ఢీ అంటే ఢీ.. టాటా సియెరా vs మారుతి గ్రాండ్ విటారా.. మైలేజ్, ఫీచర్లు, ధరలో ఏ SUV బెస్ట్?
భారతీయ మార్కెట్‌లో టాటా మోటార్స్ (Tata Motors) తాజాగా తమ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ టాటా సియెరా (Tata Sierra)ను లాంచ్ చేసింది. మార్కెట్‌లోకి రాగానే దీనిని నేరుగా మారుతి సుజుకి పాపులర్ గ్రాండ్ విటారా (Maruti Grand Vitara)కి గట్టి పోటీదారుగా భావిస్తున్నారు. ఈ రెండు ఎస్‌యూవీలు కూడా మంచి ఫీచర్లు, విభిన్న ఇంజన్ ఆప్షన్లు, ఆకర్షణీయమైన ధరలతో అందుబాటులో ఉన్నాయి. అయితే, మైలేజ్, ఫీచర్లు, సేఫ్టీ, ధర వంటి అంశాలలో ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది చాలా మంది కొనుగోలుదారుల సందేహం. ఆ వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.
ఇంజన్, పర్ఫార్మెన్స్
ఇంజన్ విషయంలో రెండు కార్లలోనూ 1.5 లీటర్ సామర్థ్యం ఉన్న ఇంజన్లు ఉన్నాయి.. కానీ పర్ఫామెన్స్ వేరుగా ఉంటుంది.
టాటా సియెరా: ఇందులో మూడు రకాల 1.5 లీటర్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఇంజన్లు 75.8 కిలోవాట్ల పవర్, 139 Nm టార్క్ అందిస్తాయి. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

మారుతి గ్రాండ్ విటారా: ఇది పెట్రోల్, సీఎన్‌జీ, హైబ్రిడ్..అనే మూడు ఇంజన్ ఆప్షన్లలో వస్తుంది. ఈ 1.5 లీటర్ ఇంజన్ 92.45 PS నుంచి 103.06 PS వరకు పవర్, 122 Nm నుంచి 136.08 Nm వరకు టార్క్ ఉత్పత్తి చేస్తుంది. గ్రాండ్ విటారా కూడా మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
ఇక మైలేజీ విషయంలో మారుతి గ్రాండ్ విటారా స్పష్టంగా ముందుంది. ఇది లీటరుకు 19.38కిమీ నుంచి హైబ్రిడ్ మోడల్‌లో ఏకంగా లీటరుకు 27.97కిమీ వరకు మైలేజీ ఇవ్వగలదు.
ఫీచర్లు: ఏది ప్రీమియం?
ఫీచర్ల విషయంలో రెండు కార్లు బాగానే ఉన్నప్పటికీ టాటా సియెరా మరిన్ని అడ్వాన్స్‌డ్, ప్రీమియం ఫీచర్లతో వచ్చింది.
టాటా సియెరా ప్రత్యేకతలు: ఇందులో ఏకంగా మూడు స్క్రీన్‌ల సెటప్, HypAR HUD, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 12 స్పీకర్ల డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సౌండ్ సిస్టమ్, 5G కనెక్టివిటీ, వెంటిలేటెడ్, ఎలక్ట్రిక్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.

మారుతి గ్రాండ్ విటారా: ఇందులో కూడా పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి మంచి ఫీచర్లు ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, సౌండ్ క్వాలిటీ, ప్రీమియం ఫీచర్ల పరంగా టాటా సియెరా అడుగు ముందుకేసింది.
సేఫ్టీలో ఎవరు బెస్ట్?
సేఫ్టీ విషయంలో రెండు కార్లు మోడ్రన్ ఫీచర్లతో వస్తున్నాయి.
టాటా సియెరా: ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), ESP, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-హోల్డ్, 360 కెమెరా మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

మారుతి గ్రాండ్ విటారా: ఇందులో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 కెమెరా, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ముఖ్యమైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. లెవెల్-2 ADAS వంటి అత్యంత కీలకమైన సేఫ్టీ టెక్నాలజీని అందించడం ద్వారా టాటా సియెరా సేఫ్టీ విషయంలో కొంచెం పైచేయి సాధించింది.
ధర, చివరగా
మారుతి గ్రాండ్ విటారా ప్రారంభ ధర రూ.10.77 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ మోడల్ ధర రూ.19.72 లక్షల వరకు ఉంటుంది. టాటా సియెరా ప్రారంభ ధర రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది, మిగిలిన వేరియంట్ల ధర ఇంకా ప్రకటించలేదు.
ప్రారంభ ధర, మెరుగైన మైలేజ్ (ముఖ్యంగా హైబ్రిడ్/CNG ఆప్షన్లు) కారణంగా మారుతి గ్రాండ్ విటారా ప్రస్తుతానికి ఎక్కువ సరసమైన ఆప్షన్ గా కనిపిస్తోంది. అయితే, మీరు అడ్వాన్సుడ్ ఫీచర్లు, లెవెల్-2 ADAS, ప్రీమియం టెక్నాలజీని కోరుకుంటే టాటా సియెరా వైపు మొగ్గు చూపవచ్చు.


Click it and Unblock the Notifications








