మారుతి ఒంట్లో వణుకు మొదలైంది..22ఏళ్ల తర్వాత దానిని ఢీకొట్టే మొనగాడు వచ్చేశాడు
భారతీయ కార్ల మార్కెట్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన టాటా సియెర్రా (Tata Sierra) తిరిగి రాబోతోంది. 1991 నుంచి 2003 వరకు అమ్ముడుపోయిన ఈ మోడల్ 22 ఏళ్ల విరామం తర్వాత పూర్తిగా కొత్త రూపురేఖలతో, ఆధునిక ఫీచర్లతో రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. కొత్త తరం టాటా సియెర్రా కోసం కస్టమర్లలో భారీ అంచనాలు ఉన్నాయి.
టాటా మోటార్స్ (Tata Motors) ఇప్పటికే దీని టీజర్‌లను విడుదల చేయడంతో పాటు, తాజాగా ఈ కారును ప్రజల దృష్టికి కూడా తీసుకొచ్చింది. అతి త్వరలో లాంచ్ కానున్న ఈ కారు... మార్కెట్‌లో మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వబోతోందని నిపుణులు అంటున్నారు.

కొత్త తరం టాటా సియెర్రా కారులో టాటా మోటార్స్ చాలా అడ్వాన్సుడ్ ఫీచర్లను జోడించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డాష్‌బోర్డ్ విషయంలో ఇది ఒక రికార్డు సృష్టించబోతోంది. సాధారణంగా కార్లలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కలిపి రెండు స్క్రీన్లు మాత్రమే ఉంటాయి. కానీ కొత్త సియెర్రాలో వీటితో పాటు ముందు కూర్చునే ప్యాసింజర్ కోసం కూడా ఒక స్క్రీన్‌ను అందిస్తున్నారు. టాటా కార్లలో ఇలా మూడు స్క్రీన్లు రావడం ఇదే మొదటిసారి.
అంతేకాకుండా, ఇందులో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ కూడా కన్ఫర్మ్ అయ్యింది. లెవెల్ 2 అడాస్ (ADAS - Advanced Driver Assistance Systems) సేఫ్టీ ఫీచర్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, ప్రీమియం సౌండ్ సిస్టమ్, డ్యూయల్ టోన్ సీట్ అప్‌హోల్‌స్ట్రీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.

పర్ఫామెన్స్ విషయానికి వస్తే కొత్త తరం టాటా సియెర్రాలో ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. మొదటగా ఐసీ ఇంజిన్ (IC Engine) వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఈ కారు ఎలక్ట్రిక్ వెర్షన్ (EV) ను కూడా లాంచ్ చేస్తారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. టాటా సియెర్రా ఐసీ ఇంజిన్ వెర్షన్ ప్రారంభ ధర కేవలం రూ. 10 లక్షల నుంచి 11 లక్షల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. అయితే, అసలు ధర నవంబర్ 25న అధికారికంగా కారు విడుదల రోజునే తెలుస్తుంది.

కొత్త తరం టాటా సియెర్రా కారును నవంబర్ 25న అధికారికంగా విడుదల చేయనున్నారు. అయితే, విడుదల తేదీకి మరికొన్ని రోజులే సమయం ఉండగా, ఇప్పటికే దేశంలోని కొన్ని టాటా డీలర్‌షిప్‌లు అనధికారికంగా (Unofficial) బుకింగ్‌లు తీసుకోవడం మొదలుపెట్టాయి. ఆసక్తి ఉన్న కస్టమర్‌లు రూ. 11,000 అడ్వాన్స్ పేమెంట్ కట్టి కొత్త సియెర్రాను బుక్ చేసుకోవచ్చని సమాచారం.
ఈ కారు రాకతో మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara), హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్ (Kia Seltos), మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) వంటి కార్లకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications








