టాటా సియెర్రా 2025 డిజైన్ లీక్.. మార్కెట్‌ను దున్నేయడం ఖాయమంటున్న విశ్లేషకులు
దిగ్గజ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత మార్కెట్లో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. బాడీ బిల్డ్ క్వాలిటీ ఇవ్వడంలో టాటాకు మించింది లేదు. అందుకే వినియోగదారులు చాలా మంది టాటా కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. అలాంటి టాటా మోటార్స్ ఈ ఏడాది భారత మార్కట్లోకి అనేక కొత్త కార్లు, ఎస్ యూవీలను తీసుకొచ్చేందుకు రెడీ అవుతుంది.
జనవరిలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో కంపెనీ కొన్ని మోడల్స్ ను పరిచయం చేసింది. వాటిలో ప్రొడక్షన్ స్పెక్ హారియర్ ఈవీ అదే విధంగా పెట్రోల్‌తో నడిచే సియెర్రా ఎస్‌యూవీ ప్రీ-ప్రొడక్షన్ వెర్షన్‌ను కూడా ఇదే ఈవెంట్లో ప్రదర్శించింది. ఈ కార్లు ఇప్పటికే చాలా సార్లు రోడ్ల మీద టెస్టింగ్ సమయంలో కనిపించాయి. 90ల్లో భారతీయ కస్టమర్లను ఎంతో ఆకట్టుకున్న సియోర్రాను తీసుకుని వస్తున్నట్లు ప్రకటించింది.

టాటా మోటార్స్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్(ICE)తో ఉండే సియెర్రా ఎస్‌యూవీని ఈ ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. నోస్టాలిజిక్ డిజైన్‌ని గుర్తు చేస్తూ అధునాతన డిజైన్‌ను మేళవించి, ఈ ఎస్‌యూవీని అప్పుడు ప్రదర్శించింది. ఈ ఎస్‌యూవీ ప్రొడక్షన్ స్పెక్ డిజైన్ పేటెంట్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. లీకైన ఫోటోలు టాటా సియెర్రా బోల్డ్ బాక్సీ డిజైన్, ఆధునిక LED లైటింగ్, పవర్ ఫుల్ ఆఫ్ రోడ్ ఫ్యాషన్ ను కలిగి ఉంటుందని వెల్లడిస్తున్నాయి.
టాటా సియెర్రా బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది స్ట్రాంగ్, లాంగ్ ఫ్రంట్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ SUV ఫ్రంట్ డిజైన్ లో వెడల్పాటి LED లైట్ స్ట్రిప్ ఉంది. ఇది వెహికల్ మొత్తం వెడల్పును కవర్ చేస్తుంది. అంతేకాకుండా, పియానో బ్లాక్ ఎలిమెంట్స్, పాలిగాన్ హెడ్‌ల్యాంప్ డిజైన్ ఈ మోడల్ ను మరింత ఎట్రాక్టివ్ గా చేస్తుంది. ఈ SUVసైడ్ ప్రొఫైల్‌లో పెద్ద వీల్ ఆర్చ్‌లు కనిపిస్తున్నాయి.

ఇది దాని ఆఫ్ రోడింగ్ లుక్‌ను మరింత స్ట్రాంగ్ గా చేస్తుంది. కొత్త అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అందించారు. స్ట్రెయిట్ బెల్ట్‌లైన్ డిజైన్ దాని బాక్సీ ఆకర్షణను పెంచుతుంది. వెనుక ప్రొఫైల్ పాత సియెర్రాను గుర్తుకు తెస్తుంది. సియెర్రా క్యాబిన్ లేటెస్ట్ టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో రాబోతుందని తెలుస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రావచ్చని సమాచారం.
సేఫ్టీ పరంగా చూస్తే.. దీనికి 360డిగ్రీ కెమెరా, లెవల్ 2 ADAS, ఎయిర్‌బ్యాగ్‌లు, ఇతరత్రా సేఫ్టీ ఫీచర్లు అందించారు. ఇది రెండు ఇంజిన్ ఆఫ్షన్లతో వస్తుంది. దీని ICE వెర్షన్ కంపెనీ కొత్త 1.5-లీటర్ హైపెరియన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రావొచ్చు. టాటా హారియర్ నుంచి తీసుకున్న 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆఫ్షన్ ఉంటుంది. ట్రాన్స్మిషన్ కోసం 6స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆఫ్షన్ఉం టుంది.

ప్రస్తుతం లీకైన పేటెంట్ డిజైన్ నుంచి టాటా సియెర్రా 2025 ప్రొడక్షన్ స్పెక్ మోడల్ ఎక్కువగా ఈ డిజైన్ మీదే ఆధారపడి ఉంటుందని స్పస్టం అవుతుంది. అయితే, ఆటో కంపెనీలు ఫైనల్ ప్రొడక్ట్ శాంపిల్ ప్రవేశపెట్టే ముందు పేటెంట్ పొందిన డిజైన్‌లో తరచుగా కొన్ని మార్పులు చేస్తాయి. టాటా మోటార్స్ గతంలో 2023 ఆటో ఎక్స్‌పోలో ఈ SUVని కాన్సెప్ట్‌గా ప్రదర్శించింది.
ఇప్పుడు దాని పేటెంట్ పొందిన డిజైన్ దానికి దగ్గరగా సరిపోతుంది. బంపర్ డిజైన్, లైటింగ్ ఎలిమెంట్స్, అల్లాయ్ వీల్స్ కారణంగా భారీగా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఉండనుంది. టాటా సియెర్రా లాంచ్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇది 2025 చివరి నాటికి భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








