ఫుల్ ట్యాంక్‌‌తో 2400 కి.మీలు.. టాటా సంచలన ఆవిష్కరణ.. వాణిజ్య వాహనాల్లో దీనికి ఎదురేలేదు

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో తన ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ఈ క్రమంలో కంపెనీ కొత్తగా ఎల్‌ఎన్‌జీ (LNG) శక్తితో నడిచే ట్రక్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ పేరు ప్రైమా జి.55ఎస్‌ (prima G.55s). ఆటోమొబైల్ రంగంలో ఇది కీలక మైలురాయి అని చెప్పవచ్చు. ఎల్‌ఎన్‌జీ శక్తితో కూడిన ఇంజిన్‌ భారత్‌లోకి రాకను ఈ ట్రక్ సూచిస్తుంది. ప్రధానంగా ఇది ఫుల్ ట్యాంక్‌‌తో ఏకంగా 2400 కి.మీ వరకు ప్రయాణించగల కెపాసిటీ కలిగి ఉంటుందని టాటా మోటార్స్ ప్రకటించడం గమనార్హం. ఈ రేంజ్ వరకు ప్రయాణించడం అంటే సాధారణ విషయం కాదు. ప్రస్తుతం మార్కెట్లో సరుకు రవాణాకు ట్రక్కులు చాలా కీలకం.

డీజిల్ ట్రక్కుల వినియోగం బదులు ఎల్‌ఎన్‌జీతో కూడిన ప్రైమా జి.55ఎస్‌ను వాడటం ద్వారా రవాణా ఖర్చులు చాలా తగ్గిపోతాయి. అసలుకే వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో మార్కెట్లో పర్యావరణానికి ఎక్కువ హాని కలిగించకుండా ఉండే వాహనాల అవసరం చాలా వరకు ఉంది. ప్రధానంగా సరుకుల రవాణాకు ట్రక్కులు దేశవ్యాప్తంగా తిరుగుతుంటాయి.

Tata Showcased Lng Truck

ఈ క్రమంలో కొత్త LNG ట్రక్కు రావడం ద్వారా ఈ విభాగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయి. prima G.55sను ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేసినట్లయితే సుదూర ప్రాంతాలకు ఫ్యూయల్ కోసం ఎక్కడా ఆగకుండా ప్రయాణించవచ్చు. ఎక్కువ దూరం సరుకుల చేర్చడానికి ఈ ట్రక్కును మధ్యలో ఆపనవసరం లేదు. ఎల్‌ఎన్‌జీ ట్యాంక్‌ను అందించడం ద్వారా ట్రక్కు పరిధి అదనంగా పెరుగుతుంది.

ట్రక్ డిజైన్ సరుకు రవాణాకు అనుకూలంగా ఉంది. దీనిలో ఏరోడైనమిక్స్‌ను కూడా కంపెనీ అందించింది. దీని ద్వారా గాలి ప్రభావాన్ని చాలా వరకు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో గాలి నిరోధకత తగ్గడంతో ట్రక్కు వేగం మరింత ఎక్కువగా పెరుగుతుంది. దీని తయారీలో ఉపయోగించిన తేలిక పాటి పదార్థాల ద్వారా ట్రక్కు అటూ ఇటూ సులువుగా కదులుతుంది. ట్రక్ ట్రాన్స్‌మిషన్ , డ్రైవ్‌ట్రెయిన్, యాక్సిల్‌లు సాఫిగా ఉంటాయి.

Tata Showcased Lng Prima G55s Truck

LNG ట్రక్కులో అధునాతన ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇది సాంప్రదాయ డీజిల్ ట్రక్కులకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. లాజిస్టిక్స్ రంగం కొత్త మార్పులకు టాటా మోటార్స్ ముందడుగు వేసినట్లయింది. రాబోయే సంవత్సరాల్లో సరుకుల రవాణాకు దూర ప్రాంతాలకు వెళ్లడానికి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపుతుంది. టాటా మోటార్స్ ప్రైమా G.55S పచ్చని భవిష్యత్తుకు మార్గం సుగమం చేయబోతుంది. దేశీయ వాణిజ్య వాహనాల విభాగంలో ఇది సరికొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

టాటా మోటార్స్ పర్యావరణ అనుకూలమైన వాహనాలను అందించడానికి చాలా కాలంగా కృషి చేస్తుంది. సరుకుల రవాణాకు ట్రక్కులు చాలా అవసరం. దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి మొదలుపెడితే చివరి మూల వరకు కూడా ట్రక్కులు ప్రయాణిస్తుంటాయి. డీజిల్ ట్రక్కుల ద్వారా వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. దీంతో ఈ సమస్య పరిష్కారానికి టాటా LNG ట్రక్కు అతి ముఖ్యమైనది. రానున్న రోజుల్లో ఇలాంటి వాహనాలు మార్కెట్లోకి మరిన్ని విడుదలయ్యే అవకాశం ఉంది.

Tata Lng Prima G55s Truck

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం మా డ్రైవ్‌స్పార్క్‌ సోషల్‌ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.

More from DriveSpark

Article Published On: Saturday, January 18, 2025, 20:55 [IST]
English summary
Tata showcased lng prima g55s truck in bharat mobility global expo 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+