రెండింటికీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. ఇంతకీ టాటా పంచ్.. టాటా నెక్సాన్ మోడల్స్ లో ఏది కొనడం బెస్ట్ ?

టాటా కార్లకు భారత దేశంలో ఎలాంటి పేరుందో అందరికీ తెలిసిందే. విశ్వసనీయతకు మారు పేరుగా ఉన్న ఆ కంపెనీ కార్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవల కాలంలో టాటా కార్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. తక్కువ ధరలు, అత్యధిక సేఫ్టీ రేటింగ్‌లు కలిగిన కార్లను ఉత్పత్తి చేయడం వల్ల కంపెనీకి మార్కెట్లో మంచి పేరు వచ్చింది. ఈ కంపెనీ కార్లలో టాప్ ప్లేసులో నిలిచే కార్లు టాటా నెక్సాన్, టాటా పంచ్.

టాటా నెక్సాన్ వినియోగదారుల బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. అలాగే తక్కువ బడ్జెట్ ఉన్న ఉన్న వాళ్లకు టాటా పంచ్ ప్రత్యామ్నాయంగా ఉండనే ఉంది. అయితే రెండూ కార్లు 5స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాయి. అయితే రెండు కార్ల ధరల్లో మాత్రం వ్యత్యాసం కనిపిస్తుంది. దీంతో రెండింటిలో ఏ కారు కొనుగోలు చేయడం బెస్ట్ అన్న సందేహం చాలా మందిలో ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.

Tata Punch

టాటా పంచ్ ఒక మైక్రో SUV.. ఇది విశాలమైన క్యాబిన్, అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగి ఉంది. సేఫ్టీ విషయంలో రాజీ పడకుండా ప్రీమియం ఫీచర్లతో కూడిన కారు కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆఫ్షన్. టాటా పంచ్ కారు కొనుగోలు చేయాలని అనుకున్న వాళ్లకు అడ్వెంచర్ రిథమ్‌ రూ. 7.52 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు లభిస్తుంది.

కంప్లీట్ ఫీచర్లతో ఉండే టాప్ నెక్సాన్ ప్యూర్ ప్లస్ ఎస్ మోడల్ రూ.10 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. రెండు వాహనాలు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి. సేఫ్టీకి ప్రిపరెన్స్ ఇచ్చిన కారణంగా డ్రైవర్లకు బెస్ట్ ఆఫ్షన్ గా నిలుస్తోంది. టాటా పంచ్ 38 వేర్వేరు ఎడిషన్లలో లభిస్తుంది. దీని బేస్ మోడల్ పేరు ప్యూర్. టాప్ ఎడిషన్ టాటా పంచ్ క్రియేటివ్ ప్లస్ ఎస్ కామో ఏఎంటీ.

Tata Punch Tata Nexon

తక్కువ ధర కారణంగా దీనికి 6 ఎయిర్‌బ్యాగ్‌లు లేవు. కానీ ఫ్రంట్ కూర్చున్న వాళ్ల కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, అనేక ఎలక్ట్రానిక్ అసిస్ట్‌లను కంపెనీ అందిస్తోంది. పంచ్ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ వైపర్, వాషర్, రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ డీ ఫాగర్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి కీలకమైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

హ్యాచ్‌బ్యాక్ ధరకే ఎస్యూవీ ఫెసిలిటీ, స్పేస్ కోరుకునే వాళ్లకు టాటా పంచ్ ఒక బెస్ట్ ఆఫ్షన్ అవుతుంది. ఇది ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే SUV లాంటి ఎక్స్ పీరియన్స్ అందజేస్తుంది. ఈ కారు బాగా అమ్ముడుపోవడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్. టాటా పంచ్ కొనుగోలు చేయడం ద్వారా రూ.2 నుండి 3 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

Tata Punch Latest

టాటా పంచ్ ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్ రూ. 6.82 లక్షలు కాగా, నెక్సాన్ ధర ఎక్స్-షోరూమ్ రూ. 8 లక్షలు. మొత్తం మీద కస్టమర్ నెక్సాన్‌ను సెలక్ట్ చేసుకున్నా..టాటా పంచ్ సెలక్ట్ చేసుకున్నా రెండు వాహనాలు టాటా మోటార్స్ నుండి మంచి సేఫ్టీ ఫీచర్లతో ది బెస్ట్ అని మార్కెట్లో ఇప్పటికే నిరూపించుకున్నాయి. కాబట్టి బడ్జెట్ ప్రకారం ఈ రెండు కార్లలో దేనినైనా కొనుగోలు చేయవచ్చు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, March 13, 2025, 13:10 [IST]
English summary
Tata punch vs tata nexon which 5 star safety rated suv is the best choice for you
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+