ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్‎గా నిలిచిన టాటా సుమోలు.. కొత్త హంగులతో మళ్లీ వచ్చేస్తున్నాయ్

టాటా మోటార్స్ దేశీయంగా అత్యంత విశ్వసనీయ ఆటోమొబైల్ తయారీదారు. టాటా సుమో అంటే తెలియనివారుండరు. టాటా మోటార్స్‌ కంపెనీ ప్రతిష్ఠాత్మక వాహనమది. అలాగే కొన్నాళ్ల క్రితం కంపెనీ సుమో, నానో కార్లు దేశీయ రోడ్లపై బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా ఈ మధ్య తరగతి ప్రజల్లో హాట్ ఫేవరెట్లుగా నిలిచాయి. అప్పట్లో అవి పెద్ద సంఖ్యలో అమ్ముడయ్యాయి. అయితే, వివిధ కారణాల వల్ల సుమో, నానో కార్ల అమ్మకాలు నిలిచిపోయాయి.

అత్యంత తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్స్ తో మరోసారి టాటా సుమో రోడ్డు ఎక్కబోతుంది. ఒకప్పుడు ఆటో రంగాన్ని శాసించిన ఈ వాహనం ఎస్‌యూవీలో ఫస్ట్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరోసారి మార్కెట్ ను షేక్ చేసేందుకు టాటా సుమో రెడీ అయింది. త్వరలోనే దీనిని మార్కెట్ లోకి రిలీజ్ చేసేందుకు టాటా కంపెనీ రెడీ అవుతోంది.

Sumo Gold

ప్రస్తుతం ఈ రెండు మోడల్స్ కొత్త రూపాల్లో రీ రిలీజ్ అవుతాయని తరచూ పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఈ సుమో, నానో కార్లను ప్రవేశపెట్టిన తర్వాత వాటి అంచనా ధర, పర్ఫామెన్స్, ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా టాటా సుమో ఎంపీవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మోడల్‎ను రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల ధరకు (ఎక్స్-షోరూమ్) కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు.

ఈ కారు 7 లేదా 9 సీట్ల వెర్షన్లో వచ్చే అవకాశం ఉంది. అయితే, కొత్త సుమో ఎంపీవీ విడుదలకు సంబంధించి టాటా మోటార్స్ నుంచి ఎలాంటి అధికారిక వివరాలు అందుబాటులో లేదు. కొత్త టాటా సుమో కారు రెండు పవర్ ట్రెయిన్లలో అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆఫ్షన్ ఉంటుందని భావిస్తున్నారు.

Tata Sumo Front

ఇందులో మాన్యువల్ గేర్‌బాక్స్ కూడా ఉండవచ్చని తెలుస్తోంది. ఈ కారు సగటు మైలేజ్ లీటరుకు 18 నుండి 20 కిలోమీటర్లు ఉంటుందని అంచనా. ఈ ఎంపీవీలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. సేఫ్టీ ఫీచర్లలో 6 ఎయిర్‌బ్యాగులు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), 360-డిగ్రీ కెమెరా ఉంటుంది.

టాటా నానో కూడా కొత్త డిజైన్లో విడుదల అవుతుందని ఊహాగానాలు చేస్తూ మీడియాలో అప్పుడప్పుడు వార్తలు వస్తున్నాయి. కానీ దీని గురించి కూడా ఖచ్చితమైన సమాచారం లేదు. ఈ కారు 3 నుంచి 4 లక్షల ధర (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ కావచ్చని చెబుతున్నారు. 4సీట్ ఆఫ్షన్ కూడా సాధ్యం కావొచ్చు.

అలాగే కొత్త టాటా నానో మరింత పవర్ ఫుల్ పెట్రోల్ ఇంజన్ ఆఫ్షన్ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. ఇది గరిష్ట హార్స్‌పవర్, న్యూటన్ మీటర్ల పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. ఇది లీటరుకు 30 కిలోమీటర్ల మైలేజీని అందించగలదని అంచనా.

Tata Nano Front

ఈ నానో కారు బయట మరింత అధునాతన డిజైన్‌ను కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ఇది కొత్త రంగులో లభిస్తుందని చెబుతున్నారు. దీనితో పాటు, ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్-ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ కండిషనింగ్, మ్యూజిక్ సిస్టమ్‌తో సహా డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, March 22, 2025, 7:00 [IST]
English summary
Tata sumo nano to make a comeback expected price features more
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+