ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన ఇంతమంచి ఫ్యామిలీ కారుకి ఏమైంది? టాటా కంపెనీకి ఎదురుదెబ్బ!
టాటా సఫారీ (tata safari) అనే పేరు చాలాకాలంగా భారతీయ SUV ప్రియుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్, అద్భుతమైన సేఫ్టీ అంశాలతో ఈ కారు మార్కెట్లో ప్రత్యేకమైన స్థానం ఏర్పచుకుంది. కానీ ఇటీవలి కాలంలో అమ్మకాల పరంగా మాత్రం ఈ కారుకు ఎదురుదెబ్బ తగలినట్టు తెలుస్తోంది. మారుతున్న ప్రజల అభిరుచుల కారణంగా రోజు రోజుకు విక్రయాల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. ఏప్రిల్ నెల ముగిసిన నేపథ్యంలో కంపెనీ సఫారీకి సంబంధించిన అమ్మకాల వివరాలను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం, గత ఏప్రిల్ (2025) నెలలో టాటా కంపెనీ సఫారీ మోడల్ కేవలం 1,340 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇదే కాలంలో అంటే 2024 ఏప్రిల్లో ఈ కారుకు 1,716 యూనిట్ల అమ్మకాలు నమోదు కావడం జరిగింది.
ఈ సంవత్సరానికొకసారి పోలిస్తే, అమ్మకాలలో సుమారు 22 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ఇలాంటి తగ్గుదల అనేక కారణాల వల్ల వచ్చి ఉండవచ్చు. కొత్త పోటీదారులు మార్కెట్లోకి ప్రవేశించటం, వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు, అలాగే కొత్త ఫీచర్లతో ఇతర SUVలు లభించడం వంటి అంశాలు దీనికి దోహదపడినట్టు కనిపిస్తోంది. టాటా సఫారీ ఒకప్పుడు మిడిల్ క్లాస్ SUV ప్రియులకు మొదటి ఎంపికగా నిలిచింది. అయితే, ఈ మధ్య మాత్రం నిరాశ ఎదురవుతోంది.

ఈ సంవత్సరం మొదటి మూడు నెలల విక్రయాలను పరిశీలిస్తే, నెలకు సగటున టాటా కేవలం 1,500 యూనిట్ల సఫారీ SUVలను మాత్రమే విక్రయించగలిగింది. ఇది ఒకప్పటి ఉత్సాహంతో పోలిస్తే స్పష్టమైన తగ్గుదల. ఇక, ఏప్రిల్ నెలలో అయితే అమ్మకాలు మరింత పడిపోయాయి. అమ్మకాలు ఎందుకు తగ్గుతున్నాయో టాటా మోటార్స్ స్పష్టంగా ప్రకటించలేదు. కానీ మార్కెట్ విశ్లేషకులు మాత్రం కొన్ని కారణాలను ముందుంచుతున్నారు.
ముఖ్యంగా, అదే ధరలో ఇతర కంపెనీలు తమ కార్లను మరింత ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్లతో అందుబాటులోకి తీసుకురావడం ఒక ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. కస్టమర్ల దృష్టిని ఆకర్షించడంలో అవి ముందంజలో ఉండడంతో, సఫారీ వైపు మొగ్గు చూపే అవచకాశం తగ్గిపోయింది. మరోవైపు, సఫారీ ధర కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. ఇది మధ్యతరగతి వినియోగదారులకు కొంత భారంగా మారుతుంది. అందుకే వారు ఇతర కార్ల వైపు దృష్టి మళ్లించుకుంటున్నారు.

టాటా సఫారీ, ఒక ఫ్యామిలీ SUVగా భారతీయ రోడ్లపై తనదైన ముద్ర వేసుకుంది. ఈ కారు డిజైన్ మొదలుకొని, ఇంటీరియర్, పనితీరు వరకు ప్రతీ అంశంలోనూ ఒక రకమైన ఆకర్షణ కనిపిస్తుంది. దీని ధరలు రూ.15.50 లక్షల నుంచి రూ.27.25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి, ఇది వివిధ వేరియంట్లపై ఆధారపడి ఉంటుంది. సఫారీ మోడల్ స్మార్ట్, స్మార్ట్ (O), అడ్వెంచర్, అకంప్లిష్డ్ ప్లస్ వేరియంట్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది.
ఒక్కో వేరియంట్కి తగినట్లుగా టెక్నాలజీ, కంఫర్ట్, స్టైలింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. టాటా సఫారీ 2-లీటర్ డీజిల్ ఇంజిన్తో వస్తుంది. ఇది 170 PS హార్స్పవర్, 350 Nm పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికల విషయానికి వస్తే, ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో పాటు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్లో కూడా లభ్యమవుతుంది. ఇంకా, ఇది సుమారుగా 16 కిలోమీటర్లకు పైగా లీటర్కు మైలేజీ ఇవ్వగలదని కంపెనీ చెబుతుంది.

కొత్త టాటా సఫారీ SUV 6 లేదా 7 సీట్ల ఆప్షన్లలో కుటుంబాల అవసరాలను తీర్చే విధంగా రూపొందించబడింది. ఇంటీరియర్లో 12.3-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి. అలాగే, 10-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ AC సిస్టమ్ కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








