ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లొచ్చే టాటా కారు టెస్ట్ డ్రైవ్‎లో కెమెరాకు చిక్కిందోచ్

టాటా మోటార్స్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కొన్ని దశాబ్ధాలుగా నాణ్యమైన వాహనాలను ఉత్పిత్తి చేస్తూ విశ్వసనీయతకు పెట్టింది పేరుగా నిలిచింది. ఈ కంపెనీ కారు కొనుగోలు చేస్తే సేఫ్టీ గ్యారంటీ అన్న పేరు ముద్ర పడిపోయింది. అందుకే కస్టమర్లు కారు కొనుగోలు చేయాలనుకుంటే వారి బెస్ట్ ఛాయిస్ ఈ కంపెనీదే అవుతుంది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఎప్పటికప్పుడు నయా కార్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది టాటా కంపెనీ.

టాటా మోటార్స్ నుండి విడుదల కానున్న తదుపరి అత్యంత వెయిటింగ్ కారు సియెర్రా. టాటా సియెర్రా 25 సంవత్సరాల క్రితం 2000లలో మొదటిసారి అమ్ము డైన కారురు. ప్రస్తుత ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా ఉండే కొత్త లుక్‌తో టాటా దీనిని పరిచయం చేయబోతోంది. టాటా మోటార్స్ సియెర్రా రూపానికి పేటెంట్ పొందిందని మా డ్రైవ్ స్పార్క్ వెబ్ సైట్లో చూశాము.

tata sierra

కాకాపోతే టాటా మోటార్స్ తన సియెర్రాను కొత్త ఈవీ మోడల్ లో తిరిగి తీసుకురాబోతుంది. టాటా ఈవీ ఉత్పత్తి మోడల్ ను ఈ జనవరి భారత్ మొబిలిటీ ఎక్స్ పోలో ప్రదర్శించనున్నారు. ఎలక్ట్రిక్, ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) ఆఫ్షన్లతో 2025నాటికి దేశీయంగా అందుబాటులోకి రాబోతుంది. ఈ క్రమంలో టాటా సియెర్రా కార్లను నిరంతరం టెస్ట్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నారు. గత ఫిబ్రవరిలో కూడా సియెర్రాను రోడ్డు మీద నడుపుతున్న దృశ్యాలు కనిపించాయి.

Take a Poll

తాజాగా సియెర్రాను మళ్లీ పూర్తిగా కవర్లతో కప్పి పబ్లిక్ లో టెస్టింగ్ నిర్వహించారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెట్రోల్/డీజిల్ ఇంజన్ ఎంపికలతో పాటు, భవిష్యత్తులో సియెర్రాను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేయాలని టాటా యోచిస్తోంది. దీని అర్థం రాబోయే సంవత్సరాల్లో సియెర్రా EV ఎలక్ట్రిక్ కారు కూడా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుంది.

tata sierra electric vehicle Price

సియెర్రా ఫ్యూయల్ ఇంజిన్ వెర్షన్ ప్రస్తుతం పబ్లిక్ రోడ్ల మీద టెస్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగిన మునుపటి టెస్ట్ డ్రైవ్ లాగానే, ఈ టెస్ట్ డ్రైవ్ సమయంలో సియెర్రా పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. కవర్ల మధ్యలో కారు బాక్సీ రూపాన్ని చూడవచ్చు. అలాగే, మునుపటి టెస్ట్ డ్రైవ్ లాగానే ఈ టెస్ట్ డ్రైవ్‌లో కూడా సియెర్రా బ్యాక్ విండోలను కంప్లీట్ గా కవర్ చేశారు.

ప్రస్తుత టెస్ట్ డ్రైవ్‌లో, టాటా సియెర్రా పక్కన ఉన్న రోడ్డుపై హ్యుందాయ్ క్రెటా డ్రైవింగ్ చేస్తున్నట్లు చూడవచ్చు. ఇది క్రెటా కంటే సియెర్రా ఎంత పెద్దదిగా ఉందో చూపిస్తుంది. మునుపటి టెస్ట్ డ్రైవ్‌లో సియెర్రాకు స్టీల్ వీల్స్ అమర్చినట్లు కనిపించింది. అయితే ప్రస్తుత సియెర్రాకు టెస్ట్ డ్రైవ్ లో అల్లాయ్ వీల్స్ అమర్చారు. సియెర్రాపై ఏ రకమైన అల్లాయ్ వీల్ డిజైన్‌ను అమర్చాలనే దానిపై టాటా చివరకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు చూడవచ్చు.

tata sierra electric vehicle Expo

కొత్త సియెర్రాలో టాటా పూర్తిగా కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తుంది. ఈ కొత్త టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 168 bhp పవర్, 280 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుత టాటా హారియర్, సఫారీ కార్లకు అమర్చిన అదే 2-లీటర్ డీజిల్ ఇంజన్ ఆఫ్షన్ ను సియెర్రాలో కూడా అందించే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, March 14, 2025, 15:25 [IST]
English summary
Tata s electric car could drive from hyderabad to vijayawada on a single charge seen in test drive
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+