Tata Sierra Launch : లెజెండ్ ఈజ్ బ్యాక్..కారు మార్కెట్లో తుఫాన్ హెచ్చరిక మొదలైంది

Tata Sierra Launched : ఎంతో మంది కార్ లవర్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. టాటా మోటార్స్ కంపెనీ నుంచి ఐకానిక్ ఎస్‌యూవీ అయిన టాటా సియెర్రా సరికొత్త రూపంలో మళ్లీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). పాత సియెర్రా డిజైన్‌ను గుర్తు చేస్తూ, అడ్వాన్సుడ్ టెక్నాలజీతో ఈ కారును రూపొందించారు. దీని అధికారిక బుకింగ్స్ డిసెంబర్ 16, 2025 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు జనవరి 15, 2026 నుంచి మొదలవుతాయి.

డిజైన్, ఇంజిన్ ఆప్షన్లు
కొత్త సియెర్రా డిజైన్ పాత మోడల్‌ను గుర్తుకు తెచ్చేలా బాక్సీ షేప్ ఉంటుంది. అయితే, మోడ్రన్ ఎలిమెంట్స్‎లో భాగంగా ఫ్లాట్ ఆల్పైన్-స్టైల్ గ్లాస్ రూఫ్, ఫుల్-ఎల్‌ఈడీ లైటింగ్, కొత్త ఫ్రంట్ గ్రిల్, పెద్ద 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో మొత్తం మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (GDi) ఇంజిన్ 158 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంటుంది.

Tata Sierra Launched Iconic SUV Returns with Price Starting at Rs 11 49 Lakh

1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 105 bhp పవర్ అందిస్తుంది. దీనికి మ్యాన్యువల్ లేదా డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 116 bhp పవర్ అందిస్తుంది. దీనికి కూడా మ్యాన్యువల్, డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

నయా టాటా సియెర్రా పొడవు 4.6 మీటర్లు, దీని వీల్‌బేస్ 2.7 మీటర్లు ఉంటుంది. భవిష్యత్తులో ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సిస్టమ్‌ను కూడా పరిచయం చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Tata Sierra Launched Iconic SUV Returns with Price Starting at Rs 11 49 Lakh

ఇంటీరియర్, ఫీచర్లు
సియెర్రా క్యాబిన్ డిజైన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇది పర్సనల్ లాంజ్ లాగా అనుభూతిని ఇస్తుంది. మెటాలిక్ యాక్సెంట్స్‌తో పాటు, లైట్ కలర్ అప్‌హోల్స్టరీ దీనికి లగ్జరీ లుక్ ఇస్తాయి. డ్యాష్‌బోర్డ్‌పై మూడు స్క్రీన్‌లు ఉంటాయి (ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్, ప్యాసింజర్ డిస్‌ప్లే). దీనికి మెయిన్ అట్రాక్షన్ ఇదే. ఇంత వరకు ఏ కారులో ఇలా మూడు స్క్రీన్‌లు అందించలేదు.

ఇంటీరియర్ కలర్స్ ఎక్కువగా లైట్ కలర్లలో ఉండి, క్యాబిన్‌ను మరింత విశాలంగా చూపిస్తాయి. దీనిలో 12-స్పీకర్ JBL ఆడియో సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే, కనెక్టెడ్-కార్ టెక్నాలజీ ఉన్నాయి.

Tata Sierra Launched Iconic SUV Returns with Price Starting at Rs 11 49 Lakh

సేఫ్టీ, వేరియంట్స్
టాటా కంపెనీ సేఫ్టీకి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుంది. కొత్త సియెర్రాలో కూడా అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ మౌంట్‌లు ఉన్నాయి. దీనికి అదనంగా లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) కూడా ఉంది. దీనికి 5-స్టార్ భారత్ NCAP రేటింగ్ వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ ఎస్‌యూవీ మొత్తం 7 వేరియంట్లలో లభిస్తుంది.. స్మార్ట్‌+, ప్యూర్, ప్యూర్+, అడ్వెంచర్, అడ్వెంచర్‌+, ఎకాంప్లిష్డ్, ఎకాంప్లిష్డ్‌+. పెద్ద సైజు, మూడు ఇంజిన్ల ఆప్షన్, ప్రీమియం క్యాబిన్, ఐకానిక్ డిజైన్‌తో వస్తున్న ఈ కొత్త టాటా సియెర్రా రూ.11.49 లక్షల ప్రారంభ ధరతో కస్టమర్లకు పైసా వసూల్ కారుగా నిలువనుంది. పాత సియెర్రాను అభిమానించేవారికి, కొత్త టెక్నాలజీ కోరుకునే వాళ్లకు ఈ ఎస్‌యూవీ బెస్ట్ ఆప్షన్.

More from DriveSpark

Article Published On: Tuesday, November 25, 2025, 14:44 [IST]
English summary
Tata sierra launched iconic suv returns with price starting at rs 11 49 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+