పులి అడుగు వెనకేసిందంటే పంజా గట్టిగా వేయబోతుందని అర్థం.. ఇప్పుడు సేల్స్ తగ్గినా దీపావళి అంతా టాటాదే

ఒకప్పుడు ఇండియన్ మార్కెట్‌లో అమ్మకాల్లో దుమ్మురేపిన కార్లలో టాటా పంచ్ ఒకటి. కానీ, ఇటీవల టాటా పంచ్ అమ్మకాలు బాగా మందగించాయి. 2025 జూన్ నెలలో కూడా టాటా పంచ్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. అయితే, దీనికి టాటా మోటార్స్ ఒక అదిరిపోయే ప్లాన్‌తో వస్తోంది. రూ.6.5 లక్షలకే రాబోయే కొత్త మోడల్ గురించి వివరాలు తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో టాటా పంచ్ అమ్మకాలు చాలా తగ్గిపోయాయి. 2025 జూన్ నెలలో కూడా టాటా పంచ్ అమ్మకాల్లో తీవ్రమైన పతనాన్ని చూసింది. ప్రస్తుతం విడుదలైన సేల్స్ రిపోర్ట్ ప్రకారం, టాటా మోటార్స్ 2025జూన్ నెలలో కేవలం 10,446పంచ్ కార్లను మాత్రమే విక్రయించింది. ఈ సంఖ్య పెద్దదిగా కనిపించినా, గత 2024 జూన్ నెలలో 18,238టాటా పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. అంటే, టాటా పంచ్ అమ్మకాలు ఏకంగా 43శాతం పడిపోయాయి.

Tata Punch

దాదాపు సగం అమ్మకాలు తగ్గిపోయాయి. దీని కారణంగా 2025 జూన్ నెలలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో టాటా పంచ్‌కు 9వ స్థానం మాత్రమే దక్కింది. గత 2024 జూన్ నెలలో మాత్రం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో టాటా పంచ్ మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

2023 జూన్ నెలలో కేవలం 10,990 టాటా పంచ్ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అయితే 2024 జూన్‌లో ఈ సంఖ్య 18,238కి పెరిగింది. దీని ద్వారా 66 శాతం వృద్ధితో టాటా పంచ్ కారు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు అది 9వ స్థానానికి పడిపోయింది. ఈ గణాంకాలు టాటా మోటార్స్ ఇప్పుడు మేల్కోవాల్సిన సమయం వచ్చిందని సూచిస్తున్నాయి.

Tata Punch

టాటా మోటార్స్ మొత్తం అమ్మకాలలో పంచ్ వాటా పెద్దది. దీని అమ్మకాల్లో క్షీణత మొత్తం టాటా మోటార్స్ అమ్మకాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే కంపెనీ ఇప్పుడు అప్రమత్తమైంది. టాటా మోటార్స్ ప్రస్తుతం అప్‌డేట్ చేసిన పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. భారతీయ కస్టమర్లలో భారీ అంచనాలను పెంచిన ఈ కొత్త మోడల్, బహుశా రాబోయే అక్టోబర్‌లో మార్కెట్‌లోకి రావచ్చు అని భావిస్తున్నారు.

దీపావళి పండుగను పురస్కరించుకుని, టాటా మోటార్స్ పంచ్ కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేయనుంది. ప్రస్తుతం ఉన్న టాటా పంచ్ కారులో 7.0 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మాత్రమే ఉన్నాయి.

Tata Punch

అయితే, ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కంప్లీట్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందించే అవకాశం ఉంది. డిజైన్‌లో కూడా చాలా మార్పులను ఆశించవచ్చు. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర కేవలం రూ.6.50 లక్షల స్థాయిలో మాత్రమే ఉంటుందని అంచనా.

కాబట్టి, కొత్త మోడల్ వచ్చిన తర్వాత టాటా పంచ్ కారు అమ్మకాలు తిరిగి వృద్ధి పథంలోకి వస్తాయని ఆశించవచ్చు. మరికొన్ని నెలల్లో ఇది మనకు తెలిసిపోతుంది. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ రాక హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి కార్లకు గట్టి పోటీని సృష్టించవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: తక్కువ ధరలో ఒక మైక్రో ఎస్‌యూవీ కారును కొనుగోలు చేయాలని అనుకునే వినియోగదారులు, టాటా పంచ్ కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం ఎదురు చూడవచ్చు. దీపావళికి కొత్త కారు కొనాలనుకునే చాలా మంది, టాటా పంచ్ కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 9, 2025, 10:58 [IST]
English summary
Tata punch sales dip is the facelift model coming to save the day this diwali
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+