టాటా సియోరా సంచలనం.. లీటరుకు 29.9 కి.మీ మైలేజ్..ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‎లో స్థానం

టాటా మోటార్స్ ఇటీవల భారతీయ మార్కెట్‌లో విడుదల చేసిన సియెరా ఎస్‌యూవీ ఇప్పటికే పెద్ద సంచలనం సృష్టిస్తోంది. అసలైన సియెరా లక్షణాలను నిలుపుకుంటూ, కొత్త కాలానికి అనుగుణంగా హైటెక్ ఎస్‌యూవీగా వచ్చిన ఈ కారు, తొలి ప్రయాణంలోనే ఒక చారిత్రక ఘనతను సాధించింది.

భారతీయ ఆటోమోటివ్ రంగంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఈ ఘనత సియెరాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేర్చింది. 12 గంటల పాటు జరిగిన కంట్రోల్డ్ ఎండ్యూరెన్స్ రన్‌లో లీటరుకు 29.9 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజ్‌ను సాధించడం ద్వారా సియెరా మునుపటి రికార్డులన్నింటినీ అధిగమించింది.

Tata Sierra Enters India Book of Records with 29 9 Kmpl Mileage Feat at NATRAX

సియెరా ఈ రికార్డును NATRAX (National Automotive Test Tracks), ఇండోర్ వద్ద సాధించింది. నవంబర్ 30, 2025 న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగిన ఈ ఎండ్యూరెన్స్ రన్‌ను పిక్సెల్ మోషన్ టీమ్ పూర్తి చేసింది. డ్రైవర్లను మార్చడానికి మాత్రమే చిన్న విరామాలు తీసుకున్నారు.

మైలేజీని గరిష్టంగా పెంచడానికి, టెస్ట్ సమయంలో సగటున 65-70 కిలోమీటర్ల స్థిరమైన వేగాన్ని కొనసాగించారు. ఇంజిన్‌ను అత్యంత సమర్థవంతమైన ఆర్‌పీఎం పరిధిలో పనిచేయడానికి ఈ స్థిరమైన వేగం సహాయపడుతుంది. దీని ఫలితంగా సాధారణ రోడ్డు పరిస్థితుల కంటే మైలేజ్ గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ మైలేజ్ టెస్ట్ కోసం టాటా సియెరా 12 గంటల్లో సుమారు 800 కిలోమీటర్లు ప్రయాణించింది.

Tata Sierra Enters India Book of Records with 29 9 Kmpl Mileage Feat at NATRAX

ఈ రికార్డు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించింది టాటా సియెరా 1.5 లీటర్ హైపీరియన్ పెట్రోల్ ఇంజిన్. ఈ అసాధారణ మైలేజ్ రికార్డు వెనుక ఉన్న అసలు హీరో టాటా సియెర్రా 1.5 లీటర్ హైపీరియన్ పెట్రోల్ ఇంజన్. ఈ అత్యాధునిక ఇంజన్ టెక్నాలజీ కేవలం ఇంధన సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా, సున్నితమైన డ్రైవింగ్ అనుభవాన్ని, శక్తిని కూడా అందిస్తుంది.

హైపీరియన్ ఇంజన్ ముఖ్య లక్షణాల విషయానికి వస్తే.. అడ్వాన్స్‌డ్ కంబషన్ సిస్టమ్, టార్క్-రిచ్ పెర్ఫార్మెన్స్ బ్యాండ్, లో ఫ్రిక్షన్ ఆర్కిటెక్చర్. ఈ టెక్నికల్ అంశాలు 12 గంటల పాటు నిరంతరంగా నడిపినా కూడా ఇంజన్ స్థిరమైన, సమర్థవంతమైన పనితీరును కొనసాగించడానికి సహాయపడ్డాయి.

Tata Sierra Enters India Book of Records with 29 9 Kmpl Mileage Feat at NATRAX

ఈ రికార్డుపై స్పందించిన టాటా మోటార్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ మోహన్ సావర్కర్.. హైపీరియన్ ఇంజన్ పెట్రోల్ పవర్‌ట్రైన్ల సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో రూపొందించబడిందని, ఈ రికార్డు దానికి నిదర్శనమని తెలిపారు.

ఇదే NATRAX ట్రాక్‌పై సియెర్రా మరో అద్భుత ప్రదర్శనలో గంటకు 222 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌ను కూడా నమోదు చేసింది. ఈ రెండు రికార్డులు (మైలేజ్, టాప్ స్పీడ్) హైపీరియన్ ఇంజన్ సామర్థ్యాన్ని, పవర్ ను ఒకేసారి రుజువు చేశాయి.

సియెర్రాను మొత్తం 7 వేరియంట్లలో విడుదల చేశారు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.49 లక్షలు. ఈ కారులో కనెక్టెడ్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల సీట్లు, మల్టీ డ్రైవర్-అసిస్ట్ సిస్టమ్స్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

ఈ కారు బుకింగ్‌లు డిసెంబర్ 16 నుంచి ప్రారంభమై, డెలివరీలు 2026 జనవరి మధ్యలో మొదలవుతాయి. అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్ అనే రెండు టాప్ వేరియంట్ల ధరలు మాత్రమే ఇంకా ప్రకటించాల్సి ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 11, 2025, 13:38 [IST]
English summary
Tata sierra enters india book of records with 29 9 kmpl mileage feat at natrax
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+