పడిపోయిన టాటా పంచ్ అమ్మకాలు.. కానీ కొత్త మోడల్ తో మార్కెట్ కొల్లగొట్టడం ఖాయం.. టాటా ప్లాన్ మామూలుగా లేదు

టెక్నాలజీ ఎలాగైతే ఎప్పటికప్పుడు కొత్త మార్పులతో దూసుకుపోతుందో కార్ల మార్కెట్ కూడా అంతే. కొన్నిసార్లు టాప్‌లో ఉన్న కార్లు కిందకు పడిపోవడం, కొత్త కార్లు వచ్చి మార్కెట్‌ను ఏలడం చూస్తుంటాం. ప్రస్తుతం టాటా పంచ్ సేల్స్ విషయంలో కాస్త కొంచెం వెనుకబడింది.

కానీ, 'పులి ఒక అడుగు వెనక్కి వేసిందంటే పంజా విసరడానికే అన్నట్లు టాటా పంచ్ మళ్లీ దూసుకుపోవడానికి సిద్ధమవుతోంది. అసలు టాటా పంజ్ సేల్స్ ఎందుకు తగ్గాయి? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? హ్యుందాయ్ ఎక్స్‌టర్‌కి టాటా ఎలా చెక్ పెట్టబోతోంది? తెలుసుకుందాం.

Tata Punch

భారత మార్కెట్‌లో ఈ మధ్యకాలంలో టాటా పంచ్ కార్ల సేల్స్ కొంచెం స్లో అయ్యాయి. ఈ సిరీస్‌లో ఈ 2025 మే నెలలో కూడా టాటా పంచ్ సేల్స్‌లో చాలా వెనకబడిపోయింది. తాజాగా వచ్చిన సేల్స్ రిపోర్ట్ ద్వారా ఈ విషయం బయటపడింది.

ఈ 2025 మే నెలలో టాటా కంపెనీ కేవలం 13,133 పంచ్ కార్లను మాత్రమే సేల్ చేయగలిగింది. కానీ, పోయిన 2024 మే నెలలో ఈ నెంబర్ 18,949గా ఉండేది. అంటే, ఇది 31 శాతం తగ్గిపోయినట్లు లెక్క. దీంతో, బాగా సేల్ అయిన టాప్ 10 SUVల లిస్టులో టాటా పంచ్ వెనుకబడింది.

Tata Punch

ఈ లిస్టులో టాటా పంచ్ కారుకు 5వ ప్లేస్ మాత్రమే దక్కింది. ఈ లిస్టులో మొదటి 4 ప్లేసుల్లో వరుసగా మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో, మారుతి సుజుకి ఫ్రాంక్స్ SUV కార్లు ఉన్నాయి. ప్రస్తుతం టాటా పంచ్ కారు సేల్స్ పెద్దగా తగ్గినప్పటికీ, త్వరలోనే వృద్ధితోకి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అప్‌డేట్ చేసిన పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ మార్కెట్‌లోకి రాబోతుండటమే దీనికి కారణం.

సాధారణంగా, ఒక కారుకు కొత్త మోడల్ మార్కెట్‌లోకి వస్తుందంటే పాత మోడల్ సేల్స్ తగ్గుతాయి. పాత మోడల్‌ను కొనడం కంటే, కొత్త మోడల్‌ను కొనడానికి కస్టమర్లు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. టాటా పంచ్ కారు సేల్స్ తగ్గడానికి ఇది చాలా ముఖ్యమైన కారణాలలో ఒకటి అని భావిస్తున్నారు. కొత్త మోడల్ వచ్చాక దాని సేల్స్ మళ్లీ పెరుగుతాయని ఛాన్సెస్ ఉన్నాయి. భారత కస్టమర్లలో చాలా పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ పెంచిన 2025 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఇంకొన్ని నెలల్లో మార్కెట్‌లోకి లాంచ్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

Tata Punch

భారత మార్కెట్‌లో ప్రస్తుతానికి టాటా పంచ్ ఐసీ ఇంజిన్ వెర్షన్ బేస్ ప్రైస్ రూ.6.20 లక్షలు, ఎలక్ట్రిక్ వెర్షన్ బేస్ ప్రైస్ రూ.9.99 లక్షలుగా ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ప్రైస్‌లు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: భారత మార్కెట్‌లో హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ కారుకు, టాటా పంజ్ ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్‌గా ఉంది. ఈ సిట్యుయేషన్‌లో 2025 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ రాక, హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారుకు మరింత ప్రెషర్ క్రియేట్ చేయొచ్చని భావిస్తున్నారు.

Tata Punch

2025 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ టెస్ట్ డ్రైవ్‌లు ప్రస్తుతం భారత రోడ్లపై చాలా యాక్టివ్‌గా జరుగుతున్నాయి. కాబట్టి, నెక్స్ట్ కొన్ని నెలల్లో ఈ కొత్త కారును షోరూమ్స్‌లో సేల్ కోసం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బహుశా దీపావళి ఫెస్టివల్ టైమ్ కన్నా ముందే ఈ కొత్త మోడల్ మార్కెట్‌లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, June 7, 2025, 11:27 [IST]
English summary
Tata punch to challenge hyundai exter new model to intensify competition
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+