రూ.6.20 లక్షల్లోనే అన్ని ఫీచర్స్.. మధ్య తరగతికి ఇష్టమైన భారీ డిమాండ్ ఉన్న టాటా కారు.. ఏకంగా 5 లక్షల ఉత్పత్తి

భారత్‌తో పాటు అంతర్జాతీయంగా సేఫ్టీ పరంగా అత్యుత్తమైన కార్లను తయారు చేయడంలో దిగ్గజ కంపెనీగా పేరుగాంచిన టాటా మోటార్స్ (Tata Motors) అమ్మకాల్లో దూసుకుపోతుంది. వినియోగదారుల నుంచి గొప్ప కార్ల తయారీ కంపెనీగా ప్రశంసలు అందుకుంటుంది. దేశీయ మార్కెట్లో అనేక మోడళ్లను విక్రయిస్తుంది. కంపెనీ నుంచి వచ్చిన చాలా కార్లు కూడా సేల్స్ పరంగా మెరుగైన గణంకాలను సాధిస్తున్నాయి. ఈ క్రమంలో టాటా ప్రసిద్ధ మోడల్ పంచ్ (Punch) కారుకు దేశంలో మంచి ఆదరణ లభిస్తుంది. చాలా మంది ఈ మైక్రో SUVని కొనుగోలు చేస్తున్నారు. తాజాగా ఈ కారు ఉత్పత్తికి సంబందించి సరికొత్త చరిత్రను లిఖించింది. టాటా మోటార్స్ నుంచి వచ్చిన గణంకాల ప్రకారం, పంచ్ మోడల్ 5 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయికి చేరుకుంది. ఇది పెట్రోల్, CNG,ఎలక్ట్రిక్ మోడళ్ల మొత్తం ఉత్పత్తిని సూచిస్తుంది.

టాటా పంచ్ కారుకు దేశంలో భారీ డిమాండ్ ఉండటం కారణంగా కంపెనీ ఇన్ని లక్షల కార్లను ఉత్పత్తి చేసింది. 2024 ఏడాదిలో కూడా ఈ కారు అమ్మకాల పరంగా భారీ రికార్డు నమోదు చేసింది. లెక్కల ప్రకారం, మొత్తం 2,02,030 యూనిట్ల పంచ్ SUVలు అమ్ముడుపోయాయి. ముఖ్య విషయం ఏమిటంటే, దాదాపు 40 ఏళ్లుగా ప్రతి సంవత్సరం అత్యధికంగా సేల్ అవుతున్న కార్లలో మారుతి సుజుకీ మొదటి స్థానంలో ఉంటుంది.

Tata Punch Suv Registered 5 Lakh Units Production

అయితే 2024 ఏడాదిలో మాత్రం ఈ స్థానంలోకి టాటా పంచ్ వచ్చి చేరింది. టాటా పంచ్ కారు ప్రధానంగా పెట్రోల్, cng మోడళ్లలో కొనుగోలుకు అందుబాటులో ఉండటం బాగా కలిసి వచ్చింది. ఇతర కార్లు చాలా వరకు cng లో తక్కువగా ఉంటాయి. దీంతో వినియోగదారులు పంచ్‌ కారులో తమకు నచ్చిన ఇంజిన్ వేరియంట్‌ను ఎంచుకోవడానికి అవకాశం లభించింది. పైగా దీని ఆకట్టుకునే డిజైన్ కూడా చాలా మందికి నచ్చింది.

ప్రస్తుతం టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ ధర రూ.6.20 లక్షల నుంచి రూ.10.32 లక్షల వరకు ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ఎక్స్‌టీరియర్ చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది. ఇది శక్తివంతమైన ఇంజిన్‌ను పనిచేస్తుంది. 1.2-లీటర్ 3-సిలిండర్ నేచురల్ పెట్రోల్, అలాగే, CNG ఆప్షన్లలో లభిస్తుంది. 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జత చేశారు. ఇది ప్యూర్, అడ్వెంచర్, క్రియేటివ్ ప్లస్‌ వంటి ఆప్షన్లలో ఉంది.

Tata Punch Suv Price

ఈ కారులో 5 మంది కలిసి ప్రయాణించవచ్చు. లోపల ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. డజన్ల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ ఛార్జర్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 4-స్పీకర్లు, మెరుగైన సీట్లు, పలు స్మార్ట్‌కనెక్టివిటీ ఫీచర్స్, ప్రయాణికుల రక్షణ కోసం 2-ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్సింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్(TPMS) వంటివి ఉన్నాయి.

మైలేజ్ వేరియంట్‌లను బట్టి 18.8 నుంచి 26.99 kmpl వరకు వస్తుంది. టాటా పంచ్ ఎలక్ట్రిక్ వేరియంట్ సైతం అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ..9.99 లక్షల నుంచి ఉంటుంది. అదే టాప్ వేరియంట్ ధర రూ.14.29 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ మరింత పెరుగుతుంది. ఇది 25 కిలోవాట్ (kWh), 35 కిలోవాట్ (kWh)కెపాసిటీతో కూడిన బ్యాటరీ ఆప్షన్లను కలిగి ఉంది.

Tata Punch Suv Design

టాటా పంచ్ ఎలక్ట్రిక్ వేరియంట్‌లో 5 మంది కలిసి ప్రయాణించవచ్చు. దీనిలోని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే 265 నుండి 365 కి.మీల రేంజ్ వరకు ప్రయాణిస్తుంది. ఇది ప్రయాణీకుల రక్షణ కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 10.25-అంగుళాల డ్యూయల్ స్క్రీన్ సెటప్‌ వంటివి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, January 24, 2025, 14:37 [IST]
English summary
Tata punch suv registered 5 lakh units production milestone details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+