మార్కెట్లో ఇక నిన్ను కొట్టే వాడే లేడు మామ.. లగ్జరీ ఫీచర్స్‌తో కొత్త సియెర్రా.. రిలీజ్‎కు ముందే టాటా సెన్సేషన్

భారతీయ కార్ల మార్కెట్‌లో చరిత్ర సృష్టించిన టయోటా సియెర్రా (Tata Sierra) ఎస్‌యూవీ తిరిగి రాబోతోందనే వార్త కస్టమర్లలో భారీ అంచనాలను పెంచింది. ఈ ఎస్‌యూవీ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత లగ్జరీ ఫీచర్లు, అడ్వాన్సుడ్ టెక్నాలజీతో రాబోతున్న ఈ న్యూ-జెన్ టయోటా సియెర్రా టీజర్ వీడియోను కంపెనీ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో కొత్త సియెర్రా చాలా వేగంగా దూసుకుపోతున్న దృశ్యాన్ని చూపించారు. నవంబర్ 25న విడుదల కాబోతున్న ఈ కొత్త ఎస్‌యూవీ డిజైన్, ఇంజన్ స్పెసిఫికేషన్స్, లగ్జరీ ఫీచర్లు, అంచనా ధర వివరాలను ఇప్పుడు చూద్దాం.

భారతీయ కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సియెర్రా ఎస్‌యూవీ విడుదల తేదీ దగ్గర పడింది. ఇటీవల ఈ కారుకు సంబంధించిన మొదటి టీజర్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఒకవైపు గుర్రాల గుంపు పరిగెత్తుతుండగా, పక్కనే ముదురు పసుపు రంగులో ఉన్న కొత్త టాటా సియెర్రా అత్యంత వేగంగా దూసుకుపోవడం చూపించారు.

Tata Sierra SUV First Teaser Out Luxury Features and Affordable Price Expected

ఈ కొత్త ఎస్‌యూవీని నవంబర్ 25న అధికారికంగా మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కారును గతంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఇది ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, అల్లాయ్ వీల్స్‌తో చాలా మోడ్రన్ డిజైన్‌ను కలిగి ఉంది.

కొత్త టాటా సియెర్రా ఐసీఈ (పెట్రోల్/డీజిల్), ఎలక్ట్రిక్ (EV) పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. ఐసీఈ వేరియంట్ల విషయానికి వస్తే.. 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 170 హార్స్‌పవర్, 280 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్.. ఇది 170 హార్స్‌పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Tata Sierra SUV First Teaser Out Luxury Features and Affordable Price Expected

ఈ కార్లు 6-స్పీడ్ మ్యాన్యువల్/ఆటోమేటిక్, 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌లతో వస్తాయి. ఐసీఈ మోడల్స్ 20 కి.మీ వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ మోడల్ 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 627 కి.మీ వరకు రేంజ్ అందించే అవకాశం ఉంది. సియెర్రా ఎస్‌యూవీని అగ్రశ్రేణి లగ్జరీ ఫీచర్లు, అత్యున్నత సేఫ్టీ ఫీచర్లతో అందించడానికి టాటా సిద్ధమవుతోంది.

ఈ కారులో 14.5 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10 స్పీకర్ సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్, కీ లెస్ ఎంట్రీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

Tata Sierra SUV First Teaser Out Luxury Features and Affordable Price Expected

ప్రయాణీకుల సేఫ్టీ కోసం ఇది 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (ABS), ఈబీడీ (EBD), ఏడీఏఎస్ (ADAS) (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360-డిగ్రీ కెమెరాతో రానుంది. కొత్త టాటా సియెర్రా ఎస్‌యూవీ ధర, మార్కెట్‌లో దాని పోటీ గురించి అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ఎస్‌యూవీ కనీసం రూ. 11 లక్షల నుంచి గరిష్టంగా రూ. 25 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర రేంజులో కొనుగోలుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఇది మార్కెట్‌లో మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti Suzuki Victoris), టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్, వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, ఎంజీ ఆస్టర్ వంటి ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

More from DriveSpark

Article Published On: Sunday, November 2, 2025, 14:19 [IST]
English summary
Tata sierra suv first teaser out luxury features and affordable price expected
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+