త్వరలో కొత్త అప్‎డేట్‎తో రాబోతున్న టాటా సఫారి.. ఈ సారి సవారీ మామూలుగా ఉండదట

భారతదేశ కార్ల మార్కెట్‌లో టాటా మోటార్స్ వివిధ హ్యాచ్‌బ్యాక్‌లు, ఎస్‌యూవీలను విక్రయిస్తోంది. ఇవి పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల దేశీయంగా కంపెనీ సరికొత్త హారియర్ ఈవీని రిలీజ్ చేసింది. ఇప్పుడు అప్‌డేట్ చేసిన సఫారి ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకురావడానికి లోపల లోపల ఏర్పాట్లు చేసుకుంటోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే, త్వరలోనే కొన్ని మార్పులతో కొత్త టాటా సఫారి ఎస్‌యూవీని పరిచయం చేస్తారు. ఈ కారు ఇప్పటికే రోడ్లపై టెస్టింగ్ చేస్తున్నప్పుడు కనిపించింది. దానికి సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కారు డిజైన్, ఫీచర్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంటున్నారు.

Tata Safari

కొత్త సఫారి ఎస్‌యూవీ స్పై ఫోటోలను జాగ్రత్తగా చూసినప్పుడు అది ఇప్పుడున్న సఫారి లాగే ఉంటుందని అర్థమవుతోంది. ముందు భాగంలో ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. అలాగే, రంగుల విషయంలో కూడా ఇప్పుడున్న రంగులే కొనసాగించవచ్చని అంటున్నారు.

ప్రస్తుతం, టాటా సఫారి ఎస్‌యూవీని పవర్ ఫుల్ 2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో మాత్రమే అమ్ముతున్నారు. దీనితో పాటు అప్‌డేట్ చేసిన కొత్త సఫారి కారును 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో కూడా విడుదల చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే, ఈ విషయం గురించి కంపెనీ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

Tata Safari

రాబోయే కొత్త పెట్రోల్ ఇంజిన్ సఫారి ఎస్‌యూవీలో కూడా 6 లేదా 7 సీట్లు ఉంటాయి. ప్రయాణీకులు హాయిగా కూర్చుని ప్రయాణించవచ్చు. అంతేకాదు, సాధారణ సఫారి లాగే 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 10-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఏసీ వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు

అప్‌డేట్ చేసిన సఫారి కారు సేఫ్టీ ఫీచర్లలో కూడా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని అంటున్నారు. ఇది ఇప్పుడున్న సఫారి లాగే 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, 360 డిగ్రీల కెమెరాను కలిగి ఉంటుంది.

Tata Safari

ప్రస్తుతం, దేశీయ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాటా సఫారి ఎస్‌యూవీ ధర రూ.15.50 లక్షల నుంచి రూ.27.25 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. అదే విధంగా, పెట్రోల్ ఇంజిన్ సఫారి ప్రారంభ ధర రూ.12 లక్షల నుంచి రూ.13 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇటీవల విడుదలైన టాటా హారియర్ ఈవీ ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇది ఒక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. దీని ధర రూ.21.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). 65 kWh, 75 kWh కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 627 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఈ కారులో 5 సీట్లు ఉన్నాయి.

Tata Safari

14.5-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, 10 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.సేఫ్టీ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS, 360 డిగ్రీల కెమెరాను కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: టాటా సఫారి పెట్రోల్ ఇంజిన్‌తో వస్తే, ధర తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది కస్టమర్లకు మంచి ఆప్షన్‌గా మారవచ్చు. టాటా తన ఎస్‌యూవీలను మరింత అప్‌డేట్ చేస్తూ, మార్కెట్లో తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే, కొత్త ఫీచర్లను అందించడం అభినందనీయం.

More from DriveSpark

Article Published On: Friday, June 20, 2025, 17:50 [IST]
English summary
Tata safari facelift coming soon spotted testing will it get a petrol engine
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+