టాటా నుంచి బ్రహ్మాస్త్రం వస్తోంది.. ప్రత్యర్థులను భయపెట్టే మోడల్! లుక్ చూసి అందరు ఫిదా
టాటా మోటార్స్ (Tata Motors) తమ లెజెండరీ SUVను మళ్లీ భారతీయ రోడ్లపైకి తీసుకురావడానికి సిద్ధమైంది. 1990లలో మార్కెట్‌లో అడుగుపెట్టిన మొదటి టాటా సియెర్రా అప్పటి తరానికే కాకుండా, ఇప్పటికీ గుర్తున్న ఐకానిక్ మోడళ్లలో ఒకటి. బలమైన బాడీ, వెనుక భాగంలో ఉన్న ప్రత్యేకమైన గ్లాస్ డిజైన్, అద్భుతమైన రోడ్ ప్రెజెన్స్... ఇవన్నీ కలిపి సియెర్రాను ఆ కాలంలో ఓ ప్రత్యేకమైన SUVగా నిలబెట్టాయి. ఇప్పుడు అదే మోడల్‌ను ఆధునిక కాలానికి అనుగుణంగా, పూర్తిగా కొత్త రూపంలో పునర్నిర్మించి టాటా మరోసారి ఆటోమొబైల్ ప్రపంచాన్ని ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. రేట్రో స్టైల్‌కు మోడర్న్ టచ్ ఇచ్చి రూపొందించిన ఈ కొత్త సియెర్రా, టాటా BSUV లైనప్‌లో ఒక ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.
బయటకి డిజైన్ చూసిన వెంటనే ఇది పాత సియెర్రానే! అనిపించేలా క్లాసిక్ ఎలిమెంట్స్‌తో ప్రస్తుత తరానికి కావాల్సిన సూపర్ ప్రీమియం లుక్‌ను కూడా ఇవ్వడం టాటా మోటార్స్ ప్రత్యేకత. కొత్త టాటా సియెర్రా ఆవిష్కరణ తేదీ కూడా ఇప్పటికే ఖరారైంది. నవంబర్ 15న ఈ SUV అధికారికంగా అన్‌వీల్ అవుతుండగా, నవంబర్ 25న మార్కెట్‌లో అధికారికంగా విడుదల కాబోతోంది. పాత దానితో పోలిప్తే కొత్త దానిలో అదిరిపోయే ఫీచర్లు ఉండబోతున్నాయి.

టాటా మోటార్స్ సియెర్రాను కేవలం డిజైన్ పరంగానే కాదు, ఇంజనీరింగ్ పరంగానూ పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లింది. అవసరాలను దృష్టిలో ఉంచుకుని బహుళ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను అందించడం ఈ మోడల్‌కి ప్రత్యేకతను తెచ్చింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్.. మూడు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో లభించటం భారతీయ SUV మార్కెట్లో అరుదైన విషయం. సియెర్రా పెట్రోల్ వెర్షన్‌లో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 170 PS శక్తిని, 280 Nm టార్క్‌ను అందిస్తుంది.
ఇది ప్రతి రేంజ్‌లోనూ శక్తివంతమైన పెర్ఫార్మెన్స్‌ను కోరుకునే వినియోగదారులకి పర్ఫెక్ట్ ఆప్షన్. హైవేలపై వేగంగా స్పందించడమేమో, నగరంలో నడపడమేమో, ఈ ఇంజన్ అందులోనూ సమతూకమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. డీజిల్ ఇంజన్ కోసం టాటా మోటార్స్ తమ ప్రసిద్ధ 2.0-లీటర్ క్రయోటెక్ డీజిల్ యూనిట్‌ను అందిస్తోంది. ఇది 170 bhp పవర్, 350 Nm భారీ టార్క్‌ను అందిస్తుంది. ఎడారి రోడ్లైనా, గట్టిగా ఎక్కాల్సిన ఘాట్ సెక్షన్‌లైనా ఇది బెస్ట్.

పెట్రోల్, డీజిల్ రెండింటికీ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు లభించడం కూడా వినియోగదారుల ఎంపికను మరింత విస్తరిస్తుంది. చివరగా, అత్యంత ఆసక్తికరంగా సియెర్రా EV. టాటా Acti.EV ఆర్కిటెక్చర్‌పై నిర్మించబడిన ఈ వెర్షన్, హారియర్ EV తరహాలోనే డ్యూయల్-మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ సామర్థ్యంతో వస్తోంది. ఇది సియెర్రాను కేవలం ఫ్యూచరిస్టిక్ SUVగా కాకుండా, మార్కెట్లో ప్రత్యేకమైన స్థాయిలో నిలబెట్టే పవర్‌ట్రెయిన్.
దీని ఈవీ వేరియంటలో రెండు వేర్వేరు బ్యాటరీ ఆప్షన్‌లు 65 kWh, 75 kWh అందించబడతాయి. 65 kWh బ్యాటరీ సుమారు 450 కి.మీ, 75 kWh బ్యాటరీ దాదాపు 600 కి.మీ రేంజ్ అందిస్తుందని అంచనా. ఈ రేంజ్ డ్రైవింగ్ ప్యాటర్న్‌లను దృష్టిలో ఉంచుకుని చూస్తే చాలా ప్రభావవంతమైనవి. EV మార్కెట్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని, టాటా ఈ వ్యూహంతో సియెర్రాను ప్రత్యేక స్థానంలో నిలపబోతుంది.

మొత్తం మీద, పాత సియెర్రాకు ఉన్న లెజెండరీ ఛార్మ్‌ను కోల్పోకుండా, నేటి SUV మార్కెట్‌కు కావలసిన టెక్నాలజీ, పనితీరు, ప్రీమియమ్ ఫీచర్లు అన్నీ కలగలిపిన అనుభూతిని కొత్త సియెర్రా ఇవ్వబోతోంది. ధర విషయానికి వస్తే, ఇది రూ.17 లక్షల నుండి రూ.25 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








