ఫుల్ ఫీచర్లతో వచ్చిన సియెర్రా ధరలు చూసి గుండెలు బాదుకుంటున్న మారుతి..అది కదా మరి టాటా అంటే
టాటా మోటార్స్ నుంచి కొత్త తరం సియెర్రా (New Gen Tata Sierra SUV) మార్కెట్‌లోకి ప్రవేశించి కార్ లవర్సును ఆకట్టుకుంటోంది. పాత సియెర్రా పేరుకు తగ్గట్టే, కొత్త మోడల్ డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ సామర్థ్యం, ముఖ్యంగా భద్రత (Safety) విషయంలో అద్భుతాలు సృష్టించింది. నవంబర్ 25న విడుదలైన ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ధరల విషయంలోనూ పోటీదారులకు సవాల్ విసురుతోంది. సియెర్రా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.49 లక్షలుగా ఉంది.
టాటా సియెర్రా మొత్తం 7 వేరియంట్లలో లభిస్తుంది.. స్మార్ట్ ప్లస్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్. ప్యూర్, ప్యూర్ ప్లస్ ట్రిమ్‌లు రూ. 12.99 లక్షల నుంచి, అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్ ట్రిమ్‌లు రూ. 15.29 లక్షల నుంచి అందుబాటులో ఉన్నాయి. తాజాగా, టాటా అత్యంత ఖరీదైన మరియు ఎక్కువ ఫీచర్లు కలిగిన అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్ వేరియంట్ల ధరలను కూడా ప్రకటించింది.

అన్ని వేరియంట్ల ధరలు ప్రకటించడంతో బుకింగ్‌లు మరింత జోరందుకుంటాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. టాప్-ఎండ్ మోడళ్ల ధరలు రూ.17.99 లక్షల నుంచి రూ.21.29 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇంత అడ్వాన్సుడ్ ఫీచర్లతో వచ్చిన ఈ టాప్ వేరియంట్లకు కూడా ధరలను అదుపులో ఉంచడం టాటాకు పెద్ద సానుకూల అంశం.
సియెర్రా ఎస్‌యూవీ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది: 1.5 లీటర్ NA పెట్రోల్ (106 bhp), 1.5 లీటర్ డీజిల్ (116 bhp), అత్యంత శక్తివంతమైన 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (160 bhp). ట్రాన్స్‌మిషన్ ఎంపికల్లోనూ టాటా వైవిధ్యం చూపింది. NA పెట్రోల్‌కు 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి.

డీజిల్, టర్బో-పెట్రోల్ ఇంజిన్‌లకు 6-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టాప్-స్పెక్ అకంప్లిష్డ్ ప్లస్ ట్రిమ్‌లలో 1.5 లీటర్ NA పెట్రోల్ ఇంజిన్ పూర్తిగా తొలగించి, కేవలం శక్తివంతమైన టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లను మాత్రమే అందించారు.
సియెర్రాలో ఫీచర్ల విషయంలో టాటా ఎక్కడా రాజీ పడలేదు. అకంప్లిష్డ్ ట్రిమ్‌లో లెదర్ అప్‌హోల్స్టరీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు (వేడి లేదా చలికి సీట్లు అడ్జస్ట్ చేయవచ్చు), లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), ప్యాడిల్ ల్యాంపుల వంటివి ఉన్నాయి.

వీటితో పాటు 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, 6-వే పవర్డ్ డ్రైవర్ సీటు, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, 12-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే వంటివి కూడా ఉన్నాయి.
ఇక అత్యంత విలాసవంతమైన అకంప్లిష్డ్ ప్లస్ ట్రిమ్‌లో ఈ ఫీచర్లన్నీ ఉండటంతో పాటు, 12.3 అంగుళాల ప్యాసింజర్ డిస్‌ప్లే, పవర్డ్ టెయిల్‌గేట్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన డ్రైవర్ సీటు, ఎక్స్‌టీరియర్ లైట్లలో వెల్‌కమ్, గుడ్‌బై యానిమేషన్లు, ఆటో-డిమ్మింగ్ IRVM వంటి లగ్జరీ ఫీచర్లు కూడా ఉన్నాయి. టెక్నాలజీ, లగ్జరీ, పవర్‌ను మిళితం చేస్తూ టాటా సియెర్రా మార్కెట్‌లో తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications








