ఆటోమొబైల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్..టాటా సియెరా దెబ్బకు మారుతి, హ్యుందాయ్ విలవిల
90వ దశకంలో భారతీయ రోడ్ల మీద ఒక వెలుగు వెలిగిన ఐకానిక్ కారు టాటా సీయెరా(Tata Sierra) మళ్ళీ వచ్చేసింది. అప్పట్లో ఈ కారుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే సంచలనాన్ని మళ్ళీ సృష్టిస్తూ, టాటా మోటార్స్ ఈ కారును సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకువచ్చింది.
నవంబర్ 25న ఈ కారును అధికారికంగా విడుదల చేయగా, మొన్న డిసెంబర్ 16న బుకింగ్స్ ప్రారంభించారు. ఇంకేముంది.. సీయెరా పేరు వినగానే జనం ఎగబడ్డారు. కేవలం బుకింగ్స్ మొదలైన మొదటి రోజే ఏకంగా 70 వేల మంది ఈ కారును బుక్ చేసుకున్నారంటే దీనిపై ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం.. దాదాపు 1.35 లక్షల మంది వినియోగదారులు ఈ కారును కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న టాటా డీలర్‌షిప్‌లకు ఈ కార్లు చేరుకుంటున్నాయి.
మీరు కూడా ఈ సరికొత్త సీయెరా ఎలా ఉందో చూడాలనుకుంటే మీ దగ్గర్లోని షోరూమ్‌కు వెళ్లి చూడొచ్చు. ఇక బుక్ చేసుకున్న వారికి జనవరి 15, 2026 నుంచి డెలివరీలు ఇవ్వడానికి టాటా ప్లాన్ చేస్తోంది. అంటే సంక్రాంతి పండుగ వేళ కొత్త సీయెరా రోడ్ల మీద సందడి చేయబోతోంది.

టాటా సీయెరా లోపల చూస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఇందులో మొత్తం మూడు డిజిటల్ స్క్రీన్లు ఉన్నాయి. డ్రైవర్ కోసం ఒకటి, మధ్యలో ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఒకటి ఉండగా.. ముందు సీట్లో కూర్చునే ప్యాసింజర్ కోసం కూడా ప్రత్యేకంగా ఒక 12.3 ఇంచుల స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు.
ఇలా మూడు స్క్రీన్లు ఉన్న కారు ఈ సెగ్మెంట్లో ఇదొక్కటే అని చెప్పాలి. వీటితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం ఆడియో సిస్టమ్, అదిరిపోయే ఇంటీరియర్ డిజైన్‌తో ఈ కారు ఒక లగ్జరీ ఇల్లులా కనిపిస్తుంది.

ఇంజన్ విషయానికి వస్తే టాటా మూడు రకాల ఆప్షన్లను ఇస్తోంది. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, పవర్ కావాలనుకునే వారి కోసం 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (Hyperion), మైలేజీ కోరుకునే వారి కోసం 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి.
అలాగే సేఫ్టీ విషయంలో రాజీ పడకుండా లెవల్-2 ADAS ఫీచర్లను కూడా ఇందులో జత చేశారు. ఇన్ని ఫీచర్లు ఉన్నా దీని ప్రారంభ ధర కేవలం రూ. 11.49 లక్షలు(ఎక్స్-షోరూమ్) మాత్రమే ఉండటం వినియోగదారులను కట్టిపడేస్తోంది.

ఈ కారు రాకతో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి కార్లకు గట్టి పోటీ మొదలైంది. ఒకప్పుడు సీయెరా కారును త్రి-డోర్ (3-door) మోడల్ లాగా చూశాం, కానీ ఇప్పుడు దీనిని ఫైవ్-డోర్ (5-door) మోడల్‌గా, ఫ్యామిలీ మొత్తానికి సరిపోయేలా డిజైన్ చేశారు.
పాత సీయెరా లో ఉన్న ఆ విండో డిజైన్‌ను(Alpine windows) ఈ కొత్త మోడల్లో కూడా కాస్త ఆధునికంగా మెయింటైన్ చేయడం పాత తరం వారికీ, కొత్త తరం వారికీ ఇద్దరికీ నచ్చుతోంది.


Click it and Unblock the Notifications








