చినప్పటికీ, భద్రత విషయంలో మాత్రం పెద్ద SUVలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండటం ఈ మోడల్‌కి ప్రధాన ఆకర్షణ. పంచ్‌ను రోడ్డుపై చూసిన చాలా మంది మొదట గుర్తుచేసేది అదే సేఫ్టీ. ప్రమాదాలు చోటుచేసుకునే సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులను అతి ఉత్తమమైన రీతిలో రక్షించే మోడల్‌గా పంచ్ ప్రజాదరణ పొందింది. ఇది భారతీయ కుటుంబాల అవసరాలు, ముఖ్యంగా సేఫ్టీని ప్రాధాన్యతగా భావించే వారికి బాగా సరిపోయింది. ఈ నమ్మకం నేరుగా అమ్మకాల రూపంలో కూడా కనిపిస్తోంది. చక్కటి డిజైన్, ధర, చిన్నదైనా SUV ఫీలింగ్‌తో పంచ్ మార్కెట్‌లో విడుదలైనప్పటి నుంచి నిరంతరం మెరుగైన సేల్స్‌ను నమోదు చేస్తోంది.
నెల నెలా టాప్ సెల్లింగ్ మోడళ్లలో ఒకటిగా ఉండటం ఇది ఎంత పాపులర్ అయ్యిందో చూపిస్తుంది. అక్టోబర్ నెల అమ్మకాల గణాంకాలు కూడా ఈ ట్రెండ్‌ను మరింత బలపరుస్తున్నాయి. గత నెలలో మొత్తం 16,810 యూనిట్ల టాటా పంచ్ అమ్మకాలు నమోదయ్యాయి, ఇది చిన్న SUV సెగ్మెంట్‌లో గట్టి డిమాండ్ కొనసాగుతోందని స్పష్టంగా తెలియజేస్తుంది. గత ఏడాది ఇదే నెలలో, అంటే అక్టోబర్ 2024లో పంచ్ 15,740 యూనిట్లు అమ్ముడైంది.

ఈసారి వచ్చిన సంఖ్య అదే స్థాయిలో ఉన్న డిమాండ్‌ను మరింత పెంచుకున్నట్లు చూపిస్తోంది. సంవత్సరానికొకసారి చూస్తే, పంచ్ సేల్స్‌లో 7 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. ఆటోమోటివ్ మార్కెట్‌లో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇంత మంచి గ్రోత్ సాధించడం పంచ్ ఎంత బలంగా నిలదొక్కుకుందో చెప్పడానికి సరిపోతుంది. టాటా పంచ్ భారతీయ మార్కెట్లో ఎందుకింత సక్సెస్ అయ్యిందో తెలుసుకోవాలంటే, దాని ప్రస్తుత స్థితిని ఒకసారి పరిశీలిస్తే చాలని చెప్పాలి.
ఈరోజు మన రోడ్లపై 6 లక్షలకు పైగా పంచ్ SUVలు తిరుగుతున్నాయి అంటే, ఈ మోడల్ ఎంతగా ప్రజాదరణ పొందిందో స్పష్టంగా తెలుస్తుంది. ఒక చిన్న SUVగా వచ్చి, దేశవ్యాప్తంగా ఇంత పెద్ద సంఖ్యలో రోడ్డుపై తిరుగుతూ ఉండటం టాటా మోటార్స్‌కు గర్వకారణమే కాదు, వినియోగదారులు కారును ఎంత నమ్మారో చెప్పే సాక్ష్యం కూడా. ఈ మోడల్‌కి మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఇది దాదాపు 35 వేర్వేరు వేరియంట్లలో లభించడం.

ప్రస్తుతం పంచ్ ధర రూ. 5.50 లక్షల నుండి రూ. 9.30 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ రేంజ్‌లో ఇంత సేఫ్టీ, బిల్డ్ క్వాలిటీ ఇచ్చే మోడల్ మార్కెట్లో చాలా అరుదు. పంచ్ అసలు శక్తి దాని ఇంజన్‌లోనే ఉంది. 1.2-లీటర్ 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 86 bhp పవర్, 113 Nm టార్క్‌ను అందిస్తుంది. రోజువారీ ప్రయాణాలకైనా, లాంగ్ డ్రైవ్‌లకైన్ ఇంజన్ స్మూత్‌గా, రిస్పాన్స్‌తో పనిచేస్తుంది.
దీనికి తోడు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేస్తాయి. మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 18.82 kmpl, AMT వేరియంట్ 18.97 kmpl వరకు అందిస్తుంది. ఈ సెగ్మెంట్‌లో ఈ సంఖ్యలు చాలా బలమైనవే. ఇంకా ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి టాటా మరో బెస్ట్ ఆప్షన్ CNG కూడా అందిస్తోంది. ఇది 26.99 kmpl వరకు మైలేజ్ ఇచ్చేయగలదు.



Click it and Unblock the Notifications








